కవిత్వం -నియమ నిబంధనలు  ( వుండాలా? ఒక సందేహం ).
రచన:నుతక్కి రాఘవేంద్ర రావు.  తేది: 22-04-2009
 
ఒక ప్రత్యెక సందర్భంలో ఒక సాహితీవేత్త సభనుద్దేశించి ఒక సందేహాన్ని వదిలారు.అదేమంటే  ఒక కవితా ప్రక్రియ ను వుటంకిస్తూ దానిని  కవిత్వంగా పరిగణించ గలమా అని .  . 
 
అప్పుడు ఆ విషయమై  మాట్లాడేందుకు సిద్ధపడి లేనందు వల్ల, అవకాశం వినియోగించుకో లేదు. ఆ తరువాత నా భావానికి అక్షర రూపమిచ్చి  ..ఈ విధంగా మీ ముందుకు .
ఆర్యా!
                      
ఏ మానవ భాషలోనయినా  అక్షర సమాహారం పదమయితే, పదాల  సమాహారం వాక్యాలు.వాక్యాలు వ్యాఖ్యలుగా మారి ,వచనంగా, మారుతుంది.
సందర్భానుసారంగా వాటికి  ,ఆహార్యాన్ని ఒనగూడిస్థే అది పద బంధితమై..మామూలు వచనమో… దానికి రిధం జొడిస్థే  అది  కవితో,పద కవితో,  వచన కవితో,ఛందో  బధమైతే  పద్యమొ,రాగబధమై, రాగయుక్త మైతే  గానమో యిలా పలు విధాల భాష ను వినియోగించ  వచ్చు.
 
భాష వ్యక్త పరిచేందుకే అయినప్పుడు … పదచిత్రాలు మన కళ్ళకు  ఆ సన్నివేసాన్ని చూపిస్తున్నాయి  .అవి చదివినప్పుడు   అసంకల్పితంగా మనం భాషాపరంగా ఎంతటి  సామాన్యుల మైనా,ఆ  సన్నివేశంలొ మమైకమై పోతున్నాము.  
కాని ఒకా భావ యుక్త కవితలో,లేక కఠిన పదభరిత సమాసయుక్త 
వచనమో,  సామాన్యుని ఆ స్థితికి చేర్చదు.ద్రుశ్యాన్ని  చూపి అన్వయించుకోమన్నా ,అన్వయించుకొని అనుభవించమన్నా,రవి  గానని చొ.. కవిగాంచు …నన్నటుల  కవి తాను చూసింది, తాను చెప్పాలనుకొన్నది,తన ధ్రుక్కొణంలో నుంచి   తన కున్న భాషా సామర్ధ్యంతొ జన బాహుల్యంలో యే వర్గానికి చెప్పాలనుకొన్నాడో  ఆ యా సామాజిక వర్గాలకు అర్ధమయ్యే రీతిలో చెబుతాడు.

కాలానుగుణంగా ఆదరణానుసారం కవిత్వాలు అనేక రూపు రేఖలు దిద్దుకుంటూ,కొంగ్రొత్త సౌందర్యాలద్దుకొంటున్న  యీ తరుణంలో మీ యీ ప్రశ్న :
 
కేవలం పద చిత్రాలు కవిత్వం అవుతుందా? అని కదా..

..నాదొక  ప్రశ్న …..అసలు కవిత్వానికి నిర్వచనం యేమైనా వుందా? వుంటే  నియమ నిబంధనలు, కొల బద్దలు యేవయినా వున్నాయా?వున్నాయి పో ,వాటికి క్రొంగొత్త పోకడలు   శ్రుష్టించకనే    కవితా వ్యవసాయం సాగుతోందా? కవిత్వం అభివృద్ధి చెన్దుతొన్దా?

యేది యేమైనా పద చిత్రాలు, అవే కాక నూతన రీతులు ఏవయినా  కవిత్వంలొ మనమందరం స్వాగతించ దగ్గ  సముచిత ప్రక్రియలు , వాటిని మనమందరం స్వాగతిద్దాం.సరళభాషాపద  ,సాహిత్యాన్ని ఆహ్వానిద్దాం,నూతనత్వాన్ని, నవీన పొకడలను స్వీకరిద్దాం.మాత్రు  భాషను పటిష్టం చేస్తూ ప్రస్తుతమున్న చాందస భావ శ్రుంఖలాలను త్రుంచేద్దాం.ఏన్నెన్నొ తరాలుగా భాషను చాందస భావాల నుండి  రక్షించు కొంటూ సుసంపన్నం చేసుకొంటూ వస్తున్నాము.మరల మరల ఛాందసం   తొంగి చూస్తూనే వుంది.
నన్ను క్షమించాలి     ….ఎవరినీ  వుద్దేసించి కాదు నాయీ వ్యక్తీకరణ. ఈ సందర్భంగా మనందరం ఒక యుగళ గీతం పాడుదాం.

యుగళగీతం
————–
మన కవి సమ్మేళనా
 యుగళ గీతం
సరళ భాషా పద
యుక్త భవ్య  సమ్మిళితం
సుసంపన్న భావ భూషితం
స్వభాషాభిమాన పూరితం
కవి పండిత  మేధో  కొవిదం

కావాలని ఆసిస్తూ  ఆకాంక్షిస్తూ

తెలుగు భాషా శ్రేయోభిలాషులు ,  మన యీ సభ  లొని వారందరికి అభినందనలు క్రుతగ్నతలు .ఈ సందర్భంగా నాదో   చిన్న విన్నపం.   గుంపు పదానికి ప్రత్యామ్న్యాయ పదాన్ని వెదకమని విన్నవిస్తూ   ……..మీ  అందరి వాడు ….నూతక్కి రాఘవేంద్ర రావు.

ప్రకటనలు