ఒక జంతు ప్రదర్సన శాలను దర్శించినపుడు నేను చూసిన దృశ్యం నా మనసును కలచి వైచి, అను నిత్యం నను వెంటాడుతూ……ఒక రాట్నపు చక్రం తిరుగతూ అందులో వున్నతెల్ల ఎలుక పిల్ల ,ఆ చక్రం లోనే పడిపోతాననే భయముతో పరిగిడుతోంది.అది ముందుకు పైకి పోతూండటంతో చక్రం తిర్గుతూనే వుంటుంది. జనం వింతగా చూస్తున్నారు . రాట్నం ఆగేదేప్పుడు?పరుగు ముగిసేది ఎన్నడు? అప్పటి వరకు ఆ జీవి ఆసతో, నిరంతర వేదనతో ……పరిగిడుతూనే .. గమ్యమేక్కడో తెలియదు పాపం .
తిరుగాడుతూ రాట్నం
వేగంగా అతి వేగంగా
పరుగిడుతూ ఎలుక పిల్ల.
ఇన్కెన్తో దూరం లేదు
దగ్గరలో అతి దగ్గరలో
మనసిచ్చిన ధైర్యం
ఆరాటంలో
ఆరాట్నం లో
అలసటతో
వేసటతో …ప్రస్తానం కొరకు.
తరలి పోతూ ఆకారాలు
చూడ వస్తూ కొత్త మొహాలు
జన వాహినిలో
గమ్యానికి చేరువలో
భ్రమలో ఆ భ్రమణంలో
వేగంగా అతి వేగంగా …
సంభ్రమమే
పిల్లలు పెద్దలు
ఆనందపు కేరింతలు …
అవధి లేని పయనం
అర గంట ..గంట… మరో గంట
గడుస్తూ కాలం
అయోమయం
అగమ్య గోచరం
అవిశ్రాంత పయనం
అలసి సొలసి పరిగిడుతూ
పాపం ఆ అభాగ్య జీవి.
తెల్లని ఆ ఎలుక పిల్ల !!
‘క్రూరులు కారే యా మానవాధముల్
కారుణ్య మికిన్చుక జూపగలేరు
దారుణా నందము పొందగ జూతు రదేలనో
ధారుణి లోని నికృష్ట దురాన్తక జీవముల్ ‘

రచన:నూతక్కి రా ఘవేంద్ర రా వు తేది : ౦౪-౦౨-2009