మహనీయులకు నివాళి
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
జయంతులు
వివాకానందుడైన
విప్లవ మూర్తులైన
రాజకీయ ఉద్దండులైన
జాతికి మార్గం చూపిన
మహనీయులు ఇంకెవరైనా
జన్మదినాలు ఉత్సవాలు
ఉపన్యాసాలు కాదోయ్
కావలిసింది .
వారందించిన సద్భొదలు
స్వీకరించి సత్కర్మలనాచరించు
ఆడంబరాలు వదలి ఆచరణలో
సమాజ కళ్యాణ మనే
యజ్ఞానికి నీవూ
ఓ సమిధావు కా
అదే
ఆ మహనీయులకు
నీనివాళి .