రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
తేది : 08-04-2009   

–  జాగృతి  –

కులమత వర్గ భావ
క్రూర సర్ప పడగ నీడ
విలవిల వణుకుతూ
మానవతా దివ్య జ్వాల
రక్షణకై దీక్ష బూన
తరుణమిదె ఆసన్నమాయె
మరుభూమిగ మారుతున్న
మానవ జీవ సమాజ రూపులను
మానవతా వైద్యంతో
మమతానురాగాలు నింపి
మరులు గొలుపు పూదోటగ 

మార్చుకొందాం
మార్చుకొని పేర్చుకుందాం
మనోహర కావ్యంగా

ప్రకటనలు