మా పెరటి చెట్టు కొబ్బరి బోండాం
(పొందడమో సాహస చర్య… తాటి కాయకయినా అంతే)
(నాకూ కొబ్బరి చెట్టుందని చన్కలెగరెస్తె సరి పోదు బాబూ.)
( ధర్మవరపు స్టైల్లో అనుకోండి స్వగతంలో)
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది:29-04-2009
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది:29-04-2009
మా పెరటిలోని కొబ్బరి చెట్టు
నా స్వంత చేతులలోపెరిగింది
కాసింది కాయలు యెన్నో
మండుతున్న వేసవి ఎండలొ
దాహమేసి తాగాలనుకొని
కాసింది కాయలు యెన్నో
మండుతున్న వేసవి ఎండలొ
దాహమేసి తాగాలనుకొని
తపనపడుతూ గుటకలేస్తూ .
చేయని యత్నం లేదు
చెట్టునుంచి బోండాలను
చేయని యత్నం లేదు
చెట్టునుంచి బోండాలను
రాల్చేందుకు ..త్రాగేందుకు …
చెట్టెక్కి కోసే వాళ్ళు
చెట్టెక్కి కోసే వాళ్ళు
మహానగరాన ఎక్కడో
ఓ పొడుగాటి
ఓ పొడుగాటి
వాసం బొంగుకు
కత్తి కట్టి మరీ
బోండాలను రాల గొట్టి
కత్తి కట్టి మరీ
బోండాలను రాల గొట్టి
నెత్తులు పగిలే
ప్రమాదాలు తప్పుకొని
మొత్తానికి సాధించాం
మొత్తానికి సాధించాం
అయినా
బోండమెలా త్రాగాలొ
బోండమెలా త్రాగాలొ
అమాయకంగా వెర్రి మొఖాలతొ
చెట్టెక్కి కాయ రాల్చి…
బాబోయ్ మనవల్ల కాదు.
కొబ్బరి బోండాలు కొని
త్రాగేస్తే పోలా !
మరోసారి స్వంత కొబ్బరి చెట్టు
నాటాలని అనుకున్నా
దాన్ని పెంచాలని అనుకున్నా
కాయనీరు …
కాయనీరు …
బోండాం కాయ నీరు
త్రాగాలని అనుకున్నా
చెట్టెక్కుట నేర్చుంటాం
త్రాగాలని అనుకున్నా
చెట్టెక్కుట నేర్చుంటాం
మొదట చేట్టేక్కుట నేర్చుకుంటాం
కొబ్బరి చేట్టేక్కుట నేర్చుకుంటాం .
ఏప్రిల్ 30, 2009 at 4:20 ఉద.
cheers!
ఏప్రిల్ 30, 2009 at 8:00 ఉద.
థాంక్స్ అశ్వనిశ్రీజీ,అంతా క్షేమమని భావిస్తున్నాను. యేదయినా సాహితీ సంకీర్ణంలొ చేరాలని నా యోచన.మీ సలహాకొరకు ఎదురు చూస్తా. గుంపు అనే పదం నా మేని పైన గొంగడి పురుగు ప్రాకినట్లుంటుంది.అందుకే సంకీర్ణం అన్నాను.ప్రతి రోజూ చూస్తున్నాను అంతర్జాలంలో మీ పురోగతి.మహా కవి, సాహితీ ప్రఖండుడు శ్రీ శ్రీ గారి జన్మ దిన సందర్భంగా మీకు సాహితీ సుభాకాంక్షలు.
ఫిబ్రవరి 27, 2010 at 10:54 ఉద.
అయితే మీరు చెట్టులెక్కగలవా ఓ నరహరి అనే పాట పాడుకుంటూ ఉండాలి. ఇంతకీ ఆ చెట్టు కొబ్బరిబొండాం త్రాగారా లేదా. లేదంటే మా ఊరు దయచేయండి. కావల్సినన్ని కొబ్బరినీళ్ళు.
ఫిబ్రవరి 27, 2010 at 4:23 సా.
డియర్ శ్రీ వాసుకి గారూ, యిది ఒక పోస్టు అనుకోండి,లేక సమాధానమనుకోండి……అంత లోతుగా నాపెరటి చెట్టు కొబ్బరిబోండాం దాక వెళ్ళొచ్చారంటే మీరు చాల ఓపికమంతులే. నాకా పాట రాదుగా …ఆహా! మీరన్నట్టు అందుకే నేనేం పాడుకోలా.
కాళ్ళకు బందమేసుకొని నేనే ఎక్కుదామనుకున్నా కాని, మా ఆవిడ చుట్టుప్రక్కలవాళ్ళు మీరెక్కటమేంటని (యీవయసులో మీకిదేం పోయేకాలం అని మనసులో అనుకొని వుంటారు లెండి) వారించి మా సత్తి గాణ్ణి ప్రోత్సహించారు. వాడికి మహా భయం. చివరికి నేనే వుపాయం చెప్పా.
పొడుగాటి వాసానికి కొడవలి కట్టి మా సత్తిగాడు మేడపైనుంచి రాలగొట్టాడు. కాని కొబ్బరికాయలుకొట్టే కత్తిలేక కొబ్బరిబోండాలబండి వాడికి కాయకి రెండు రూపాయలిచ్చి కొట్టించుకొచ్చాడులెండి .
వాడింత పనిచేసి పెట్టిన తరువాత వాడికీ యింటిల్లి పాదికీ నాలుగు బోండాలిచ్చి,ఇరవయ్యి రూపాయిలైనా యివ్వకుంటె బాగుండదనీ… డబ్బులిచ్చి,మిగిలిన బోండాలు ఓ ఆరుమిగిలితే తలోటీ మేమే ఆరగించామనుకోండి…..
..బండిమీదైతే కాయ ఎనిమిదేనండీ… యీ రోజుల్లో. కోనసీమనుంచీ కేరళనించీ లారీలకు లారీలు ప్రతీ సందులోనూ
బోండాలు ఫ్రెష్ గా దిగుతానే వుంటాయి.కరువేమీ లేదుగాని, మన పెరటి చెట్టు కొబ్బరిబోండాం త్రాగాలన్న కోరిక అంతే. చివరికి తాగాంలెండి.
గత ఇరవై అయిదు సంవత్సరాలక్రితం వరకూ మా హైద్రాబాదులో పేషెంట్ కు బోండం కావాలంటే దొరికేది కాదు.యిప్పుడు కోనసీమలో కూడా ఇన్ని బోండాలు దొరకవేమో మూడొందల అరవై ఆరు రోజులున్నూ.
యింతకీ మనది కోనసీమా చెవిలో చెప్పండి,నేనెవరికీ చెప్పను.ఏంటో ! క్లుప్తంగా రాద్దామన్నాయీ సమాధానం బ్లాగుకు మించిపోయింది.(తరువాత కొంచెం మార్చి నా బ్లాగులో పెట్టుకుంటాలెండి.) . యింతకీ నా నిరంతరం చూశారా
ఫిబ్రవరి 27, 2010 at 5:37 సా.
చెవిలో ఎందుకండీ కర్మ మాములుగానే చెబుతా మనది కోనసీమే. కోనసీమలోని బండారులంకలో కొంతకాలం ఉన్నాము. తర్వాత కోనసీమ ముఖద్వారంగా పిలువబడే రావులపాలెంలో 25 సంవత్సరాలు పైబడి ఉన్నాము. కాని ఈమధ్యనే ఉద్యోగరీత్యా రాజమండ్రిలో ఉంటున్నాము. మీ బ్లాగ్ అంతా నెమ్మదిగా రోజు ఓ చూపు చూస్తున్నాను. సమయాభావం వల్ల నిరంతరం కొద్దిగా చూసాను. తప్పక మళ్ళీ చూస్తాన్లెండి. మీ పెద్ద సమాధానానికి ధన్యవాదాలు. ఓపికగా వ్రాసారు. అది చాలు.
ఫిబ్రవరి 27, 2010 at 7:32 సా.
Thanks ..Sri vaasuki….Nutakki