నీ బాల్యం నీదికాదు

కాకూడదు,పెద్దల
తలిదండ్రుల కనుసన్నల
నిరంతర పరి వేక్షణ 
అనుక్షణం అడ్డంకులు 
అభ్యంతరాలు  ఇది ముట్టుకోకు 
అది  పట్టుకొకు,అరవమాకు 
ఎడ్వమాకు  అరచి అరచి
గొల చేసి  ఇంటి  కప్పు
లేపమాకు, పీకి పందిరెయబోకు
నా చిట్టి కన్నా బుజ్జి నాన్నా
ఏడ్వబోకు రా వెర్రి తండ్రి
అంతలోనె అసహనం 
మరింతలోనె  బుజ్జగింపు
నీకింకేదో కావాలి
వింత వింత శబ్దాలతో
సఙలు   చేస్తూ నీవు
ఏడుపు  లంకించుకుంటె   
 
పిచ్చివాళ్ళు వాళ్ళ కేదో
నీ  అరుపుల మాటల  కేకల
శబ్దార్ధాలు అర్ధమైనట్లు
వాళ్ళేదో ఆట బొమ్మనందిస్తె 
 
నీకేమో అది నచ్చదు కద
నేకింకేదోకావాలి మరి
నీ మాట,  నీభాష, నీ భావం
అర్ధం చెసుకొలేని అమాయక ప్రాణులు మరి.
ఆకాశపు చందమామ
పరుగెట్టుకు పోయే
మేఘపు తునకలు ,
ఎగురుతున్న రాచిలుకలు
రొడ్డున పొతూ అరిచె
కుక్కను చూడాలని పాపం 
పాపం నీ ఆరాటాలెన్నెన్నొ   
అన్ని    కావాలని
వాటితో నీవూ ఎగరాలని 
నీవనుకుంటున్నావని …
వాళ్ళకు తెలియదుగా పాపం
అన్నీ తెలుసనుకుంటారు 
వెర్రివాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో
ఆకలి అయ్యిందా,కదుపునొప్పి వచ్చిందా
చీమకాని కుట్టిందా 
ఎందుకో  మా చిట్టి గాడు  ఏడుస్తున్నాడిట్లా
వాళ్ళ ధొరణిలొ వాళ్ళు. 
 రచన: నూతక్కి రాఘవెంద్ర రావు తెది:05-04-09.