అండ పిండ బ్రహ్మాండ లో
అసంఖ్యాక నక్షత్ర కూటములు
నిరంతర భ్రమణంలో
నిత్య పరి భ్రమణం
ఆ పరిభ్రమణ వేగంలో
ఒకటికొకటి ధీకొంటే
వుత్పాతం మహోత్పాతం
తదుత్పాత నివారణ కై
అయస్కాంత క్షేత్రావిష్కారం
ఆయా పరిధుల నియామకం
నియమిత పరిధుల్లో పయనం.

ఏ తార మరో తార పయనానికి అడ్డు రాదు
అది నియమం ఆ నియమ
నిభందనల సంకలనం
రూపొందిన విధి విధానం
ఆ విధి విధాన అతిక్రమణ
జరగలేదు జగతినందు.

వర్తమాన ప్రపంచాన మానవ
మేధకు తట్టినా
సందేహాలేన్నెన్నో
సమాదానాలెక్కడ
ఎవ్వరిదీ నిర్మాణం
ఎవరాతాడు విశ్వ
జగతి రూప కర్త
ఎవరాతాడు విశ్వ
విధి విధాన నిర్ణేత
అతడే అతడే అతడే
అండ పిండ
బ్రహ్మాండ నాయకుడ?
యెమన్దురు ఆతనినేమందురు
అత్యద్భుత క్రమ శిక్షణ
విశ్వ భావ పరి రక్షణ
పృధ్వీ తల సంరక్షణ
నిర్వచించి నిర్వహించు
శక్తి భరిత యుక్తి పరుడు
ఎవడాతాడు ఎచతనుండు…
అది మన బుర్రకు అందని ఆలోచనలేందుకు
ఇకిన్చుక తరచి చూడ
విశ్వంలో భూమి పాలు
పరమానువుకన్న చిన్న
యిక మనిషి వునికి …ఎంతని..
అర్ధం చేసుకో అనర్ధం మాపుకో.

క్రోదోద్భవ అహంకార
విసృన్ఖల వికృత చేష్ట లు మానుకో
లేకుంటే మారణ హోమం
మానవ జాతికి మరణ శాసనం.

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు. తేది:౧౦-౦౨-౨౦౦౯