ఆసిడోన :(rain of acid)
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు .
Dt:  Mon 06-04-2009
 
ఆనాలు  కురిసాయి ఆన దేవుడో
ఆసీడు ఆనాలు ఆరి దేవుడో
పచ్చాని పంట సేలు ఆనదేవుడో
మండీ మసయ్యేనే ఓరిదేవుడో
తాగేటి నీళ్లన్నీ వరుణ దేవుడో
మడ్డికట్టీ పాయె ఓరి దేవుడో
జిడ్డు పట్టీ పాయె ఆనదేవుడో
గొడ్డు గోదా తాగి  ఆరి దేవుడో
గాటి కాడా కూలే ఓరిదేవుడో
సెరువుల్లొ సేపాలు ఆనదేవుడో
తేలి తెట్టూ కట్టే ఆరి దేవుడో
ప్రకటనలు