కిటికీ కావల
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :10-04-2009
ఆకలి అంటే ఆరవ వద్దని
ఆవలికంపిన అమ్మహాత్ములు
మస్తుగ తిని మంచాలెక్కితే
సత్తువ లేక తూలుతు తూలుతు
మండుటెండలో ఇసుక మేటపై
తను విరుచుక పడితే
ఎయిర్ కండిషన్ రూముల్లో
డన్లప్ పరుపుల జమ్పింగుల్లో
ఆనందాలను ఆస్వాదిస్తూ
ఆ క్షణాన
ఆ కిటికీకావల
దూరంగా
కని పించే యా దృశ్యం
ఆనందాన్నే యిచ్చిందో
ఆహ్లాదమే కలిగించిందో ……
ఏప్రిల్ 10, 2009 at 1:55 సా.
అసలది వారు గమనిస్తే గదండీ…ఆహ్లాదమైనా, ఆనందమైనానూ?
good thought!
ఏప్రిల్ 10, 2009 at 5:36 సా.
అశ్వని శ్రీ గారూ, మీ సునిసిత బ్లాగ్వీక్షణకు అమోఘ విశ్లేషణకు నెనరులు (అంటే నాకు భావం తెలీదండీ,అందరు వాడుతున్నారనీ….., ఎవరితోనూ అనకండేం )ఎప్పుడో 1972 లొ అనుకుంటాను ,శ్రీ శ్రీ గారిని చలం గారిని వదలకుండా భావోద్వేగపు వురవడిలో కొట్టుకు పోతుండే రోజుల్లో ,భారత దేశ స్వాతంత్ర రజతోత్సవాల సందర్భంగా అనుకుంటా నేను వ్రాసి నటించిన ఏకపాత్రాభినయం లో ఇది ఒక చిన్న తునక.భావం సమాజాన్ని విశ్లేషిస్తే భాష పదాల వున్నతిని ప్రస్ఫుటిస్తుంది . క్రుతఘ్నతలు . వీక్షిస్తూ వుండండి అప్పుడప్పుడూ నా బ్లాగును.ఆశీస్సులతొ నూతక్కి రాఘవేంద్ర రావు .
ఏప్రిల్ 12, 2009 at 6:34 ఉద.
క్రుతఘ్నత–ఆర్యా! ఇది అప్పుతచ్చా? అసలు భావమా? ఏదైనా తప్పుగా అన్నానా? నా ఉద్దేశ్యం మీరు వర్ణించిన వారు బీదా బిక్కీనసలు పట్టించుకోరని చెప్పడమే నా అభిప్రాయం. ఆ విధంగా నేనూ మీతో ఏకీభవించినట్లే!అన్యధా భావించవలదు.
ఏప్రిల్ 12, 2009 at 7:08 సా.
అశ్వని శ్రీ గారు మీరు నన్ను అపార్ధం చేసుకోవడం లో యే పొరబాటు లేదు.బ్లాగు లోకంలో యింకా రెండు నెలల బాలుడనె . ఇంత సెన్సిటివ్ అయితే ఎట్లాగండి మరీనూ. అచ్చ్హు పొరపాటే అన్యధా భావించకండి. క్రుతఙుణ్ణి అని టైప బోయి క్రుతఘ్నుడినయ్యాను …యీ తెలుగు పరికరాలు వున్నాయి చూశారూ వాటిపై మనం స్వారి చేయడం నేర్చుకోవాలి.పగ్గాలు చేబట్టి ఛక్కగా ప్రయాణం సాగించ వచ్చ్చు. నిజంగా ఆవి మనకు వర ప్రసాదాలు.వాటిని