కుహూ కుహూలు
నా హైకూలు –
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
1.
అక్షరాలవి
అదుపులో వుండవు .
అయ్యోరూర్కోడు .
2.
అక్షరదోషం
ఆగ్రహిస్తాడతడు
భాషంటిష్టం
3.
వెనుకనుంచి
మొట్టిపోవునతడు
కపిల్రాముడు .
4.
సాహిత్యహితం
అత్మీయస్నేహితులు
అండదండలు
5.
వురుములవి
ప్రసవవేదనలు
వర్షజననం
6.
మేఘశోధన
వనాలు వెదుకుతూ
నిండు గర్భిణి.
7.
కోతి గంతులు
కొండకు కోపం కావు
మురిపాలవి
8.
ఫైటింగులైదు
మిడ్డీ డ్యాన్సుల్నాలుగు
కరెంటు తీగ
9.
వాయసమది
ముక్కుపుటంమారిస్తే
విశ్వ సుందరే !
10.
చుట్టాలోస్తారు
కాల్దీసికాలుయేస్తే
నమ్మింది కాలం .
11.
కరకట్టలు
స్వేచకు అడ్డుగోడ
నదికి కోపం
12.
రామచిలుక
పలుకులు మురిపెం
గురువుండాలి
13.
ఎన్ని వర్ణాలో
సీతాకోక చిలుక
చీరకు స్ఫూర్తి.
14.
సీతాఫలము
ఆరోగ్యఫలాహారం
అమృతభాండం .
15.
ఉసిరిచెట్టు
ఆరోగ్య సంజీవని
పెంచు పోషించు.
16.
సమూహవిందు
కార్తీక వన భోజ్యం
చెట్టు పూజ
17.
వనభోజనం
సామూహిక కౌగిళ్ళు
సంఘటితము.
18.
బడుగుజీవి
బ్రతుకు పుస్తకాలు
చెదలట్టాయి.
19.
సంస్కృతి గ్రంధం
సంప్రదాయము పుట
మానవాక్షరం.
20.
సంప్రదాయము
నిర్ణయమాచరణ
సంస్కృతీ అంశం.
21.
కట్టుబొట్టులు
సంస్కృతీ వారధులు
శిధిల స్థితి.
22.
చీరెకుచ్చీళ్ళు
పంచల బిళ్ళ గోచి
అందాల కందం
23.
వెల్లుల్లి తిను
గుండెకు సంరక్షణ
బ్రతుకుభవ్యం
24.
కరివేపాకు
పరమౌషధి నిత్యం
నిర్లక్ష్యించకు.
25.
పళ్ళకు కళ్ళు
సహకారం నవ్వుకు
ఆభరణాలు
26.
చతుర్భాషణం
తనికెళ్ళాభరణం
హాస్యం ఆరోగ్యం.
27.
తీగకు కంచె
చేట,పీట కు గోడ
ఆలంబనలు.
28.
జల్లెడ లకు
చిల్లులు అవసరం
జల్లించాలిగ.
29.
గుర్రము కళ్ళెం
గంతలు,జీను,పగ్గం
రౌతు సౌలభ్యం.
30.
తాడనలున్నా
గుర్రం రౌతు బాంధవ్యం
అవినాభావం.
31.
గుర్రం గిట్టలు
పరుగుకు తిప్పలు
నాడా తాపడం .
32.
గునపానికీ
తప్పవు కాల్పులు
సుత్తిదెబ్బలు
33.
రోగక్రిములు
మనుజులు ధాత్రికి
ప్రక్రుతే వైద్యం
34.
తలంటుస్నానం
తుఫానులు భూమికి
ఆత్మాలింగనం.
35.
భూదేవికది
స్నానం జలప్రళయం
ఆశ్రితులకు
36.
మేఘ ఘర్షణ
ఉరుము మెరుపులు
గగన వేదన
37.
మేఘగర్జన
ప్రసవవేదనలు
వర్షంజననం.
38.
రాట్నం,మగ్గము
యేకు, తకిలీ, దారం.
చరిత్ర పుటలు.
39.
నాడు నేడున్నూ
గ్రుహోపకరణాలు
దండెం పెద్దన్న
40.
తకిలీ,రాట్నం
చేనేత మూలాలు
సులు సూత్రాలు
41.
పూవులే అన్నీ
రంగుల్లో వైవిధ్యాలే
ప్రక్రుతి చిత్రం !
42.
ఫోటోతీయంటూ
పోజిస్తూ కూర్చున్నది
పక్షి మోడ్లింగ్.
43.
కైలాసగిరి
శివపార్వతులు
విశాఖశోభ.
44.
కొమ్మలాకులు,
చెట్లకు వలువలు
బహు నిబ్బరం
45.
తరువులకు
ఆదరువులు యిట
భవనాలేగా
46.
చెట్టు విద్యుత్తు
పరస్పరం విరోధం
వృక్షనిర్మూలం
47.
కోడి పుంజుకు
ప్రత్యామ్నాయం కాకులు
నిద్ర లేపగ.
48.
వేకువ శబ్దం
కాకుల అరుపులు
మెల్కొలుపులు.
49.
ముప్పూటలింత
తిండి వైద్యం ఆదరం
వృద్ధులర్హులు.
50.
పండుటాకులు
పరస్పరం ఓదార్పు
వృద్ధాశ్రమాలు.
51.
కలకలాన్ని
అక్కున చేర్చుకుంది
సాయంత్రం చెట్టు.
52.
కిలకిలలు
వేకువలో వృక్షాలు
ప్రసవగీతం
53.
కోయిల గానం
కాకులది మెచ్చవు
వేకువే యిష్టం.
54.
పచ్చదనం తో
నేడు పల్లవిస్తోంది
పర్యావరణం.
55.
వెలుగులలో
కొదవలేని అందం
చిచ్చుబుడ్డిదే
56.
నలిపివేసే
చేతులువుంటాయని
తెలీనితనం
57.
ముగ్ధత్వం
మొగ్గలకు ఎంతటి
అమాయకత్వం
58.
ఎందుకు అలా
రాబోయే కాలం లోకి
ఎదురు చూపు
59.
తప్పదు బాబూ
వర్తమానమే కదా
నిత్య జీవనం
60.
గతకాలపు
జ్ఞాపకాలు ఇపుడు
నెమరు వేత
61.
సృజనలు
మానవ మేధలలో
ఆవిష్క్రుతాలు.
62.
యువ మేధలు
ఎగుమతి సరుకు
విదేశాలకు
63.
మన భూగర్భం
భోంచేసిన భోషాణం
గాంధారి పర్వం
64.
నివురుగప్పి
అణుక్షిపనులెన్నో
భూమి టైంబాంబ్
65.
ఒజోన్కంతలు
భూమాతకు మంటలు
లగ్జరీ ముఖ్యం
66.
తలలో పేలు
మనుషులంట పేరు
సంస్కారం లేదు.
67.
పేల మందెట్టి
తలంటు స్నానంజేశా
జుట్టు ఊడింది.
68.
ధరిత్రిన్నేను
చేతులు లేవు నాకు
గాల్నీరే సాయం
69.
తలంటు స్నానం
గాలి నీరు ధాటికి
గుండు వికారం .
70.
గుచ్చుతుంటారు
ఒడలంతా సూదులు
బోరు బావులు
71
కాలుష్యం నాగు
కాటేయక మానదు
ప్రళయారవం .
72.
క్లీన్ స్కై చూడు
మేఘం ఒక్కటీ లేదు
దిగాలుమంది.
73.
ఆత్మశుద్ధి తో
పరిసరాలు శుద్ధం
ముందు కడుగు.
74.
కాలనీవాళ్ళ
చెత్తంతా అందులోనే
ఖాళీ ప్లాటుంటే.
75
పిచ్చోని సతి
అందరికీ లోకువే
కట్టని ప్లాట్లు
76.
ముప్పది ఏండ్లు
పుట్టుక ఎక్కడనో
నా సేవలోనే
77.
ఎల్లెమ్మెలెక్సి
నాణ్యత మహాద్భుతం
ఈనాటికిన్నీ’
78.
మొరాయించడం
నేటికీ ఎరుగదు
ఆత్మీయ నేస్తం
79
తానుంటే ధైర్యం
వెన్నుకు ఆలంబన
నిశిలోనైనా
80.
కుటుంబం సర్వం
ఐదుగురం ప్రయాణం
భరించిదది.
81.
నేటికీ ప్రియం
నా ఆత్మీయ నేస్తమే
నేనంటే ప్రాణం.
.
.