ప్రపంచ సినీ చిత్ర రంగంలో , తన దంటూ ఒక ప్రత్యెక ఒరవడి ఉన్నా, ప్రపంచ చలన చిత్ర రంగ చిత్ర పటం పై ఇప్పటి వరకు సంచలనాలు సృష్టించ లేక పోయిన భారత దేశం ,స్లం డాగ్ మిలియనీర్ ద్వారా ఎనిమిది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులarrahman1ు ,పొందడం , అందులో భారత గాన గంధర్వుడు ఎ అర్ రహమాన్ ఆస్కార్ అవార్డు పొందడం భారతీయులందరూ సగర్వంగా గర్వించదగ్గ విషయం. కుగ్రామంగా మారిన ఈ భూ ప్రపంచంలో సమస్యలు ఏ ఒక్కరివో కాదు, మనమదరివి అని ,ప్రాంతీయత ,భాష, మతం ,ఏదీ , మానవతా కోనాన్నుంచి మనిషిని వేరు చేయలేవన్నది ఈ చిత్ర విజయం ద్వారా ,చిత్రానికి దక్కిన అవార్డుల ద్వారా నిరూపిత మైంది.
వాస్తవికత కోసం ,భారతీయ వీధి బాలలకు తర్ఫీదునిచ్చి వారి నుండి సృజనాత్మకతను వెలికి తీసి నటింప చేసి,ఇతర స్థానిక నటులతో,ప్రాంతీయ సాంకేతికతతో, నిర్మింపబడి, ప్రాంతీయన్గాను, విదేశాలలోనూ , మీదు మిక్కిలి అమెరికాలోని భారతీయుల లోనూ వ్యతిరేకతకు,ఆక్షేపణ లకు ,వివాదాలకు లోనయి ,వివాదాస్పద మయినా స్లం డాగ్ మిలియనీర్ చిత్రం,అ త్యధికసంఖ్యలో అవార్డ్లు పొందడం ముదావహమైన విషయం.
కధ ఏదయినా,నటీ నటులేవరయినా ,దర్శక నిర్మాతలు ఎక్కడి వారైనా ,అంకిత భావం,కధన విధానం ,దర్శకుని సృజనాత్మక ప్రతిభ ,ఒక చిత్ర విజయానికి యెంత ముఖ్యమో ఈ చిత్రం నిరూపించింది.
సినిమా ఆసాంతం ప్రేక్షకున్ని కదలకుండా కూర్చోబెట్టే లా చేసిన ఈ చిత్ర దర్శకుడు ,ఈ విశ్వ కుటుంబపు సభ్యుడే , ఆతడు ఆతని చిత్ర పరివారము ,అభినంద నీయులు , ప్రశంసా పాత్రులు.

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు. తేది ౨౩.౦౨-2009