జనవరి 2009


                    

           
    :పొదుపు:

 

తెంచుతూ పోతే దారాన్ని
 
అది కేవలం దారపు ముక్క

 

పడుగు  పేకల్లో పెనవేస్తే

 

కేవలమది గుడ్డ  ముక్క

 

రూపాయను చిల్లర చేస్తే

 

చిరు చిరు నాణాలు

 

చిల్లర దరిచేర్చుతూ పొతే

 

అవే ధన సమూహాలు

 

ఖర్చు చేస్తూ పోతే
 
చిద్ర మార్గంలో నీవు

 

పొదుపు చేస్తూ పోతే

 

ప్రగతి పధంలో నీవు 

 

 

రచన: నూతక్కి రాఘవేంద్ర  రావు

 

 

అది ఒక

మహాద్భుత దృశ్య కావ్యం
నేత్ర పర్వ సుధా గానం
గాత్రోద్భవ వర్ణ శోభితం
వర్ననాతీత మనోజ్ఞ చిత్ర రాజం
మేఘావ్రుత ఆకాశం
ఆకాశ చుంబిత పర్వత శ్రేణి
తెల్లని దూది పింజల్లా తేలియాడే
మేఘమాలికలు
మేఘమాలికల నీలి నీడలు

ప్రక్రుతి పురుషుని ప్రగాఢ పరిష్వంగ
సుఖంలో తేలియాడుతూ
అర్థ నిమీలిత నేత్రాలతో
పరవశిస్తూ ఆ నగ కన్నిక

మై మరచిన తన్మయతలో
తనువునే మరచిన యా
వన్నెలాడి
పరవశంతో
పల్లవిస్తూ
మేను మరచి
నగ్నంగా!!!
ఆ నగ్నత పై…..
ఆప్యాయంగా
వుదయ భానుడు వెదజల్లిన
వర్ణ రాజితం.
ఆ అత్యద్భుత సౌందర్యం
వీక్షించలేక
సిగ్గిలి
హిమవంతుడు కప్పిన
తెల్లని ఆ మంచు చీరె యా
వంపుల సొంపులు దాచ లేక
పడుతున్న తొట్రుపాటు
అదే అదనుగా శ్వేత మేఘాల
చిలిపి స్పర్శ తో
ముకిళిత అయి
ఆ పర్వత కన్నియ…
ఆహో!! అది
మహాద్భుత
మనో జనిత
భావ దృశ్యం
(ఎన్నెన్ని వగలు పోతున్నావే వయ్యారి)
అని వో కవి వ్రాసినట్లు
వీక్షించి తరించి గానం చేసే భావోద్భవ

దృశ్య గీతం

రచన : నూతక్కిరాఘవేంద్ర రావు
తేది : 25/12/2008

అనంతానంత విస్వాంత రాళం లో
అనంతః కోటి నక్షత్ర సముదాయాలు

ఖగోళంలో భయంకర అగ్నికీల గోళాల
నిరంతర అవిశ్రాంత పయనం
అలుపెరుగని శ్రమ తెలియని
అనునిత్యం క్రమ రీతిన పురోగమనం

పరిధులు దాటని ఆ
నక్షత్ర సముదాయాలు
అందలి ప్రతి నక్షత్రం
అనవరతం పయనిస్తూ

తమ పరిధులు
మాత్రం దాటవు
తమ తమ మార్గం
మాత్రం వీడవు

రచన : నూతక్కిరాఘవేంద్ర రావు
తేది : 25/12/2008

ఐకమత్యం
———–
ధనంతోటి కొన్న బలం
వుంటున్దొక క్షణకాలం
మనం ఒకటి అన్న బలం
నిలిచి వుండు కలకాలం

ప్రభోధం
——-
ఎప్పుడో చేయలేదు
అనుకుంటే పొరబాటు
యిప్పుడైన చేయకుంటే
ఎంతెంతో గ్రహపాటు

అందు బాటులో వున్న
పూవు కోసుకో గాని ,
చిట్ట చివరి కొమ్మనున్న
పండు కొరకు ప్రాకబోకు

నీటి లోతు తెలుసుకొని
యీతకొరకు దిగు కాని
తెలియని కొలను లోన
తలమునకలు కాబోకు

తృప్తి
—–
నీ ఆశ
ఆనందం
నడుమ
అనంత అఖాతం,
తృప్తి అనే వంతెనతో
చేరుకో ఆ దరికి

Nutakki Raghavendra Rao
తేది : 26/12/2008

« గత పేజీ