రే రే డు 
 ఆకాసం ఆ అంచు మీద
అందని ఆ చందమామ
అందమైన చల్లని యా
వెన్నెల    పరదాలు పరచి
మనసుల పై మత్తు జల్లి 
మైమరపించే  మాంత్రికుడా ?
కావ్య రసాస్వాదనలొ
ప్రెమోధ్భవ ప్రేరణలొ
మనో ల్లాస భావన లో
 మది తలపులు తెరచి
మదినిండా ప్రియ ప్రెయసి
భావన లెన్నెన్నొ   నిలిపే
చిట్టి చిలిపి రేరేడు  ?
రచన : నూతక్కి రాఘవెంద్ర రావు.
తెది:౦3-04-09
  
ప్రకటనలు