అంతరాలంటే ..ఎట్లాగంటే నండయ్యా ,మన పల్లె టూరోల్లం వున్నామనుకొందయ్యా ,ఆడ అయదర బాదులో వుండేతోల్లకి ….ఆల్లకి మనకి అంతరం వుంటది గదందయ్యా .అట్టాగే వున్నోడికి నీకు అంతరం లేదేన్దిరా అనే గదన్దయ్య నన్నప్పుడు మీరు తిట్టేది .అట్టాగే ఇండియాలోవాల్లకి,అమేరికాలో వున్దేతోల్లకి అంతరమే గదన్దయ్యా అంతారు.అంతరమంటే తేడ అన్నా మాటన్డయ్యా .అమ్మయ్య ,సాన బాగా సెప్పా గడన్డయ్యా .సెబాసండి.అమ్మో మిమ్మల్ని సెబాస్ అనేటన్తోన్ని కాదన్డయ్య , నాను నానే అనుకున్నానందయ్యా .
ఇక్కడేమో ఎడ్లబండి మీద ,సైకిల్ మీద ,బస్సులో రైళ్ల మీద పొతే ,అయ్దరా బాదులో , స్కూటర్ పైన ,టాక్సీ లో ,ఇమానాల్లో పోతారన్దయ్యా .అక్కడ ఎడ్లబండి మీద పోవాల్నంటే సాన కరుసవు తుందంట గదన్దయ్య .అంటే ఈడ తక్కువయ్యేది ఆడ ఎక్కువ పెట్టాల్ననమాట .ఇది అంతరమే కదన్దయ్యా.అంటే అయిదరా బాద లో యడ్ల బండి డబ్బులున్నోల్లకే గదందయ్యా .యీడ యడ్ల బండి ఎక్కేది పెదోల్లె .ఇదంటే అంతరమే గడందయ్యా . అంటే పల్లెటూళ్ళో పేదోడు పట్నంలో పెద్దోడు ఒకటే గదన్దయ్య .అదే గదన్దయ్యా పల్లెటూరికి పట్టణానికి అంతరం.
యింకా సాన మాట్టాడాలి గానండయ్యా ..అబ్బెంతరముంటే సిప్పీసేండయ్య. అట్టా మూతి మూతి ముడుసుకుంటే బాగుండదందయ్యా .మల్ల మరో సారి మాట్టా డు కొందా మండయ్యా.
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు. తేది: ౧౧-౦౨-౨౦౦౯.
ఆగస్ట్ 9, 2011 at 10:23 ఉద.
మీ సత్తిగాడి కబుర్లు బావున్నాయి.
ఆగస్ట్ 9, 2011 at 11:04 ఉద.
శైలూజీ. వాడికి( అదే సత్తిగాడి కబుర్లు) నేను అన్యాయం చేసినట్లే . అసంపూర్ణంగా ఉంచేశాను వాస్తవానికి ఇప్పటికి ఏడువందల పోస్టులు వచ్చి వుండాలి.వేరే పోస్టులుగా కాకుండా నా భావాలను వాడి ద్వారా చెప్పించాలనుకున్నాను. కుదరలేదు .నా సంకల్పం పూర్తి అవుతుందని భావిస్తున్నాను.