వాస్తు శిల్పులు ,గణిత కారులు
వుద్దండ పండి తులు
అంచనాలు తలక్రిందులు..
ఆ చిరు కీటకం సృష్టించిన
అద్భుత మహాద్భుత నిర్మాణ
కౌశలం ఎప్పుడైనా వూహించారా
ఈ భువి పై ఎచటనైన వీక్షించారా
తేనే పట్టు ఎటులుండునో గమనించారా
తెనంటే పడి పడి చస్తాం
తేనే టీగలకు భయపడి చస్తాం
క్షణ కాలం ఒక క్షణ కాలం
తేనే పట్టు పరికిస్తే
నిర్మాణపునైపుణ్యం
అత్యద్భుత ఆవిష్కారం!!
షడ్భుజి ఆకారపు వేల వేల గదులు
గదులన్నీ కలుపుకొంటూ తేనే తుట్టె మిగులు
గుడ్లకోరకు తెనేకోరకు వేరు వేరు గదులు
తూఫాను గాలి ఎండ వేడి
దేనినైనా తట్టుకొనే
పటిష్ట మైన తీరు లో
ఆకస హర్మ్యాల పైన
వ్రుక్షాగ్రాలపైన ,చెట్టు తొర్రలో,

పుట్టల్లో లోలోతుల
ఆ మానవ జాతికి, జంతు జాలమునకు
భయపడుతూ భంగ పడుతు
ఆ అనల్ప జీవి …
ఏళ్ళు పూళ్ళుకష్టించి గూళ్ళు కట్టి
తేనే ఈగలన్నీ పోయి పుష్పాలను
అర్ధిస్తూ వేడుకొంటూ
తేనే తెచ్చి కూడబెట్టి
దాచుకున్న
తమ శ్రమ ఫలితం
తమ నోటికి అందనీక

దొంగ సచ్చినోల్లోచ్చి
నెలల పాటు నిర్మించిన
నెలవును చిద్రం చేస్తే
దాచుకొన్న దాన్ని కాస్త
దోచుకు పోతుంటే
కోపం కక్ష క్రౌర్యం క్రోధం …
వెంటపడి వేటాడి
పట్టి పట్టి కుట్టి కుట్టి
వెతల పాలు చేసినా
బలవంతునిదే
రాజ్య మంటూ
దౌర్జన్యంగా వారు

రచన: నూతక్కి రాఘవేంద్ర రా వు
తేది :౦౫-౦౨-2009