ఫిబ్రవరి 2009


నమస్కారమండి కొంచం లేటయ్యింది, నిన్న ఎక్కడ వున్నామంది ?సత్తిగాడి దగ్గర…ఛ…ఛ వాడి ఊసే ఎత్తద్దనుకొంటే పొద్దు పొద్దున్నే వాడి వూసే . సరే మొదలెట్టాం కదా … ఒక రోజు వాడు అంటాడూ అయ్యా నేనిన్నానుగందా దేశమంటే
మడుసులే దేశమంటే మట్టె కాదూ గట్లాని ….ఏందీ సారూ దాని మతలబో !!అయ్యా ఈ గొప్పోల్లు సాన గొప్పగా సేబుతారే గాని ఈ మట్టి బుర్ర కెక్కదయ్య,అయ్యా ఈయనేమో మట్టి మడుసులంటాడు గందా ,ఇంకో గోప్పాయనండి ఏమంటాడంటే
ఆ..మట్టి .. తిండి..తిండి …మట్టి ..తిండి . తిన్డుంటే కన్డున్దోయ్ కండ కలోడే మన్సోయ్ అన్నాడన్టండి .అన్నాడంట కదండీ , దాని మతలబు సేప్పండయ్యాకండలేనోడు మదిసే కాదండయ్యా ? మాకు తిన్తానికైతే తిండి లేదు గందా ,కన్డేట్టా వస్తాదయ్యా ? నా ఒంటిన కండె లేదంటే నె మడిసినే కాదేన్తండయ్యా, అయ్యా మరి మీరేమో అప్పుడప్పుడు నన్ను తిడతారు గదందయ్యా ,ఎం మనిషివిరా అని ,అంటే మీరోప్పు కున్నారు గాదందయ్యా కుంచెం సేపైనా .అంటే నె సేప్పోచ్చే దేన్తన్తెనందయ్యా నేను మడిసినే గాని కండ లేదు .కన్దేట్టుంతదయ్య తిండే లేకుంటే ?అన్నాయమయ్య ,తినాలంటే డబ్బు కావాలె ,డబ్బుకావాల్నాటే సంపాదించాలే ,అయ్యా సంపాదనంటే గురుతుకొచ్చింది పోయినేటి దాక మా లెక్కనే వుండే గందా ఆడు ఆ …ఆ డి పెరెందబ్బా .. గ్యాపకాని అందాలే ,పెరెదయితే ఎందిలే గాని ఆడు కోట్లు సంపా యించి నాదంతన్డయ్య .ఆడికి మేమంతా ఓట్లేసి గెలిపించిన్చినావు గదందయ్యా,ఆడు కల్లు పోసి, సారాపోసి మా వాడ వాడనే తిప్పుకున్నాడుకదందయ్యా, ఆయనెంతపెద్ద మంత్రంట,ఆయనే దీని కంతా కరుసు పెట్టాదంతందయ్యా , ఆయనోచ్చి ఎంతెంతో సేప్పాడందయ్యా …… ఇప్పుడేమో మా సంగతే పట్టిచ్చుకోదేన్దయ్యా యీడు . పాపం ఆడు మాత్ర ఎం చేస్తాడు లేయ్యా ,అయ్యా యీడు గెల్సినంక సపాయిందాట్లో ఆ బాబుకి శానా పంపాల్నంతయ్య , పాపం సాన కస్తాపదతన్నాదందయ్యా.ఆ మంత్రయ్యకి.. కర్సు పెట్టినాడుగాదందయ్యా అయ్యా ఆ మంత్రాయనకూడా పెద్ద మంతిరి కి ఇయ్యాల్న్తన్తన్దయ్యా అయ్యా మాటల్లో పడి నేనేల్లోచిన పని మర్సిన…..ఎల్లోస్తానందయ్యా..
ఇట్లా వుంటుందండీ సత్తిగాడి కబుర్లు.మనకెందుకు లెండి మనం వాడి కబురులలో పడోద్దండి .మళ్ళి రేపు కలుద్దా మండి .. ఏమి అనుకోవద్దు నాకూ పనుందండి.

రచన :నూతక్కి రాఘవేంద్ర రా వు తేది :౧౨-౦౨-౨౦౦౯

ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని ,పొగడరా నీ జాతి నిండు గౌరవము. చిన్నప్పటి నుంచి పోగుడుతున్నాం.పోగుడుతాం,ఇక ముందు కూడా పొగుడుతూనే వుంటాం. అది ఒక పౌరుడిగా మన కర్తవ్యమ్ .విదేశాల్లో మన దేశం గురించి , మన లోటు బాట్లు తప్పులు లోపాలు గురించి మాట్లాడకుండా అంతా మంచే మాట్లాడుకుందాం.చాలా గొప్పగానే చెప్పుకుందాం. బాగుంది. ప్రచార సాధనాల ద్వారా కూడా అట్లాగే ప్రచారం చేయమని వత్తిడి తెద్దాం. అది ఇంకా బాగున్నది. అది అంతా అనుకున్నట్లే జరిగి విదేశాలన్నీ మనల్ని గొప్పగా అనుకుంటున్నాయి సరే . అదీ బాగుంది.
మరి మనదేశం లోపల మన సంగతే మిటీ? మన దేశం అంటే వుట్టి దేశమేనా ?ఆ పెద్దాయన ఏదో… అన్నాడే ..ఆఎమన్నా..ఆ .. ఆ …డబ్బా ….ఆ ….దేశమంటే మనుషులోయ్ !అన్నాడు. అంటే మనుషులంటే దేశమనే కదా అర్థం. ఆయనన్నాడు కాబట్టి ఒప్పు కుందాం.అంటే ఆయన చెప్పినట్టు చచ్చినట్టు మనం ఒప్పుకున్టున్నామనమాట.’యామైనా గొప్పోల్లు సాన గొప్పగనె సేబుతారండి’ అంటాడు మా సత్తి గాడు.వాడు తక్కువగా అనుకుంటున్నారేమో .చాలా తప్పులో కాలేసినట్లే మీరు .మాస్టారూ ! ఆ సత్తిగాడి కబుర్లు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది .వాడి గురించి తరవాత మాట్లాడుకుంటే పోలా ,అయినా యెంత తక్కువగా మాట్లాడు కొంటె అంత మంచిది . మనం రేపు మాట్లాడు కుందాం .శలవిప్పించండి.

తేది:బుధవారం,పదకొండో తేది, ౨౦౦౯

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు

 

యూసమిట్ వ్యాలీ :

అక్కడకు వినోదం కొరకే గాక ,విజ్ఞానం కొరకు ,విద్యా ప్రాప్తికి, పరిశోధనకు, ప్రతి నిత్యం ,అనేక వేల మంది పర్యటిస్తూ వుంటారు. ప్రభుత్వం ఈ పర్యాటక కేంద్రాభివ్రుదికై వెచ్చించిన మొత్తాన్ని పర్యాటక్యాభి వృద్ధి ద్వారా తిరిగి రాబట్టుకో గలుగు తోంది. ఈ విధానం ఏ దేశానికైనా అనుసరణీయం.
వేల ఎకరాలలో అమెరికాలో వున్న యూసమిట్ ప్రాంతం ఆరక్షిత జాతీయ వనం. ఇక్కడకు చేరడానికి అనేక ప్రాంతాలనుండి సురక్షితమైన,సౌ కర్యవంతమైన రోడ్లు వున్నాయి. ప్రభుత్వ రవాణా సౌ కర్యాలున్నా ఎక్కువ మంది తమ వాహనాల్లో వస్తుంటారు. మధ్య మధ్య వసతి గృహాలలో విడిది చేస్తూ ఎంతెంతో దూరాల నుంచి కూడా రోడ్ ద్వారా ప్రయాణం చేసి వస్తుంటారు. శ్రమ ధన ప్రయాసలతో కూడుకొన్న దే కాని ఈ యాత్ర అద్భుత ఆనందానుభూతుల్ని మిగుల్చుతుందనడంలో సందేహంలేదు.ఈ ఆనందాన్నిజ్ఞాపకాలను నా జీవితాంతం మిగుల్చు కొంటాను.

వన్య భరిత పర్వతాలతో, శిఖరాలతో ,ఎలుగుబంట్లతో సింహాలు పులులు ,జింకలు ఇత్యాది ఎన్నో ఇతర జంతు జాలంతో,వాటి అరపులతో రకరకాల పక్షులతో ,కిలకిలారావాలతో ,జలపాతాలతో , సాంద్ర తరమై సు విశాలమైన కైవారాలతో ఆకాశాన్నంటే సాంద్ర తర వ్రుక్షారన్యాలతో ,ఔషధ జాతుల మొక్కలతో, సెలయేళ్ళ పరవళ్ళతో , సుందర వర్ణ భరిత వుద్యానవనాలతో ,నదులతో ఆ లోయ ప్రతి నిత్యం సజీవంగా కళ కళ లాడుతూ అలరారుతుంటుంది.

ఇక్కడి స్థానిక ప్రజల, ఆటవిక జాతుల పునరావాసానికి, అభ్యున్నతికి ,సంక్షేమానికి ,అమెరికా ప్రభుత్వం అమిత శ్రద్ధ తీసుకుంటోంది.ఇక్కడి ప్రభుత్వం సామాజిక అవసరాలకు సేకరించే భూమి కి చెందిన భూమి పుత్రులను వారి మానాన వారిని గాలికి వదలదు.ముందే పునరావాసానికి ప్రణాలికలు రచించి ఆచరణలో పెడుతుంది.దానికి కావలిసిన నిధులను సమకూరుస్తుంది. ఇదంతా ఆ యా కార్యక్రమ నిర్మాణం లో భాగంగా కొనసాగుతుంటుంది .

ప్రతి దేశానికి ఈ ప్రక్రియ ఆదర్సనీయం.

పర్వతాలను, శిలలను ,అడవుల్ని, ఓషధ జాతి మొక్కలిని ,లోయలను, సెలయేళ్ళను, జలపాతాలను, జలాశయాలను ,రహదారులను,అక్కడి జంతు వృక్ష సముదాయాన్ని కాపాడేందుకు ,వివిధ భాగాల్లో పరిశోధనలు జరిపేందుకు వేరు వేరు ప్రభుత్వ విభాగాలున్నాయి. వేల మంది విశ్వ విద్యాలయ విద్యార్థులు యిక్కడ వివిధ రంగాల్లో పరిశోధనలు చేస్తుంటారు. పర్వతారోహణ ఇక్కడ ప్రత్యెక క్రీడ.మంచులో ఆడే క్రీడలకు కూడా యిక్కడ ప్రత్యేకసరదా చూపుతారు. ఇక్కడ యాత్రలో అనేక వింతలు విశేషాలు చూడవచ్చు.పర్వతాలు, శిఖరాలు,శిలలు శిలాజాలు ,మహోన్నత వృక్ష జాతులు, లోయలు, జలపాతాలు, సెలయేళ్ళు ,పక్షులు, ఆరక్షిత జంతు జాలం ,ఒకటేమిటి అనేకం.

అందులో ప్రత్యెక మైంది హాఫ్ దోం అని పిలవ బడే శిఖరం.ఆ లోయ నుండి ఆ దృశ్యం చూడ టానికి అద్భుతంగా వుంటుంది . నేను దానికి ప్రత్యేకమైన పేరు పెట్టుకున్నాను . అది చూడటానికి… ఒక పక్షి పిల్ల, తల్లి తెచ్చే ఆహారం కోసం గూటిలోనుంచి తల బయటకు పెట్టి ఎదురు చూస్తున్నాడా అన్నట్లు ..భావన నాకు కలిగింది. కాబట్టి దానిని చిక్ బీక్ దోం ( డ కారం లో ఒత్వం పలకడం లేదు. )అని పేరుపెట్టాం. చిక్ అంటే పక్షి పిల్ల ,బీక్ అంటే ముక్కు. కొన్ని కొన్ని కాలాల్లో (సాయంత్రం వేళ మాత్రమె) సూర్యుడు పశ్చిమ ముఖుడై తరలే తరుణాన ఆ లోయలో పర్వతాల నీడల కదలికల పరిణామ క్రమంలో ప్రస్ఫుటంగా ఒకే ఒక శిఖరం పై కాంతి మిగిలి వుండి ఆ దృశ్యం ,మహాద్భుత దృశ్య కావ్యంగా ఆవిష్కరింపబడుతుంది . సూక్ష్మ దృష్టితో, విమర్సనాత్మకంగా ,పరిశోధనా పరంగానూ ,వాస్తవ పరంగానూ చూస్తే నా ఈ వ్యాసంలో లెక్కకు మించి దోషాలు కనపడవచ్చు. కాని వాస్తవ దూరాలు మాత్రం కాదు. న పర్యటనలో కలిగిన ఆనందానుభూతుల్ని నలుగురితో నా భాషలో నా వారితో పంచు కోవడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.

ఇక్కడకు పర్యాటకులు రోజూ వేల సంఖ్యలో వస్తుంటారు .కొద్ది మందికి మాత్రమె అక్కడ బస చేసే అవకాశముంది మిగిలిన వారు ఆ రోజు సాయంత్రానికి తిరిగి వెల్ల వలసినదే..,మనం మన అవసరాలకు ఆహారం నీరు తీసుకు వెళ్ళినా, అవసరానికి భోజన ఫలాహారాది సదుపాయాలు,సోవ్చాలయాలు వున్నాయి.

నా అనుభూతులు:
ఆ దృశ్యం :
చిక్ బీక్ దోం (అని నె పిల్చుకొనే )
హాఫ్ దోం

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు. తేది : ౧౧ – ౦౨ – ౨౦౦౯నా గళం లోన వాక్కు లేదు
నా నేత్రాలకు దృష్టి లేదుgrandcanyon
అంగాంగం కదలదేల
సమ్మె చేస్తున్నాయి కాబోలును
గుండె కవాటాలు
కదలనని మారాం చేస్తున్నాయి
సుషుప్త స్థితి లో
నా మనసు శరీరం
అసంకల్పితంగా
నోరు తెరచి
అనిమేషిత నేత్రుడనై
ప్రక్రుతి చిత్రించిన
వైచిత్రిని ద్రుశ్యిస్తూ
వు త్తుంగ తరంగిత
మనో జనిత
భావ ఘర్షణం ..
అసంకల్పిత
వ్యక్తీకరణలు
నాలో నేను …
ఈ గాయం భూమాతకు
కలిగించిన వారికి
చేతులెలా
వచ్చాయో !!!
భీకరాఘాతపు ఈ చారిక
భూమి కెటుల చేరిందో!!
కాదు కాదు కాదు కాదు
అది గాయపు చారిక కానే కాదు
మది తలపుల ద్వైధీ భావం …

కాబోలును పుడమి తల్లికది
ప్రక్రుతి చేయించి యిచ్చిన
అతి సుందర వజ్ర ఖచిత కంఠ మాల
అనంతానంత అఖాతాలు
యోజనాల దైర్ఘ్యం లో
సుదూరాలు ఇరు తీరాలు
సుందర పర్వత పంక్తులు
ప్రక్రుతి భూమాతకు చేసిన
అలంకారమా!!!!మహాద్భుతం
అనూహ్యం అనిర్వచనీయం
వీక్షకుల కది
గానామృత కావ్యాన్విత
నేత్ర పర్వ సంగీతం .

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు. తేది:౧౦ -౦౨-2009అండ పిండ బ్రహ్మాండ లో
అసంఖ్యాక నక్షత్ర కూటములు
నిరంతర భ్రమణంలో
నిత్య పరి భ్రమణం
ఆ పరిభ్రమణ వేగంలో
ఒకటికొకటి ధీకొంటే
వుత్పాతం మహోత్పాతం
తదుత్పాత నివారణ కై
అయస్కాంత క్షేత్రావిష్కారం
ఆయా పరిధుల నియామకం
నియమిత పరిధుల్లో పయనం.

ఏ తార మరో తార పయనానికి అడ్డు రాదు
అది నియమం ఆ నియమ
నిభందనల సంకలనం
రూపొందిన విధి విధానం
ఆ విధి విధాన అతిక్రమణ
జరగలేదు జగతినందు.

వర్తమాన ప్రపంచాన మానవ
మేధకు తట్టినా
సందేహాలేన్నెన్నో
సమాదానాలెక్కడ
ఎవ్వరిదీ నిర్మాణం
ఎవరాతాడు విశ్వ
జగతి రూప కర్త
ఎవరాతాడు విశ్వ
విధి విధాన నిర్ణేత
అతడే అతడే అతడే
అండ పిండ
బ్రహ్మాండ నాయకుడ?
యెమన్దురు ఆతనినేమందురు
అత్యద్భుత క్రమ శిక్షణ
విశ్వ భావ పరి రక్షణ
పృధ్వీ తల సంరక్షణ
నిర్వచించి నిర్వహించు
శక్తి భరిత యుక్తి పరుడు
ఎవడాతాడు ఎచతనుండు…
అది మన బుర్రకు అందని ఆలోచనలేందుకు
ఇకిన్చుక తరచి చూడ
విశ్వంలో భూమి పాలు
పరమానువుకన్న చిన్న
యిక మనిషి వునికి …ఎంతని..
అర్ధం చేసుకో అనర్ధం మాపుకో.

క్రోదోద్భవ అహంకార
విసృన్ఖల వికృత చేష్ట లు మానుకో
లేకుంటే మారణ హోమం
మానవ జాతికి మరణ శాసనం.

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు. తేది:౧౦-౦౨-౨౦౦౯


అది ౧౯౬౨, భారత వుత్తర సరి హద్దులలో వుద్రిక్త పరిస్థితి.చైనా దురాక్రమణ కు సిద్ధపడింది.భారత భూ భాగాలను దౌర్జన్జంగా ఆక్రమించింది. నెహ్రూ గారు సంప్రదింపుల ద్వారా పర్స్కరించాలని ప్రయత్నం చేసారు. చైనా అద్యక్షులు శ్రీ మావో – సే – టుంగ్ తోను చైనా ప్రధాని చౌ -యెన్ -లై తోను ,సంప్రదింపులు జరిపి ఒక అంగీకారానికి వచ్చిమాక్-మోహన్ లైన్ అనే సరహద్దు ఒప్పందం చేసుకున్దామను కుని వూపిరి పీల్చుకున్నతరువాత అకస్మాత్తుగా మన సేనలు సిద్ధంగా లేనప్పుడు కుస్చిత యుద్ధ తంత్రంతో మన భూభాగం లో చాలా ముందుకు చొచ్చుకు వచ్చారు.సంప్రదింపులు మధ్య వర్తిత్వాలు అన్ని విఫలం అయ్యాయి.ఆ సమయంలో యుధం తప్పలేదు.పోరు ప్రారంభమైంది.ఇరు సేనలు అత్యాధునిక విమానాలతోను ఆయుదాలతోనూ పరస్పర దాడులు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.ప్రపంచ దేశాలన్నీ మన దేశానికిఅండ ప్రకటించాయి.
పేపర్లు ,రేడియోలు ద్వారా వార్తలు అందేవి . రేడియోలు ఎక్కడో ఒక ఇంట్లో వుండేవి ,సామాజిక రేడియో గ్రామ పంచాయతి లో ప్రజలకి అందుబాటులో వుండేది .ఏ ఊరికి విద్యుత్తు వుండేది కాదు, …..రేడియో, బాటరీ తో పని చేసేది. ఆ బాటరీ కూడా చాలా పెద్దగా వుండేది .ఇద్దరు మనుషులు పట్టి మొయ్యాల్సినంత పెద్దది అన్నమాట.
ఇళ్ళల్లో కిరసనాయిలు దీపాలే. వీధి దీపాలు కూడా అవే.ఆ రోజుల్లో పట్టణాలలోనూ ,కొన్ని గ్రామాల్లోను , నగరాల్లో వీధి దీపాలకు ,కొద్ది మంది ధనవంతుల ఇళ్ళకు తప్ప కరెంటు అందు బాటులో వుండేది కాదు.వూళ్ళల్లో వీధి దీపాలకు కిరసనాయిలు వాడేవారు.
కాని మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో ఒక్క మానికొండ అనే గ్రామంలో ఎవరింట్లోనో జెనరేటర్ తో కరెంటు కొన్న విషయం మీద ,అందరు ఆశ్చర్యంగా చర్చించు కొనే వారు. . (౧౦౬౨ నాటికి గ్రామాల స్థితి గతులు మీకు టూకీగా చెప్పాలనే తపన తో ఈ ప్రస్తావన.)ఇక అసలు విషయానికి వద్దాం.

వూళ్ళో రేడియోలో వార్తలు వచ్చే సమయంలో గ్రామ పంచాయతి ఆఫీసు వద్ద ప్రజలు గుమి గూడి వార్తలు, విశ్లేషణలు వినే వారు. పరిస్థితిని చర్చించే వారు.పరిస్థతి అవగాహన చేసుకొనే వారు.సినిమా హాళ్లల్లో యుద్ధ ప్రాంత దృశ్యాలు ప్రదర్శించే వారు.అప్పటి ప్రధాని పండిట్ జవహరలాల్ నెహ్రూ వుపన్యాసాలు కూడా సినిమా హాళ్లల్లో ప్రదర్శించే వారు.ఆ వార్తా చిత్రాలు సినిమా కు వచ్చిన వారి నందరిని వుత్తేజ పరిచేవి. చూసే యువతని మరీ చైతన్య పరిచేవి . సైన్యంలో చేరేందుకు యువత వరుసలు కట్టారు.
విద్యార్థులు,వుద్యోగులు, నటులు, పత్రికల వారు, ఒకరని కాదు అందరు అన్ని వర్గాల వారు ,స్త్రీలతో సహా దేశ రక్షణ నిధి పోగు చేసి ప్రభుత్వానికి అందచేసారు. రాజకీయాలకతీతంగా , సైనికులకు కావలిసిన డబ్బును, వస్తువులను బట్టలను ,వున్ని దుస్తులను సమకూర్చారు.దేశమంతా ఒక్క తాటి పైన నిలచిన ఆ సందర్భం లో, ఆ సమయంలో నేను కృష్ణ జిల్లా వుంగుటూరు లో వుండి చడువుకొంటున్నాను. ఆ వూళ్ళోని మా హై స్కూల్లో (నేను విద్యార్థి సంఘానికి ప్రధాన కార్యదర్శి పదవి లో వుండేవాడిని )విద్యార్థులు అందరిని కూడగట్టి దేశ రక్షణ నిధి కొరకై విరాళాలు సమకూర్చే భాద్యతని నేను తీసుకోవడం జరిగింది.శ్రమదానం ద్వారా ఆ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాము.
విద్యార్థులతో దేశ రక్షణ నిధిని సమకూర్చే విషయమై సంప్రదించి వారి అందరి అనుమతిని పొందిన తరు వాత , మా ప్రధానోపాధ్యాయులు శ్రీ పి.యస్ .రా వు గారికి మా అభిప్రాయం తెలియ చేసి నిధికి చందాలు ఎట్లా కూడగాట్టాలనే విషయ మై చర్చించాం. వూళో చందాలు వసూలు చేదామని ఆయన సలహా ఇచ్చారు. నేనేమో మా వ్యూహం తెలియజేసి మేము శ్రమ దానం ద్వారా వరి చేలు కోసి తద్వారా వచ్చిన మొత్తాన్ని దేశ రక్షణ నిధికి పంపాలనే (శ్రమ దాన కార్య క్రమంలో వారి చేలు కోయద మనే మాట అప్పుదికప్పుడు నేను తీసుకొని ప్రతిపాదించిన నిర్ణయం.)మా సంకల్పం ఆయనకు చెప్పాను.. ఆ ప్రతి పాదన ఆయనకు చాలా బాగా నచ్చింది..
ఆ ఆ రోజుల్లో స్కూలు విద్యార్థులు ఎవరికీ పాద రక్షలు వుండేవి కావు.అది కాక ఒక్క స్కూల్లో తోటపని చేసిన అనుభవం తప్ప ఏ వక్క విద్యార్థికి పొలం పనులు చేసిన అనుభవం లేదు ..ఆటకాయ తనంగా చేలల్లోనూ చేలగట్ల మీద ,బురద నేలలలోను తిరిగిన అనుభవం తప్ప.
(ఆ రోజుల్లో ఆ వూర్లో కంకర రోడ్లు కూడా వుండేవి కాదు.ఇప్పుడైతే సిమెంటు రోడ్లు వున్నాయి అనుకోండి .)
అప్పట్లో వర్షాకాలంలో మోకాటి లోతు బురద లో వెళ్ళాల్సి వచ్చేది. చెంబట్టుకొని కూడా అట్లా వెళ్లాలిసిందే మరి. వర్షా కాలంలో భయంకరంగా వుండేది. స్త్రీలు చాలా ఇబ్బంది పడే వారు.మరుగు దొడ్లు వుందేయి కాదు మరి. (ఇది మరీ అప్రస్తుతం అనిపించినా …..ఈ వ్యాసానికి అవసరమే).
డబ్బులుగా సేకరించ కుండా ,శ్రమ దానం ద్వారా , అదే నండీ ,విద్యార్తులందరం పని చేసి త ద్వారా వచ్చే శ్రమ ఫలితాన్ని నిధికి ఇచ్చే విధానాన్ని ఎన్నుకొని , కనీసం ఇరవై ఎకరాల మాగాణి కోత కోసి వచ్చిన డబ్బులు, దేశ రక్షణ నిధికి ఇవ్వాలని నిర్ణయించాం కదా ..
ఆ నిర్ణయం సరియినదేనా? ,పిల్లలు పంట పాడు కాకుండా చేతులు కాళ్ళు కోసుకోకుండా కోత కోయ గలరా?, వంటి అనేక సందేహాలు టీచర్ల లోను,మా ఊరి పెద్దల లోను తలెత్తాయి .ఆ విషయ మై చాల చర్చ జరిగింది. నల్గురు కలిసి ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు అందరితో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలంటే అది ఎంత మంచి పనైనా ఒక గాట్లో పడటం అంత తేలిక అయిన విషయం కాదు.నాగలికి కట్టిన ఎడ్లు ఒకటి అటు ఇంకోటిటు, లాగితే దుక్కి సాగుతుందా ?ఊళ్ళో గ్రూపులుంటాయి కదామరి. దానితో రాజకీయాలూ తప్పవు.నాకు రాజకీయం లో బలపం పట్టు కోవడం అప్పుడే తెలిసిందనుకోండి.
ఊరి పెద్దల్ని ఒప్పించే భాద్యత ప్రధానోపాధ్యాయులు శ్రీ పి.యస్ మూర్తి గారు, డ్రిల్లు మాస్టారు విష్ణు గారు తీసుకొని ,ఊరి పెద్దల్ని వప్పించారు. వారందరికీ మేము ప్రతి పాదించిన ప్రయోగం నచ్చింది. ముందు పది ఎకరాలు వరి పొలం ఒక కామందు (మా స్కూలు ప్రక్కనే)కోతకు ఇచ్చాడు. పెద్ద రైతుల దగ్గర కొడవళ్ళు తెచ్చుకొని , మొత్తానికి వరి కొత కోసాము. ఒక రకమైన తృప్తి,ఆత్మా విశ్వాసం మా అందరిలో.

అందరు ఊపిరి పీల్చుకొన్నారు. వరి పాడు కాకుండా కోసారనీ ఎటువంటి గాయాలు కాకుండా పని అయిందని,పెసర జనుము విత్తనాల తొక్కిడి కూడా బాగా అయ్యిందని,ప్రచారం జరిగి, మా చేలు కూడా కోయండి అని మరి కొందరు ముందుకొచ్చారు.మరో రోజు ఆ చేలు కూడా కోసాం . ఎవరికీ కూడా చేతులు గాని ,కాళ్ళు గాని తెగలేదు.ఎప్పుడు కొడవలి పట్టిన చేతులు కాదాయె.మొత్తానికి మా అందరికి పొలం పని మీద వుత్సాహం కలిగింది.అప్పటి వరకు వూళ్ళో వర్షాకాలంలో బురదలో తిరిగిన అనుభవం బాగా వుపయోగ పడింది.పిల్లలందరికీ జలగల గురించి ,నీళ్ళ కట్టే పాముల గురిచి,ఎన్ద్ర కాయల గురించి భయాలున్దేవి, అయినా ధైర్యంగా ముందుకొచ్చారు, ఆ సందర్భంలో వాళ్లు చెప్పిన విషయం మీ అందరితోనూ పంచుకు తీరాలి. అట్లా గయితే రోజు వారీ కూలీలు కూడా భయపడాలి కదా. వాళ్లకు లేని భయం మనకెందుకు?అని. వాళ్ల ధైర్యానికి ఆలోచనా విధానానికి నేను చాలా అఛెరువన్దాను.
కోత కోయగా వచ్చిన మొత్తం : రూ :౧౪౦౦-౦౦ రక్షణ నిధికి పంపాము. ఈ విధంగా శ్రమదానం ద్వారా నిధి సమకూర్చుకొన్న విధానం ,పంట చేలు చక్కగా కోసిన పధ్ధతి అందరి మెప్పును పొందాయి .అప్పటివరకు పిల్లలు పంట పాడు చేస్తారేమోనని భయపడ్డారు .దిన పత్రికల్లో అభినందన పూర్వక వార్త లు వచ్చాయి .అప్పటి రోజుల్లో మయా గురించి మా స్కూలు గురిచి ,అందరూ చాలా గొప్పగా చెప్పుకున్న సందర్భాలున్దేవి.
ఆ కార్యక్రమంలో పాలు పంచుకొన్న విద్యార్ధులను ప్రోత్స హించేందుకు నేను వ్రాసి ,పాడిన దేశ భక్తి ప్రబోధ గేయం ఇది .
ఆ సందర్భంలో మా వుత్శాహాన్ని ప్రోత్సహించి ,సహకరించిన అప్పటి హెడ్ మాస్టర్ శ్రీ పి.యస్ .మూర్తి గారు , ఇతర టీచర్లు ,ఊరి పెద్దలు, పాల్గొన్న తోటి విద్యార్థులు ఎంతగానో అభినందనీయులు.

దేశ భక్తి ప్రభోధ గేయం
కదలు కదలు కదలరా కదన భూమి కరుగారా
హిందూ దేశ వీర పౌర భరత మాత తనయుడా
వీర ధీర శూర పురుష భారత సేన సైనికుడా
నీదు భూమి భరతావని ఒక్క అంగుళం అయినను

అన్యుల కై ఒసగమని ప్రతిన చేయ రమ్మురా
మిత్రులని నమ్మితేను మిత్ర ద్రోహం చేసారు
శత్రులతో తలపడగా శ్రద్ధ తోను కదలరా
దుర్మార్గుల దునిమివేయ ధైర్యం తో సాగరా
భయం వదులు జయం కలుగు ధైర్యంతో ..
కదలు కదలు కదలరా కదన భూమి కరుగారా.

రచయిత ,గేయకారుడు :నూతక్కి రాఘవేంద్ర రావు . గేయ రచన :౧౯౬౨ జనవరి
ప్రచురణ తేది :౦౬-౦౨-2009


తేనె పట్టు పై దాడి జర్గు తుంది అని తేనె టీ గలు భావించి నప్పుడు అవి రక్షణ వలయాన్ని సృష్టించుకొనే యత్నం లో ఆందోళనతో తమను తాము పోరాటానికి సిద్ధం చేసుకొనే ప్రయత్నం …….. కవి వూహల్లో
కదలి రండి కదలి రండి
కడలి తరంగాల్లా
రండి బాబోయ్ రండి
త్వర త్వరగా రండి
సాయుధులై పరిగెత్తుక రండి రండి రండి
నెలలపాటు కట్టుకున్న
మనగూటిని కాపడుకొందాం
పూలనడిగి తెచ్చుకొన్న
తెచ్చుకొని దాచుకున్న
పూదేనియ దోచేందుకు
దొంగలమ్మో దొంగలు రండి రండి రండి !!
ముసుగేసుకు వస్తున్నరు
భయం వద్దు ధైర్యంగా
రండి రండి రండి
కుట్టి కుట్టి కుట్టి
వెంటపడి తరిమి కొట్టి
దాచుకున్న తెనేనంత
ఆ శత్రు మూక కింత కూడా
దక్కకుండా చూద్దాం
మనమే తాగేద్దాం రండి !!! రండి రండి రండి !!
మంట చేత బట్టి వారు
మన నెలవు కాల్చ జూస్తున్నరు
మనలను మాడ్చివేయ జూస్తున్నరు, రండి రండి రండి !!
బేల తనం వదలండి పిరికితనం మానండి
ముక్కులకు పదును పెట్టి విషం తోటి కుట్టేందుకు
రండి రండి వేవేగం పరుగెత్తి మీరు
కట్టే చేత బట్టి మనల తరిమి కొట్ట బోతున్నరు
మనలను చంపివేయ జూస్తున్నరు రండి రండి రండి !!!
వీరులారా ధీరులారా వెనుదిరగక పోరాడ రండి
శత్రు మూక ……..మన చెంతకు
చేరక ముందే మనమంతా
నలువైపుల చుట్టముట్టి
దాడి చేసి కుట్టాలే
కుట్టి కుట్టి కుట్టి
తరిమి తరిమి కొట్టాలె రండి రండి రండి !!!

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు , తేది:౦౬-౦౨-౨౦౦౯.


వాస్తు శిల్పులు ,గణిత కారులు
వుద్దండ పండి తులు
అంచనాలు తలక్రిందులు..
ఆ చిరు కీటకం సృష్టించిన
అద్భుత మహాద్భుత నిర్మాణ
కౌశలం ఎప్పుడైనా వూహించారా
ఈ భువి పై ఎచటనైన వీక్షించారా
తేనే పట్టు ఎటులుండునో గమనించారా
తెనంటే పడి పడి చస్తాం
తేనే టీగలకు భయపడి చస్తాం
క్షణ కాలం ఒక క్షణ కాలం
తేనే పట్టు పరికిస్తే
నిర్మాణపునైపుణ్యం
అత్యద్భుత ఆవిష్కారం!!
షడ్భుజి ఆకారపు వేల వేల గదులు
గదులన్నీ కలుపుకొంటూ తేనే తుట్టె మిగులు
గుడ్లకోరకు తెనేకోరకు వేరు వేరు గదులు
తూఫాను గాలి ఎండ వేడి
దేనినైనా తట్టుకొనే
పటిష్ట మైన తీరు లో
ఆకస హర్మ్యాల పైన
వ్రుక్షాగ్రాలపైన ,చెట్టు తొర్రలో,

పుట్టల్లో లోలోతుల
ఆ మానవ జాతికి, జంతు జాలమునకు
భయపడుతూ భంగ పడుతు
ఆ అనల్ప జీవి …
ఏళ్ళు పూళ్ళుకష్టించి గూళ్ళు కట్టి
తేనే ఈగలన్నీ పోయి పుష్పాలను
అర్ధిస్తూ వేడుకొంటూ
తేనే తెచ్చి కూడబెట్టి
దాచుకున్న
తమ శ్రమ ఫలితం
తమ నోటికి అందనీక

దొంగ సచ్చినోల్లోచ్చి
నెలల పాటు నిర్మించిన
నెలవును చిద్రం చేస్తే
దాచుకొన్న దాన్ని కాస్త
దోచుకు పోతుంటే
కోపం కక్ష క్రౌర్యం క్రోధం …
వెంటపడి వేటాడి
పట్టి పట్టి కుట్టి కుట్టి
వెతల పాలు చేసినా
బలవంతునిదే
రాజ్య మంటూ
దౌర్జన్యంగా వారు

రచన: నూతక్కి రాఘవేంద్ర రా వు
తేది :౦౫-౦౨-2009


ద్వేషంగా చూడకు వాటిని
చీదరపడి పడి క్రోధంగా
హీనంగా చూడకు వాటిని
వేగిరపడి క్రూరంగా
విజ్ఞతతో యోచించి చూడు
వివేచనతో పరికించి చూడు
కార్యాన్కిత కార్యాన్విత
జీవ సహ జీవన గమనం.
వాస్తు శిల్పి, కళా తపస్వి,
దీక్షా దక్షా పూరిత
ధన్యజీవి నిస్వార్థ జీవి
సంఘ జీవి కర్మ జీవి
కోట్ల కొలది ఆ జీవులు
స్వజీవజాల సంరక్షనార్థమై
స్వయం సృజిత నిర్మాణం
ఎన్నెన్నో యోజనాలు
రాత్రనక పగలనక
ఆకలి దప్పులు మరచి
తిరిగి తిరిగి అలసి సొలసి
మట్టి కరచి పుట్ట పెట్టి,
మాను కరచి గూడు కట్టి
పట్టిన పని వదలనట్టి
క్రమ శిక్షణ కల యోధులు
ఆ సూక్ష్మ జీవి ఆశల పై
ఆ జీవి కన్న సంతితి పై
ఆ వాస్తు కళా తపస్విపై
పాదమేసి నలిపి వైచి..
అతి దారునమామానిసి

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు తేది :06-౦౨-2009


అది కావచ్చును నిదురలోని చేష్ట
ప్రక్రుతి పురుషుని ఒడిలో
శయనించిన జ్ఞాపకాల పరవశాన
భూమాతకు కలిగినట్టి పులకరింత
కావచ్చును కావచ్చును
అలసిన ఆ ప్రుద్వీమ తల్లి
కలత నిదురలోని చేష్ట
కాని ఆక్షణాన!!!
ఆక్రందన ఆవేదన
భూన భొంత రాళా లలొ
దద్దరిల్లి భూ కంపన
అహో రాత్రాలు శ్రమియించి
నిర్మించిన ఆ మానవ నిర్మిత
భవన సముదాయాలేన్నెన్నో
పునాదులతో కూలి పోయి
వేల వేల జీవితాలు ఆ శిధిల
శకలాల క్రింద నలిగి విరిగి మరణిస్తే
ఆ కాళ రాత్రి ఆ నిర్భర నిశీధి
అంధకార బంధురమై
విక్రుతమై ప్రక్రుతిచేసిన
వికటాట్టహాస విశృంఖల నృత్య హేల
అతి క్రూర భయంకర మృత్యు క్రీడ
ఎం జరిగిందో తెలియదు
అచేతనావస్థలో అంతు
తెలియని అయోమయం.
పాపం ఆ భూమాతకు
గర్భ శోక భారం బాధా భరిత శోకం
ఆక్రందనం యెంత కష్టం
తన చుట్టూ తను తిరుగుతు
సూర్యుని చుట్టూ పరిభ్రమణ
అలుపంటే తెలియకుండ
క్రమ పధాన పయనిస్తూ
తననే నమ్ముకున్న తనపై
నడయాడే జీవకోటి పరి రక్షణకై
ఏమారని క్రమ పయనం
రేయి పగలు కల్పిస్తూ
అలసి సొలసి ఆ ఒక్క క్షణం
తత్తర పాటున జరిగిన
దుర్భర ఘటనాక్రమం
ఘోర భయంకర ప్రళయం
అతి భీకర భూ కంపనం.

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు తేది: ౦౫-౦౨-2009

« గత పేజీతర్వాత పేజీ »