తేనె పట్టు పై దాడి జర్గు తుంది అని తేనె టీ గలు భావించి నప్పుడు అవి రక్షణ వలయాన్ని సృష్టించుకొనే యత్నం లో ఆందోళనతో తమను తాము పోరాటానికి సిద్ధం చేసుకొనే ప్రయత్నం …….. కవి వూహల్లో
కదలి రండి కదలి రండి
కడలి తరంగాల్లా
రండి బాబోయ్ రండి
త్వర త్వరగా రండి
సాయుధులై పరిగెత్తుక రండి రండి రండి
నెలలపాటు కట్టుకున్న
మనగూటిని కాపడుకొందాం
పూలనడిగి తెచ్చుకొన్న
తెచ్చుకొని దాచుకున్న
పూదేనియ దోచేందుకు
దొంగలమ్మో దొంగలు రండి రండి రండి !!
ముసుగేసుకు వస్తున్నరు
భయం వద్దు ధైర్యంగా
రండి రండి రండి
కుట్టి కుట్టి కుట్టి
వెంటపడి తరిమి కొట్టి
దాచుకున్న తెనేనంత
ఆ శత్రు మూక కింత కూడా
దక్కకుండా చూద్దాం
మనమే తాగేద్దాం రండి !!! రండి రండి రండి !!
మంట చేత బట్టి వారు
మన నెలవు కాల్చ జూస్తున్నరు
మనలను మాడ్చివేయ జూస్తున్నరు, రండి రండి రండి !!
బేల తనం వదలండి పిరికితనం మానండి
ముక్కులకు పదును పెట్టి విషం తోటి కుట్టేందుకు
రండి రండి వేవేగం పరుగెత్తి మీరు
కట్టే చేత బట్టి మనల తరిమి కొట్ట బోతున్నరు
మనలను చంపివేయ జూస్తున్నరు రండి రండి రండి !!!
వీరులారా ధీరులారా వెనుదిరగక పోరాడ రండి
శత్రు మూక ……..మన చెంతకు
చేరక ముందే మనమంతా
నలువైపుల చుట్టముట్టి
దాడి చేసి కుట్టాలే
కుట్టి కుట్టి కుట్టి
తరిమి తరిమి కొట్టాలె రండి రండి రండి !!!

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు , తేది:౦౬-౦౨-౨౦౦౯.