శాంతి జల్లు
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :16-04-2009
 
నీలో నీ మదిలోనీ హృదిలో 
 క్రోదాగ్నిని ఆర్పివేస్తే
శాంతం అధిగమించి
సౌజన్యం వుద్భవించి
 చైతన్యం రగులుతుంది
లావణ్యం నీ హృదిలో
నవనీతం నింపుతుంది.
కారుణ్యం నీ గుండెల
కలకాలం వుంటేనే
తోటివాని   సహకారం
తర తరాలు నిలుస్తుంది