అంతు బట్టని విద్యుత్ అవసరాలు

(సాంప్రదాయేతర గత్యంతర ప్రత్యామ్న్యాయాలు.)

రచన : నూతక్కి రాఘ వేంద్ర రావు. తేది :24-04-2009

(హ్రుదయం బ్లాగరు వ్రాసిన అణువు వెలుగు వెనుక చీకట్లు…దానిపై శ్రీ మార్తాండ గారి స్పందన చూసి ప్రేరితుడనై… )

ఇంట్లోకి ఎలుక చేరిందని యింటికి నిప్పెట్టుకోము.కరెంటు ముట్టు  కొంటీ  షాకు కొడుతుందని తెలుసు,ఆ కరెంటే   ప్రాణానికి అజాగ్రత్తగా వుంటే  హాని  అని తెలిసి కూడా ఇళ్ళల్లో కరెంటు పెట్టు కుంటున్నాము.వాడుకొంటున్నాము. యీ రోజు అది లేకుండా రోజు గడవని  స్థితి. ప్రపంచీకరణ పుణ్యమ్మా అని ఆకర్షణీయమైన విద్యుథ్ పరికరాలు.ఇంట్లో ,దీపం ,ఫాను,ఇస్త్రీ పెట్టె,ఫ్రిజ్ ,గ్రైన్డర్లు  ,   బట్టల వుతికే మిషన్లు, సెల్ చార్జర్లు ,టి వి లు,ఎ.సి లు  యింకా ఎన్నో .  తింటానికి తిండి వున్నా లేకున్నా. మనిషి యీ రోజున విద్యుత్తుకు దాని ద్వారా సంక్రమించే సౌకర్యాలకు బానిస గా మారాడు.విద్యుత్తు లేని అధునాతన ప్రపంచం యీ రోజు వూహించలేము. విద్యుత్ ను కనిపెట్టిన తరువాత బాటరీ విద్యుత్తును వాడే వారు. అంటే బాటరీనీ కనిపెట్టారు.సాంప్రదాయ రీతుల్లో విద్యుత్ వుత్పత్తి,జల విద్యుత్తు కన్న ముందు, ఆయిలింజన్లను వాడే వారు. జల శక్తి వినియోగించి విద్యుదుత్పాదన ప్రారంభించిన తరువాత ప్రపంచ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఆధిక విద్యుత్తు అందుబాటులో కొచ్చి తద్వారా వచ్చిన పారిస్రామిక విప్లం తో వుత్పాదక రంగం పరుగులు నేర్చింది. యీ విప్లవం సాంకెతిక రంగాన్ని ప్రభావితం చేసి వివిధ రంగాల్లో విప్లవాత్మక ప్రయోగాలు జరిగి ప్రయాణ రంగంలో విప్లవాత్మక మార్పులకు పూల బాట వేసింది. విద్యుత్ రంగ పురోగమన ప్రభావం వ్యవసాయ రీతులనే మార్చి వేసి అధిక ఆహారోత్పాదనకు తన వంతు తోడ్పాటును అందించింది.

 ప్రాణాంతకమైన విద్యుత్తు

,అంటుకుంటే ప్రాణం తీసే విద్యుత్తు,

 అదిలేకుంటే  ప్రాణాలే వుండవనిపించే విద్యుత్తు,

అదిలేకుంటే తిండి, గుడ్డ ,గాలి ,నీరు

 దేనిని మన దరి చేరనీయని విద్యుత్తు,

అది వుత్పత్తి కావాలంటే ….వున్న మార్గాలు 

 1)రసాయన రీతుల్లో (బ్యాటరీలు) అవి చాలా చిన్న తరహా వుత్పత్తికి మాత్రమే దోహద పడతాయి .

యిక మిగతా ప్రక్రియలేవయినా జెనరేటర్ల ద్వారా విద్యుత్తు ను వుత్పత్తి చేయడమే. కాని జెనరేటరును తిప్పేందుకు ఒక యంత్రం కావాలి.ఆ యంత్రాన్ని తిప్పేందుకు శక్తి కావాలి. యిక్కడ మనం  విమర్శలయినా చేయ బోయే ముందు యీ శాస్త్ర సాంకేతికి పరిగ్నాన్ని ప్రాధమికంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా వుంది.

 1)ఆయిలు: యీ జెనరేటర్లను త్రిప్పేందుకో యంత్రం కావాలన్నానుకదా.. దీనికి తొలుతలో  ఆయిల్ యింజన్లు వాడే వారు.దాని వుత్పత్తికి విపరీత మయిన కర్చు అయ్యేది. అదీ కాక విపరీతమయిన కాలుష్యం. ప్రస్తుత ప్రపంచంలో ఆయిలు వాడి విద్యుత్తు వుత్పత్తి చేయాలి అంటే   యిక రవాణా సాధనాలకు నూనె దొరకదు.

2) బొగ్గు :భూమిలో లభించే యీ పదార్ధం యిప్పటి వరకు నాగరిక మానవ ప్రపంచానికి పారిశ్రామిక విప్లవానికి యితోధికంగా తోడ్పడింది కాని యింక దాని లభ్యత క్రమేణా తగ్గి పోతోంది.మునుముందు మనకు అందని నల్ల బంగారమే. దీన్ని ప్రస్తుతం ధర్మల్ విద్యుత్తు వుత్పత్తి ప్రక్రియలో వినియోగిస్తున్నారు.దీని నిర్మాణానికి అయ్యే వ్యయం, తరువాత నిర్వహణకు అయ్యే వ్యయం చాలా ఎక్కువ.చాలా స్తల సేకరణ కావాలి. నిర్వాసితులకు పరిహారం రూపేణా ఇబ్బడి ముబ్బడిగా ధనం వెచ్చించాలి. విపరీతంగా నీరు అందుబాటులో వుండాలి.అందుకొరకు నదీ ప్రవాహాల చెంత నిర్మించి ,ఆ నదుల పై డాములు కాట్టాలి.యీ వుత్పత్తిలో విపరీతమైన పర్యావరణ కాలుష్యం కలుగుతుంది.

3)  జల విద్యుత్తు : యీ ప్రక్రియ వుభయ తారకం . అటు విద్యుత్తు లభిస్తుంది,వ్యవసాయానికి నీరు అందుతుంది. నదులకు ఆనకట్తలు కట్టి ఎత్తయిన ప్రదేసాన్నుంది నాళికలద్వారా అత్యంత వేగంతో నీటిని తర్బైనులకు పంపి వాటిని వేగంగా తిప్పడం వల్ల జెనరేటార్  వేగంగా తిరిగి ,మనకు విద్యుత్తు లభిస్తుంది. యిక్కడ యీ ప్రక్రియలో

1)  ఖర్చు ఒకేసారి పెదు తున్నాము.

2) దీర్ఘ కాల ప్రయోజనం.

3) నిర్వహణ ఖర్చు తక్కువ.విద్యుదుత్పత్తి తరువాత ఆ నీటిని వ్యవసాయానికి మళ్ళించ వచ్చు .

 4) కాలుష్యం తక్కువ. యిక యీ ప్రోజెక్టుల నిర్మాణంలో మిగతా నీటి ప్రోజెక్టులకు ఎదురయ్యే సమస్యలే వీటికిన్నూ. జలాశయాల లో ఎన్నో గ్రామాలు ముంపునకు గురై ప్రజలను తరలించ వలసి వస్తుంది .వారికి వుపాధికల్పించాలి , నష్ట పరిహార్మ్ యివ్వాలి. ,యిత్యాది సమస్యలను ,సాంఘికంగాను, ఆర్ధికంగానూ ప్రభుత్వాలు ఎదుర్కో వల్సి రావచ్చు.అది యే నీటి ప్రోజెక్తుకయినా తప్పదు.వర్షాభావ పరిస్తుతులలో వుత్పత్తి పూర్తిగా పడి పోతుంది.

అటువంటి పరిస్తితులలో వీటిపై ఆధార పడలేము.మనం విద్య్త్తు లేకుండా వుండలేము. అందుకే ప్రభుత్వాల ప్రొత్సాహంతో శాస్త్రగ్నులు పరిశోధనా ఫలమే అణు  శాస్త్ర విజ్ఞానం .  భూ గర్భంలో వుండి, భూమి పైనజీవిస్తున్న జీవావర్ణానికి అనేక అనారొగ్య పరిస్తితులు కల్పించే కొన్ని పదార్ధాలను  వెలికి తీసి వాటిని అనేక రకాల మార్పులకు గురి చేసి ఇంధన కడ్డీలుగా మార్చి రియాక్టర్లలో అణు విద్యుత్ వుత్పత్తికి వాడుతారు. దీని ద్వారా కొన్ని వేల టన్నుల బొగ్గుకాల్చితే కలిగే ప్రయోజనం కొన్ని కిలోల అణు ఇంధన కడ్డీల ద్వారా పొందవచ్చు.యిందు వల్ల బొగ్గు రవాణకయ్యే అత్యధిక ఖర్చులు తగ్గుతాయి.బొగ్గు లేదని బాధ పడనవసరం లేదు. దీనికి అయ్యే ఖర్చు ఎక్కువే కాని దీర్ఘ కాలిక ప్రయోజనాలుండటం ,ఎక్కువ విద్యుత్తు లభించం వంటి పలు ప్రయోజనాలు వుండటం వల్ల యీ ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షిత మయ్యింది. యీ విధానానికై అణు యింధన లభ్యత చాలా ముఖ్యం.ఆ సమస్య పరిష్కరింప బడితే మిగతా వుత్పన్నమయ్యే సమస్యలు పరిష్కరించడానికి మనం కనిపెట్తే శాస్త్ర విఙానమే కాపాడుతుంది. యీ ప్రక్రియలో అక్కడి  ప్రజలకు పర్యావరణానికి హాని కారకమౌతున్న పదార్ధాలను వెలికి తీయడం వల్ల ఆయా ప్రాంతాలలో క్రమేపీ పర్యావరణానికి జీవావరణానికి హాని తగ్గుతుంది.

యిక పోతే మనం అసలు చర్చించడానికే సిద్ధ్ధ పడని మరికొన్ని ప్రత్యామ్నాయ విద్యుదుత్పాదక ప్రక్రియల గురించి మనం చర్చించుకో వలసిన అవసరం ఎంతయినా వుంది. మన భావి తరాలకు మనం అందరం కలసి క్రుషి చేస్తే కాలుష్య రహిత ప్రపంచాన్ని అందించ గలం.

1)అందులో అతి ముఖ్యమయినది (సోలార్ ఎనర్జీ) అనంతమయినది కాలుష్య రహిత మయినదీ ,సూర్య రస్మి యొక్క శక్తిని సద్వినియోగ పరచుకోవడం .విద్యుత్ రవాణా కొరకు వ్యవస్థ అవసరం లేదు.

2)సముద్ర అలల నుంచి (టైడల్ ఎనర్జీ ).దీనిని వినియోగదారుల ఆవరణలో ఏర్పాటు  చేయలెము. సముద్ర తీర జలాలవద్దనే యేర్పాటు చేయాలి. విద్యుథ్ రవాణా అవసరం కొంతలో కొంత తగ్గుతుంది.

3)విండ్ ఎనర్జీ :  గాలి వేగాన్ని వినియోగించుకొని ,గాలి మరల ద్వారా,విద్యుత్తును వుత్పత్తి చేసు కోవడం . దీనికీ విద్యుత్ రవాణా అవసరముంటుంది. కాబట్టి సూర్య కాంతి నుండి విద్యుదుత్పత్తి చేసుకోవాలనే దీక్షతో ముందుకు వెళితే ,

దానికి కావలిసిన సాంకేతిక పరిగ్నానాన్ని యుధ్ధ ప్రాతిపదికన ప్రపంచ వ్యాప్తంగా అభివ్రుధ్ధి పరచు కొంటె ,భూ ప్రపంచం  స్వర్గధామ మౌతుంది. నూనె కొరకు, యుధ్ధాలు వుండవు . ప్రపంచ మంతా శాంతి  విస్తరిస్తుంది. యీ ప్రక్రియలో విద్యుత్తును నిలువ వుంచేందుకు మరల రసాయినిక విద్యుదుత్పాదనా ప్రక్రియను కూడా వినియోగించుకోవలసి వస్తుంది .ఈ ప్రక్రియలో చాలా కొద్ది స్తలమే సరి పోతుంది ఎవరి అవసరాల కణుగుణంగా వారే వారి ఆవరణలలో యీ వుత్పాదక కేంద్రాలు స్తాపించుకో వచ్చు.సూర్య రశ్మి వున్నప్పుడు ఎక్కువ వుత్పత్తి చేసుకుని దాచుకొంటే  ,సూర్య రశ్మి లేనప్పుడు వినియోగించు కో వచ్చు. సర్వే జనా సుఖినో భవంతు:

  • About రావు utakki Raghavendra Rao
  • ప్రకటనలు