విస్మయాలు .
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
……………………………………….
“విస్మయాలు ”
1.
తల్లి రాకతో
నోరు తెరచుట
గూటి పిట్టకు
తెలిపిరెవ్వరు !
2.
మాత్రు స్థనమున
పాలు గుడుచుట
పురిటి గుడ్డుకు
మప్పిరెవ్వరొ !
3.
డొల్ల తొలచుకు
వెలికి వచ్చుట
పక్షిపిల్లకు
నేర్పిరేవ్వరొ !
4.
తల్లి పొదుగును
వెదకి పట్టుట
లేగదూడకు
నేర్పెనెవ్వరు !
5.
సంకేతమంది
తల్లి జేరగ
కోడి సంతు.
ఎరుగునెటులో!
6.
పుట్టినంతనే
యీదవలేనని
చేపపిల్లకు
తెలిపిరెవరో .
7.
రెక్కలున్నవి
ఎగురవచ్చని
పక్షిపిల్లకు
ఎరుకయెటులో.!
8.
సంతు కొరకు
గూడు నేయగ
పక్షి జాతికి
తెలుయు నెటులో !
9.
షట్భుజులతో
గూడుకట్టగ
తెనేటీగకు
గురువు ఎవరో !
10.
భద్రమైన
గూడు నేయగ
గిజిగానికొచ్చేను
యోచనెటులో.
11.
కలప గుజ్జుతో
మట్టి ముద్దతో
గూడునెరపగ
చెదకెవరు నేర్పిరో !
12.
పుట్టుతూనే
పిల్ల వానరం
గెంతులాడగ
నేర్చెనెటులో!
13.
తల్లిగొంతును
గుర్తుపట్టుట
చిట్టి మనసుకు
మప్పిరెవరు ?.
14.
పల్లమందునే
పరుగుబెట్టగ
సెలయేటి నీటికి
తెలియునెటులో !
15.చెట్టుకొమ్మకు
వున్నపండు
నేలపైననే
రాలునేలనో !
వాన మబ్బులు
కాలమందే
కురియవేలనో !
ప్రసవ స్థలమని
మేఘ గర్భిణి
తలచెనెటులో !
వర్ష జననం
ధాత్రిమాత
ఎరుగునెటుల !
పులకరించగ
పుడమితల్లికి
ఎవరు నేర్పిరో !
పచ్చకోకను
పృథ్వి కన్నెకు
కట్టబెట్టిరియెవ్వరో !
చెంతజేరగ
కోయిలమ్మకు
తెలియునెటులో !.
గాత్రవిభావరి
కోయిలమ్మకు
సాధ్యమెటులో!
తేనే ఊటలు
వాసంతిక
పొందేనేటులో!
అమృతత్వం
అణువు అణువున
నింపిరెవరో !
రాజఫలమట
భవ్యరుచులను
కూర్చిరెవ్వరో !
అరటి పండున
శక్తి నిండుగా
చేర్చెనేవరో!
గర్భమందున
భవ్య తీర్ధం
నింపిరేవ్వరొ !
ముళ్ళువున్నను
పనసతొనలకు
సొగసులెటులో !
రంగులద్దిన
వర్ణకారుడు
ఆతడేవ్వడో!
కూర్చి పేర్చిన
దానిమ్మపండుకు
సూత్ర మెద్దియొ !
ముత్యపు చిప్ప
పేర్పు అద్భుతం
నెరపె నెవ్వరో !
ఎంతకాలం
ఈ విస్మయాలు
శతకమౌనో !
విస్మయాలే
వాయుగోళాల్
విసిరిరెవ్వరో !
లేని తీరున
విశ్వమందున
జేసిరెవరో !
తిరుగులాటలో
ఖగోళ గోళాల్
ధ్యేయమేమో !
తన్నులాటకు
దిగని రీతులు
ఖగోళ స్ఫూర్తికి
సూర్యకుటుంబం
దరి జేరవచ్చిన
విశ్వమందున
రేయిబవలును
యివ్వవలెనని
సూర్యచంద్రులు
యిచ్చు దశలో
చలిని కూర్చుట
కాలగమనం
వెట్టిచాకిరి
ఒక్క నిముషం
విశ్రాంతికోరితే
పుడమి ..జీవుల
నిబద్ద భరితం
సహనదాత్రికి
గురువులెవరో!
త్యాగధనమే
మానవాళిలో
స్వార్ధమేలనో !
సమయపాలనే
మనిషిలో
నిస్తేజమేలనో !
భరియించడమ్మది
ప్రక్కింటి వారిక !
ఎంత ఘోరం ?
రూకలివ్వరు
వైద్యానికి వేలవేలు
ఎంత చిత్రం!
గీచి బేరమ!
పెద్దకోట్లలో
ధరలడగరేలనో !
భవ్యదాతువు
కరివేపరెమ్మలు
కొలెస్ట్రాలుకు
విలువలెన్నో
విసిరివేతురు
ఎందువలనో !
సారమంతా
పారబోయుట
ఎంత మూర్ఖమొ!
అద్భుతం
తప్పట్లు లేవిట
విస్మయం .
నీరుత్రాగుట
స్వాస్త్యమంత్రం
ఎరుగరేలనో !
ఆడుదాయికి
వరకట్నపు
వేదింపులదేలనొ !
నిర్మాణం
తేటికెవ్వరు
మప్పిరో !
గతంజేయ
కాలమన్నది
కలిసిబ్రతకక
ఆధిపత్యపు
ఆంక్షలేలనో !
విశ్వయానం
ధరిత్రిపై నీ
భోగమేమియో !
నాసి సరుకులు
పాలనిచ్చట
గ్రుడ్డిదేమో !
హీనపరచకు
సాయపడక
ఏహ్యమేలనో !
పట్టువీడవు
బస్సుసమ్మెలు
ప్రజకు వ్యధలా ?
వెలుగు నీడలు
అందచందాల్
అద్దిరెవ్వరో !
నేతలాపరు
స్త్రీ ఆహార్యమన్న
పిచ్చికూతల !
రాజకీయం
పెరటిలో
కరివేప చివురా !
త్రెంచేందుకు
డేబ్బదేండ్లు
చాలదేలనో!
దోసిటిముడు
వర్ణమద్దగా
ప్రక్రుతమ్మకు
నేర్పిరేవ్వరో !
మధువు వుందని
తుమ్మేదయ్యకు
తెలిపిరేవ్వరో!
మారుతరుణం
ఉడతపిల్లలు
ఎరుగునెటులో !
చిలక ముట్టదు
తారతమ్యం
చెప్పిరెవరో !
తల్లిసంజ్ఞను
కోడిపిల్లలు
ఎరుగునెటులో!
పాము రాక
తల్లిపక్షి
వచ్చేనన్నది
కోడి పుంజుకు
తెలియునెటులో !
పక్షిమూకకు
తమ గూటిమార్గం
తెలుయు నెటులో !
తీపి ఉందని
చీమ దండుకు
చెప్పిరెవరో !
ఈనెలెనకను
గిజిగాడు
ఎన్నడు నేర్చెనో .!
కోయిలమ్మలు
రేచ్చిపోవుట
నేర్చేనెటులో !
పిలిచి పంచుట
కాకికబ్బుట
కుక్కకబ్బెను చిత్రమే !
ప్రమాదమందున
బుసలుకొట్టె
త్రాచుపిల్లకు
రక్షయన్నది
పక్షి పిల్లలు
ఎరుగునేటులో!
కొమ్ములిసరుట
గేదె తల్లికి
శిక్షణేచటో!
వెలికి వచ్చుట
సర్ప తనయ
తలచెనెటులో !
పాలు కుడుచుట
పుట్టుగుడ్డుకు
మప్పిరెవ్వరో !
ఎగురవలేనని
పక్షి జాతికి
చెప్పిరెవ్వరు !
తానుండవలెనని
నీడ లేమకు
మప్పిరెవ్వరు
ఏడ్వవలేనని
చంటిబిడ్డకు
తెలిపెనెవ్వరు!
చక్ర వినిమయ
సౌఖ్యమెంచిన
వారలేవ్వరో !
సుదూరమందున
సాధ్యపరుచుట
ఎంత ఘనమో !
మూలమూలలు
కాంచగలుగుట
ఎంత భవ్యత !
పోసుకోళ్లవిఎన్నియో
విశ్వమంతా
పెరటిగోడిట చిత్రమే !
మిత్రులెందరో
అవసరమ్మున
నిలుచునేవరో!
కలలు ఎన్నో
కలలలోకం
త్రుప్తిఎంతో !
నిష్టూరమే
అసత్యాలకు
బ్రతుకుకు
గుండెకదలిక
వెట్టిచాకిరదేలనో !
కర్మా గారం
స్వయం చలితం
నిర్మాతలెవ్వరో !
ఎక్కడుండునో
కానరాదది
ఎట్టులుండునో!
జవం జీవం
మనిషికంతటి
అహం ఎందుకో!
మనిషి బ్రతుకు
చెట్లు నరుకుతూ
మనిషదేలనో !
విస్మయమ్మే
సందియాలను
తీర్తురెవ్వరో !
నూతిలోన
తొంగి చూసితి
నాదుముఖమే !
విస్మయం .
102.
చిన్ని కప్ప
గెంతుతున్నది
గంతులేయగ
నేర్పిరెవరో !
103.
పండిపోతే
ఎండవలెనని
ఆకుకెవ్వరు
తెలిపిరో !
104.
చెలిగివేసిన
పొటమరించుట
గడ్డిపిలకకు
మప్పిరెవరో !
105.
గడ్డిపువ్వుకు
అందమంతగ
అద్దుతున్నది
ఎవ్వరో !
………………………….
స్పందించండి