ఫెంటోలు ,
మితాక్షరి
భావం దారం,
అక్షరాలు విరులు .
వ్యక్తం అవ్యక్తం దృవాలు భిన్నం.
వాక్యం అక్షరమాల భావం నిభిడీకృతం.
అక్షరం నిర్వికారి ..పదమై భావసంహిత .
పడుగుపేకలకవితనేత
అక్షరాల భవ్యాక్షరి
మితాక్షరి .
——–రచన : నూతక్కి రాఘవేంద్ర రావు .
……………………………………………..
గతం లో ఫెంటోలు గ్రూప్ తొలినాళ్ళలో ఆగ్రూప్ నిర్మాణ దశలో వ్రాసిన నా ఏకవాక్య రచనలలో కొన్ని ,
మిగతా మితాక్షరి .
——————————————————————————————————-
1) ఆకు రాలి పూలోస్తే వసంతం కూస్తుంది కుహుమని.
2) గొంతుందని అరిచినంత సందేశం కాబోదది.
3) కావాలనుకుంటే కోల్పోవడానికి సిద్ధపడక తప్పదు .
4) ఆశయ సాధన లొ ఎవరో అడ్డంకని ఏడవడం చేతకాని తనం.
5) పాల కోసం తోకేత్తి నిలబడితే ప్రయోజనం శూన్యం తన్నులు తప్ప.
6) శతాబ్దాలక్రితం జరిగిన అన్యానికి నేడు మరెవరినో భాధ్యులనడం విజ్ఞత కాదు.
7) నాడెవారో చేసిన అన్యాయాని కి నేడెవరో భాధ్యులా ?
8) మూర్ఖుడు హితుని ద్వేషిస్తాడు విచక్షణా రహితుడు.
9) వర్తమానం త్రుటికాలం .
10 )మనిషి బ్రతుకు త్రుటికాలమే.
11) భవితలో జీవించడం అసాధ్యం… వర్తమానంలోనే జీవిస్తాం కనుక.
12) భూత కాలం శోచనీయం భవిత యోచనీయం .
13) నిండు తేనెపట్టు దోపిడీ పాలు .
14) గాలిలోఎగిరింది ఆకు చీమ కూడా ఫ్రీగా.
15) కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు .
16 )మ్రోడు నీడ నివ్వదు,గూటికి తావునివ్వదు .
17)చెట్లు ,పండ్లు, పక్షులు, విత్తులు, మొక్కలు ప్రకృతి ప్రక్రియ.
18) ఆకులు రాలుతున్నాయి రాలుగాలం.
19)మా, నా,స్వార్ధ వ్యక్తీకరణలు .
20)మీది, మా ది , నీది , నా ది , మీరు, మేము, వేర్పాటు వేదనలు.
21)మన, మనం, సౌహార్ద్ర భావనలు
22)గాలిలో ఎగిరే ఆకు చీమ కూడా ఫ్రీగా .
23)చెట్టున పండుటాకు బిక్కు బిక్కుమంటూ
24)మనం ఒకటి అన్న బలం నిలిచి వుండు కలకాలం .
25) ధనం ప్రపంచాన్నిశాసిస్తున్దంకోవడం పొరబాటు.
26)ధనంతోటి కొన్నబలం వుంటుందోక క్షణకాలం.
27) కుక్షె జగతిని శాసిస్తోంది .
28)ఆకలి ఆవిష్కరణలకు మూలం.
29) దినకరుడు శక్తి ప్రదాత .
30) జలం దివ్యౌషధం.
31)ధాత్రీ పరిరక్షణ జీవకోటి సంరక్షణ.
32)జీవకోటికి ఆధారం ధరిత్రి.
33)ఊపిరి జీవుల ప్రాణాధారం.
34)వుచ్వాసం నిశ్వాసం మంచి చెడులు.
35)ఉచ్వాస నిశ్వాసాలే ఊపిరి .
36) భావోద్వేగం అక్షర సంకలనం కవిత .
37) నూతిలో రాయేస్తే ప్రతిబింబం అలజడి.
38) సంపాదనకన్న పొదుపు మిన్న.
39) సంఘీభావం సహజీవనం చెదపురుగులు .
40) క్రమశిక్షణకు ఆదర్శం చీమలు.
41) శ్రమ జీవన సౌందర్యం తేటి .
42) తేటికి ముద్దులిచ్చి మురిసినవి విరులు
43) సాహసం వీరుని ధీర లక్షణం.
44) మహా భారత కాలం అధర్మానికీ ఓ ధర్మం వుండేది .
45) రెక్కలు తెగిన పక్షులు వృద్ధులు.
46) ధర్మాధర్మాలు ఊసరవెల్లులు .
47) ఒకరికి న్యాయం మరొకరికి అన్యాయం.
48) న్యాయాన్యాయాలు సందర్భోచిత విన్యాసాలు.
49) భాషా ప్రవీణుల అహంకార ఆభిజాత్యం సరళ త పై ఉక్కు పాదం.
50)పాతా ళం లొ తెలుగు భాషా వ్యాప్త వుద్యమ తీరులు.
51)మెలుకువలోనిద్ర నటన తెలుగు భాష పై ప్రభుత.
52)భాషకు వెలుగు అంత ర్జాలంలో ఆధునిక యువత.
53)భాషకు వెలుగు అంత ర్జాలంలో ఆధునిక యువత.
54)తెలుగు భాష ఔత్సాహికులు ..ఉత్సాహపు జ్వాలలు …నిబంధనల నీళ్లు.
55) ఉచ్చ్వాసం నిశ్వాసం ప్రాణానికి ప్రాణం.
56) చేలో కలుపు, కడుపునున్నమలినం, నిత్యం వర్జితం.
57) విశ్వంలో దినకరుడొక రేణువు… మరి మనిషి?
58) పృధ్వీ విధ్వంసం కాళిదాస విన్యాసం.
59) రాజైనా పేదైనా తినేది పిడికెడే.
60) దండుకొన్న లక్షల కొట్లు,లెక్కింపబడుతున్న ఊచలు .
61) ఎవరికి వారు నేనొక్కడినే, రాజుగారి పాల సేకరణ అన్నీ నీళ్లు
62) నాకేందుకులేమ్మని నిర్లిప్తత లొ ప్రజలు .. నడ్డి విరుస్తూ అదినాధులు అధికారులు .
63) సంకల్పం పట్టుదల సాధనకు పరికరాలు
64) సౌందర్య ప్రదర్శన బట్టలెందుకిక మిల్లులేందుకిక.
65) ధ్యేయానికి అధైర్యానికి పొసగదు.
66) భూతకాలం అనుభవాల దొంతర.
67) అనుభవాలు వర్తమానానికి నియంత్రణా ఘంటికలు.
68) అనుభవం భవితకు జీవన మార్గదర్శకం .
69) రెక్కలు ఎగిరెందుకే, కొన్ని పక్షులు ఎగరలేవు.
70) వర్తమానం భూతకాలపు ఓ విస్తృత ధ్ర్హుహ్క్కోణపు విశ్లేషణ.
71) నిజ జీవన సంగీతం లొ అపస్వరాలెన్నో
72) తొంభై శాతం నగ్నం బికినీలాట.
73) ఎవరికి వారే ఘనులు మహాభారత యుద్ధం లొ
74) పద పదాన స్రవించిన భావం రాగ ప్రవాహమై పారుతోంది.
75) ధనం తోటి కొన్న బలం ఎంతో కాలం నిలబడదు.
76) కనలిన హృదయం సొలసిన మనిషి వేసట లొ మనుషులు.
77) బోసినవ్వుల వెలుగులు మనసుకు సాంత్వనలు.
78) సృజనలు, ఆవిష్కారాలు , అంతరంగ సంవేదనలు.
79) ఆశన్నది లేకుంటే ఆకాంక్షలు వుండవు.
80) నాకెందుకులే యని నిర్లిప్తతలో ప్రజలు .
81)ప్రజల నడ్డి విరుస్తున్న అదినాధులు, అధికార గణం
82) ఉచ్చ్వాసం నిచ్చ్వాసం ప్రాణానికే ప్రాణం .
83) మా నా మన స్వార్ధ వ్యక్తీకరణలు.
84) ఆకులు రాలుతున్నాయి …రాలుగాలమొచ్చింది .
85) దండుకున్న లక్షల కోట్లు …ఊచలు లెక్కింప బడుతున్నాయ్ .
86) రాజైనా పేదైనా పొట్టకు పిడికిడు మెతుకులు చాలు.
87) విశ్వ పరిమాణం లొ దినకరుడు ఒక రేణువు . మరి మనిషి ?
88) ఎవరికి వారు నేనొక్కడినే …రాజుగారి బిందెల్లో అన్నీ నీళ్లె.
89) సమస్య లేకుంటే పరిష్కారం మూసినా పుస్తకం ?
90) అమ్మమ్మ నాన్నమ్మలు యువతకు వ్యక్తిత్వాలు.
91) గుండెలోతుల దాగి పుట్టింటి మమతలు అత్తింటి కేగే
92) వేవేల భావనల సంద్రం ఓ చిరు చిత్రం .
93) వికృత ప్రేమ భావనలు నికృష్ట వేదనలు యాసిడు దాడులు.
94) కళాకారుడు అమరుడు ఆతని వ్యక్తిగత లోపాలు సామర్ధ్యాలతో సహా .
95) కొబ్బరి చెట్టున కాయలు చెట్టెక్కడం తెలియదు ….మొక్క పెట్టగానే చెట్టెక్కడం నేర్చుకో.
96) తేనే తుట్టె నిర్మాణం అద్భుతం, తేటి కూర్చు మధువు మధురం, తుట్టె కదిపావో కష్టాల పాలు.
97) సమాజం ఓ కుటీరమైతే సంస్కృతి ,సంప్రదాయాలు రెండు నిట్టాళ్ళు.
98) పెదవి దాటిన మాట తుపాకి వీడిన తూటా .
99) కులం లేదు మతం లేదు కడుపోక్కటే హితం .
100) కాలంశకటం. చక్రంలొఆకులం ,తిరగక తప్పదు.
……………………………………………………………………………………………………………
101) కుక్షి నిండితే ఆభిజాత్యం హూంకరిస్తుంది .
102) కులం అదో ఆభిజాత్య దాహం
103) కుక్షి కొఱకు వృత్తి కులమై కల్లోలమై.
104) ధ్యేయ ముంటే అధైర్యమెందుకు ?
105) కవికి ప్రోత్సాహం ..ఉత్సాహం ఆలంబన .
106) అభినందన సృజనకు ఆలంబన .
107) భావ వేదనలు అక్షర పద సంకలనాలు .
108) ఎర్రగా కాల్చి సుత్తి వేటుతోనే మలుగు ఇనుము .
109) రెచ్చగొట్టినా రెచ్చి పోకు అది సంయమనం.
110) సందిగ్ధం తటపటాయింపు రైలు వెళ్ళిపోయింది.
111) రెచ్చి పొతే సంఘర్షణ లక్ష్యం నిర్వీర్యం.
112)ఒడిదుడుకుల వాస్తవాల క్రీనీడల్లో పారాడేది జీవితం .
113) కష్టమంటూ లేకుంటే సుఖం విలువ ఇంకెక్కడ?
114) వెలుగులే లేనప్పుడు నీడలనే మాటేక్కడ ?
115) పల్లమంటూ లేకుంటే ఎత్తుకు విలువెక్కడ?
116) నాడన్నది ఉన్నపుడే నేటికి వునికిక్కడ .
117) రేపటి కట నేడు నిన్న .
118) నిన్నకు అది నేడు రేపు
119) మొన్నకు నిన్న రేపు, నేడై తది అది ఎల్లుండి .
120) ప్రోత్సహించడం నా విధి..మంచియని భావించినపుడు.
……………………………………………………………………….
121) నా వ్యక్తీకరణలు మనో జనిత వేదనలు.
122) భావాక్షర సంకలనం పదం .
123) పదాలు ఇమిడ్చినంతనే కవిత కాదు.
124) కవిత్వం భావాక్షర భంగిమ ..
125) ప్రేరణ ఆత్మీయ ఆలంబన .
126) ప్రోత్సాహం సృజన ఆవిష్కారం.
127) విడి విడిగా అక్షరాలు సంకీర్ణం .. పదం
128) కాలంనిత్య ప్రవాహం జీవితం నదిమధ్యలో లంక .
129) అన్నం పరభ్రహ్మస్వరూపం మెతుకుల తల్లులేవరో .
130) తుమ్మెద ఝుంకారం విరికన్నియ తన్మయం .
131) కోటీశ్వరుడు కారు దిగి నడుస్తున్నాడు.చిత్రం! తన కాళ్లతోటే.
………………………………………………………………
మితాక్షరి .
…………………..
1.నిజం “ఎవడి ముద్ద వాడే నమిలిమ్రింగాలి.
2.గంగిరెద్దు, సన్నాయి మేళం పర్వదినం .
3.సంపాదనలో జీవితం ఖతం ఎవరికోసం !
4.బిలియనీరంట!.ఆత్రంగా చూశా ! అందరిలానే చేతులు.
5.రాలింది ఆకు ..మరుసందె వేళ.
6.తాను తినబోతూ పిల్లలు తిన్నారా … ఆరా తీసే వాడు నాన్న.
7. కలోగంజో తాతిన్నాసంతు సొమ్మునాశించడు నాన్న .
8.పగలెంత తిట్టినా ,నిద్రించే బిడ్డల్ని ఆర్తిగా చూసుకొనేవాడు నాన్న .
9. ” కవి కి ,కవిత్వానికి, కవితత్వానికి, వ్యక్తిత్వం ఒకటే” …..
10. “నా గుండెలో నీవు “
11. “హృదయం నర్తకి “
12. “గుండె గాయని “.
13. ” మమత ఔషదం”
14. “మనసు సంచారి”
15. “ఓదార్పుధన్వంతరి”
16. స్పర్శ సాన్నిహిత్యం .
17. హితం మంచికోరు .
18. ద్వేషం విధ్వంసకారి .
19. సహకారం సమైక్యత.
20.శిధిలం…గత వైభవ సాక్ష్యం .
21. అభిమతం అభిజాత్యమైతే మతం .
22. భూతం అనుభవం.
23. భవిత ఊహాన్వితం .
24. వర్తమానం వాస్తవం తృటికాలం.
25. జీవితం త్రుటుల సంకలనం.
26.ఓంకారం భవ్య నాదం .
27. వుస్చ్వాసం నిశ్వాసం శ్వాస.
28. నిప్పుకు చదలంటదు.
29. తప్పుకు సిగ్గుండదు. 3
0.తప్పొప్పులకతీతం నిజం .
31. ఆకులాట చిరుగాలి స్నేహతుడు .
32. రేయిదాక్కుంది వేకువన్నభీతి .
33. ఉడత కొమ్మూపింది కాయ రాల్లా!
34. పిల్లలు, రాళ్ళు. పళ్ళు రాలాయి .
35. బాంధవ్యం ఆర్ధికం నేడు .
36. చుట్టరికం హార్ధికం నాడు.
37. స్వార్ధం విద్రోహపు తొలిమెట్టు .
38. రచ్చబండ సొల్లుకబుర్ల సామ్రాజ్యం .
39. అత్యాశ అనర్ధం .
40.తృప్తిలో ఎంతో ప్రశాంతత.
41. సూర్యకాంతి మనోక్రాంతి.
42.పథ్యం ఔషధం.. ఖర్చులేనిది.
43. మానవత్వానికి …. కరుణ ఆభరణం .
44. ఆనందం గులాబి…. చిరాకు ముల్లు.
45.అసహనం సాధనలో అవాంతరం .
46. “మనం” ఐక్యతా సంకేతం.
47. నేనన్నది ఒంటరితనం.
48. వాడు అనడం దూరం.. మనం దగ్గరతనం .
49. ఎవడికి వాడు ఏకాకి .
50. నువ్వు,నేను,వేరుతనం .
51. కలుద్దామా మనమౌదాం.?
52. నాకీర్ష్య ..పళ్ళన్నీ ఉడతకే
53. “దశాక్షరి మితాక్షరి” .
54. తలపు.. వ్యక్తం అంతర్భాహ్యం.
55. వ్యధ- రోదన అంతర్బాహ్యం.
56. దైవం-గోపురం అంతర్బాహ్యం.
57. వేరు వృక్షం అంతర్బాహ్యం .
58. చెట్లు సత్రాలు…పక్షులావాసం.
59. గిజిగాడు శిల్పి గూడద్భుతం.
60. తేనెతుట్టె .. సివిల్సిలబస్.
61. వేడుకోలు-క్షమ.. కవలలు.
62. కోడి శబ్దనిర్దేశం సంతురెక్కల్లో .
63. సంతే లక్ష్యం పక్షుల వలస.
64. అవలోకనం సమీక్ష.
65. అధిరోహణ… ఉనికి దాటి .
66. అవరోహణ… ఉనికిలోకి .
67. అక్షర పొదుపు మితాక్షరి .
68. భావాల మదుపు మితాక్షరి.
69. పదాల ఝళుపు మితాక్షరి.
70. మితాక్షరి ఓ చర్నాకోల
80. ఇక్కడ పులి డిల్లిలో పిల్లి .
81. అహంకారం క్యాన్సర్ మట్టుబెట్టు.
82. పులి సింహం ..మేకపిల్ల ఆపప్పుడు
83. కాంగ్రేస్ మొసలి ఎన్నికల్లో ఆప్ కుఅండ.
84. కాంగ్రెస్బీ జెపి తోడుదొంగలప్పుడు.
85. అహంకారమొస్తే ఆప్కైన ముప్పే
86. ఎదురుదెబ్బ గుణపాఠం గ్రహిస్తే .
8 7. క్లుప్తం భావయుక్తం మితాక్షరి .
88. చిన్న అద్దంలో భారీపర్వతం !
89. అలలు చిలిపివి కవ్విస్తూ ..
90. మనోసంద్రం అలలు కలలు.
91. విశ్వం చైతన్యం అనవరతం .
92. వట వృక్షాలు చరిత్ర సాక్షులు
93. రాచ వైభవం శిధిలదుర్గం .
94. కాలం చరిత్రకారిణి గ్రంధాలెన్నో.
95.ప్రేమాప్యాయతలు నేడందని పండ్లు.
96. విద్యుత్ధరలు చీకట్లో చిందులు
97. ఊడ్పులో నైపుణ్యం “ఆప్” స్వంతం.
98. చెట్టుకు వెల్ల కొంగల గుంపులు .
99. జలసేవనం పరమౌషధం.
100. ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వవికాసం.
101. సంకల్పం పునాది.. సాధన నిర్మాణం.
102. సాధించడం సాధనకే సాధ్యం.
103. గెలుపు మెప్పు ఓటమి ఈసడింపు.
104. అక్షరాలు వూరుతుంటాయి ఎందరు వాడినా.
105. మనసు నిత్య యాత్రి టికేట్టు ఫ్రీ .
104. పురుషుడేడ యిలపై లేకుంటే స్త్రీ ?
105. కాకి సుందరి ముక్కుచెక్కు.
106. కోకిలగుడ్లు పొదుగునేవరో !
107..జీవితాలు నేర్పుతాయి పాఠాలెన్నో
108. విస్మరించకు గడ్డిపూలందాలు.
109. శిలాశిసువు ఇసుకణువు.
110. నేత్రం కెమెరా భౌతికశాస్త్రం .
111. ప్రక్రుతి స్పందన ప్రతిధ్వని.
112.అభివృద్ధి ఫలం కాలుష్యం
113. సంఘజీవి మనిషీ జంతువె .
114. అవగాహనముందు అహం పిల్లికూన .
115. ప్రోత్సాహం అండ వీపుతట్టు.
116. ఊరగాయల రాజు ఆవకాయ.
117. ఏహ్యించకు కుడితి పశు ఆహారం .
118. మృతులు..సజీవులు సినిమాల్లో.
119. కమనీయం పంక జనిత కమలం .
120. జ్ఞాపకం వరం గతం నెమరు.
121. జలవనరులు బ్రతుకునిచ్చు.
122. కాపాడు నీరు ..సృష్టించలేవు .
123. ఇరుగు పొరుగు సఖ్యం దొంగలకిబ్బంది
124. బోరుబావి ఎండింది ఎండకు భయపడి.
125. కనకు కలలు పన్నులేస్తారు .
126. పన్నులన్నిట కల తప్పించుకుంది.
127. కల్లోలితం సమాజం అత్యాశ వైరస్.
128. త్రుప్తి ఆనందపు రాచ మార్గం.
129. పారుతూ మద్యం.. తేలుతూ పౌరుడు.
130.ప్రశ్నహక్కు… అడగనీదు మద్యమ్మత్తు.
131. పండుకోయ కొనకొమ్మకెక్కకు .
132. సమస్యఅగ్నిగుండం దుర్భాషలాజ్యం .
133. హరితం ప్రశాంతం చెట్లుపెంచు .
144. వృక్షం నిర్జించకు ప్రాణదాత .
145. ప్రక్రుతి కాపాడు ధ్వంసించకు.
146. సప్తవర్ణ సమ్మిళితం శ్వేతం.
147. వికీర్ణం కిరణం సప్తవర్ణం .
148. గుప్పెడుమెతుకులు ప్రాణంనిలుపు ..
149. గ్రుక్కెడునీళ్ళుఊపిరి నిలుపు.
150. అన్నార్తునికింతపెట్టు…దీవెనలందు.
151.చరిత్ర …పాఠం… నేర్చుకుంటే.
152. వాగ్వివాదం.. చర్చ వికటించింది .
153. పాలు పిండుకో..పొదుగ్గొయ్యకు .
154. సూర్యుడు శక్తిదాత వాడుకో.
156. యుద్ధందండుగ సోలారెనర్జీ వుందిగా .
157. ప్రశ్న స్వేచకు ప్రతీక .
158. ప్రశ్నతుమ్మెద, బాల్యం మొగ్గ.
159. గాలంటే పండుటాకు వణుకు.
160. రాలినాకు పై జాలి ఎవరికి ?
161. కలలూ కావ్యాలే అక్షరీకరించు.
162. కన్నీరు అపురూపం జారనీకు .
163. మనసుగాయం ..కాలం ధన్వంతరి .
164. వృక్షం తనకు తానె వైద్యుడు.
165. తనపై తనకు జాలి నిర్వీర్యత .
166. సాయమాశించు,సానుభూతి కోరకు.
166. ఎండమావులెంటపరుగులు
నీటిచలమలొదలి యువత .
167. శ్మశానవైరాగ్యం క్షణికావేశం.
168. కపాలమోక్షం శ్మశానశాస్త్రం.
169. దింపుడుకళ్ళెం… ఓ ఆశ.
170. గుండెది వెట్టి అవిశ్రాంతం.
171. గుండె గాయని లబ్డబ్ లిరిక్
172. గుండె నర్తకి బ్రతుకాహ్లాదం .
173. కావడి మోత భుజాన కాయ
174. శరీరం యంత్రం మిళితం సాంకేతికం
175. గుండె నదుల్రెండు.. శుద్ధం,అశుద్ధం.
176. మూరెడు కాఫీకి నురగెక్కువ ..
178. జానెడు కాఫీ మెచ్చరదేలనో.
179. బారెడు కాఫీ నురుగై పారును
180. సుదూరాలు చేర్చు స్కైప్.. శుభాశుభం.
181. అంతర్జాలానికి ఎల్లల్లేవ్
189. తెలుక్కవుల తయారీకేంద్రం ఎఫ్బి.
190. హిమనదం మర్మగర్భ ..
191. చీమలబారు.. తీపి ఒలికిందెక్కడో.
192. ముఖం దర్పణం అంతరంగం వ్యక్తం .
193. మెదళ్ళు తడుపుదాం బాల్యస్నేహం జల్లు..
194. క్షణం ధరిత్రి విరామం కోరితే !.ప్రళయం .
195. గ్రహాలూ గతుల్తప్పితే? విశ్వవిస్ఫోటం
196. అనంతం విశ్వం, రేణువు ధరిత్రి.
197. గ్రహ శకలమేడ్చింది ..తల్లి తప్పిపోయింది.
198. విశ్వం లో ధూళికణం భూమి. మనిషి ?
199. ఆస్త్రాయ్డ్ భూమిని అమ్మనుకుంటే !
200. గ్రహశకలాలు అనాధలు విశ్వంలో …
201. సృజనల మూలకర్త కుక్షి .
202. ఆకలితో తలదించునభిజాత్యం.
203. దర్ప ప్రదర్సనలు నేడు పెళ్ళిళ్ళు .
204. అంతరంగాలు వేటికవే ప్రత్యేకం .
205.సీతచిలుకలు కోకలద్భుతం.
206 .గతం చరిత్ర, నమ్మితే పురాణం .
207. రాతల “సిరా” .. మ్యూజియం వస్తువిక .
208. నీరేకాదు వూపిరీ తోడు చేంతాడు.
209. డ్రై బోరు… . రైతు చేంతాడు కొన్నాడు.
210. మందుకు పురుగు చావలా . రైతు! సున్నితం .
211. ప్రవాహం…. శిలాశిశువులసంఖ్యాకం .
212. శాశ్వతంకాదేదీ అశాశ్వతం తక్క .
213. విశ్వసనీయతకు విశ్వాసం శ్వాస.
214. గవ్వ ద్రవ్యం నాడు.. చిల్లడితే చెల్లదు.
215. ప్రేమించావా! పీడగా మారకు .
216. తెల్లారింది… వేకువ కుక్కురోఅంది..
217. దమ్మిడీకి కొరగాడు వాడసమర్ధుడు .
218. సోమరి సొమ్మున్నా బికారి.
219. కోరినా రాదు చావు , వద్దన్నా ఆగదు.
220. మొన్న నిన్నకు అన్నఎన్నన్నా .
221. మెతుకు త్యాగధని ప్రాణమిచ్చింది..
222. కాలం తాను…దారప్పోగు దినం.
223. కాలం తానులో దారం తునక క్షణం..
224. ప్రవాహం కాలం…..క్షణం బిందువు.
225. సంభాషిద్దాం కవిత్వం మనభాష.
226. భాషించు అమ్మభాష జగతిన్భాసించు.
227.మాతృభాష సాధనం జ్ఞానమార్జించు.
228. భాష్పం భారజలం జార్చకు అమూల్యం .
229. సంగీతం విశ్వ వ్యాప్తం.ఆస్వాదిస్తే.
230. వంటపాత్ర రవళి అద్భుత సంగీతం .
231. మృత్యురోదనలో వేదన సంగీతం.
232. బాల్యం కేరింతల్లో సౌరభం సంగీతం
233. రైలు నడకలో రమణీయం సంగీతం
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి