నా గళం లోన వాక్కు లేదు
నా నేత్రాలకు దృష్టి లేదుgrandcanyon
అంగాంగం కదలదేల
సమ్మె చేస్తున్నాయి కాబోలును
గుండె కవాటాలు
కదలనని మారాం చేస్తున్నాయి
సుషుప్త స్థితి లో
నా మనసు శరీరం
అసంకల్పితంగా
నోరు తెరచి
అనిమేషిత నేత్రుడనై
ప్రక్రుతి చిత్రించిన
వైచిత్రిని ద్రుశ్యిస్తూ
వు త్తుంగ తరంగిత
మనో జనిత
భావ ఘర్షణం ..
అసంకల్పిత
వ్యక్తీకరణలు
నాలో నేను …
ఈ గాయం భూమాతకు
కలిగించిన వారికి
చేతులెలా
వచ్చాయో !!!
భీకరాఘాతపు ఈ చారిక
భూమి కెటుల చేరిందో!!
కాదు కాదు కాదు కాదు
అది గాయపు చారిక కానే కాదు
మది తలపుల ద్వైధీ భావం …

కాబోలును పుడమి తల్లికది
ప్రక్రుతి చేయించి యిచ్చిన
అతి సుందర వజ్ర ఖచిత కంఠ మాల
అనంతానంత అఖాతాలు
యోజనాల దైర్ఘ్యం లో
సుదూరాలు ఇరు తీరాలు
సుందర పర్వత పంక్తులు
ప్రక్రుతి భూమాతకు చేసిన
అలంకారమా!!!!మహాద్భుతం
అనూహ్యం అనిర్వచనీయం
వీక్షకుల కది
గానామృత కావ్యాన్విత
నేత్ర పర్వ సంగీతం .

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు. తేది:౧౦ -౦౨-2009