–  ప్రేరణ –

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
Date:08-04-2009
అణుమాత్రం ప్రోత్సహించు
క్షణ మాత్రం ప్రశంసించు
ఆత్మీయత ప్రోది చేసి
ఆలంబననందించు
నిబిడాశ్ఛర్యంలో  నీవుండగానె
నిర్దేశిత పద గమ్యం
చేరిపొవు చిటికలోన.