ద్వేషంగా చూడకు వాటిని
చీదరపడి పడి క్రోధంగా
హీనంగా చూడకు వాటిని
వేగిరపడి క్రూరంగా
విజ్ఞతతో యోచించి చూడు
వివేచనతో పరికించి చూడు
కార్యాన్కిత కార్యాన్విత
జీవ సహ జీవన గమనం.
వాస్తు శిల్పి, కళా తపస్వి,
దీక్షా దక్షా పూరిత
ధన్యజీవి నిస్వార్థ జీవి
సంఘ జీవి కర్మ జీవి
కోట్ల కొలది ఆ జీవులు
స్వజీవజాల సంరక్షనార్థమై
స్వయం సృజిత నిర్మాణం
ఎన్నెన్నో యోజనాలు
రాత్రనక పగలనక
ఆకలి దప్పులు మరచి
తిరిగి తిరిగి అలసి సొలసి
మట్టి కరచి పుట్ట పెట్టి,
మాను కరచి గూడు కట్టి
పట్టిన పని వదలనట్టి
క్రమ శిక్షణ కల యోధులు
ఆ సూక్ష్మ జీవి ఆశల పై
ఆ జీవి కన్న సంతితి పై
ఆ వాస్తు కళా తపస్విపై
పాదమేసి నలిపి వైచి..
అతి దారునమామానిసి

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు తేది :06-౦౨-2009