ఏప్రిల్ 2009


 అగాధం

కాబోలును పుడమి తల్లికది
ప్రక్రుతి చేయించి యిచ్చిన
అతి సుందర వజ్ర ఖచిత కంఠ మాల
అనంతానంత అఖాతాలు
యోజనాల దైర్ఘ్యం లో
సుదూరాలు ఇరు తీరాలు
సుందర పర్వత పంక్తులు
ప్రక్రుతి భూమాతకు చేసిన
అలంకారమా!!!!మహాద్భుతం
అనూహ్యం అనిర్వచనీయం
వీక్షకుల కది
గానామృత కావ్యాన్విత
నేత్ర పర్వ సంగీతం .

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు. తేది:౧౦ -౦౨-2009

 

వుగాది పచ్చడి
 

 

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :12 -02-2009
 
కొమ్మ కొమ్మ న పూలతో
పూల నిండా తేనెతో వేప 
 
రెమ రెమ్మన  పిందెలబరువుల
వంగుతూ  ఒదుగుతూ  మామిడి  
 
షడ్రుచుల చేరేందుకు  తపన పడుతూ  
మదనుని చేజారుతూ జారుకుంటూ విల్లు  
 
ఏ చింతా లేకుండా విరగ కాసి
వినమ్రంగా చింత చెట్టు
 
తాలేకుంటే ఎట్లా అంటూ సాగర
తీరం నుంచితరలి వస్తూ వుప్పు
 
ఏరా ఎర్రగా కనువిందుచేసి 
కన్నుల నీరూరించే కారం
 
వుగాది ఆగమనాకాన్క్షతో
వీక్షిస్తూ స్వాగతిస్తూ షడ్రుచులు
  నిరంతర చింతితుడు 
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు  
తేది: 08-04-2009  
 
సమాజాన అనునిత్యం 
ఆక్రందన ఆవేదన  
కక్షలు కార్పణ్యాలు
కుట్రలు కుతంత్రాలు
మారణహోమాలు
కులంపేర మతంనీడ
రాజకీయ చత్ర ఛాయ
కారణాలు ఏవయినా
ఎటుచూసినా 
కాలకూట విష జ్వాలలు
 
మానవతా భావంతో
సామాజిక చింతనతో
సమాజాన సుహృద్భావ  
సామరస్య సాధన కై 
నిరంతరం నీ యత్నం 
అభిలషణీయం
అనుసరణీయం
ఆదర్సప్రాయం  
కానీ
ఎటుచూసినా  నీ మార్గం 
కంట కావ్రుత కీకారణ్యం
 
కక్ష,కార్పణ్యం ,క్రోధం ,ద్వేషం ,
అనేకా నేక కంటకాలు  
కాలు కదిపితే చాలు 
 ఖస్సుమంటూ  
తీవ్ర వాద కాల నాగు  
ఆకలి చావులు 
బొటా బోటీ జీవితాలు.
 నిరంతర వేదనలో
వేతన  జీవులు
పనులు లేవు తిండిలేదు
సాంఘిక వ్యత్యాసాలు
ఆర్ధిక నిమ్నోన్నతాలు
ఎన్నో ఎన్నెన్నో అడ్డంకులు
 
ప్రేమ సహనం సానుభూతి
నీ పాదాలకు రక్ష రక్ష
అవగాహన అనురాగం
శిర స్థ్రాణ  ఛత్రం
సాగిపో ఆగబోకు
ఆత్మీయత  వూతకర్ర  
చేతబట్ట మరచిబోకు
 
 
దివ్య దీప్తి
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది: 29-10-1991
 
ఆనందం నీ గుండెల
అరవిచ్చిన పుష్పం
ఆహ్లాదం జీవితాన
ప్రసరించే  వుదయ కాంతి
నీటి బుడగ జీవితం 
చితికి పోవు మరు క్షణం  
చింతలన్ని చేరిగివేసి 
చికాకులన్నీ పారద్రోలి
కోపాలను చిదిమి వైచి 
కుటిలత్వపు భావాలను
 క్రుల్లబొడిచి పాతిబెట్టి   
మమతా మానవతా
 విరులే  విర బూయగా 
 పరిమళాలు వెదజల్లగా 
అభ్యుదయం నర్తించగా
సుస్వాగాతమందాం
నవ్య కిరణ శో భాన్విత
దివ్య  భవ్య భావనల తో .
సమాజాని కందిద్దాం
సప్తవర్ణ దివ్య దీప్తి  
————————
  
సహకార సంఘాలతో నాకున్న పరిచయాలు.
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు 
సం : 1976
 
నేను  నా స్వంత డబ్బులతో , నా స్వంత వుత్సాహంతో స్థాపించి, కార్మికులను ఒప్పించి ,సభ్యులుగా చేర్పించి, ప్రాధమిక సభ్యుల  సభ్యత్వ రుసుము నేనే చెల్లించి,సమస్తను రిజిస్టరు  చేసి  ,కొన్ని సంవత్సరాలు కాపాడి , పాలక వర్గాన్నిగౌరవ సభ్యుల అనుమతితో  సక్రమమైన నియమ నిబంధనలు ,పాలనా పధతులు ,విధి విధానాలు, ఏర్పరచి ,పాలక మండలిని నియమింప జేసి సగౌరవంగా తప్పుకున్న ,ఆ సంస్త  నా మనో జనిత పుత్రిక. అది ఒక పొదుపు మరియు పరపతి సంస్త.
 ఆరోజుల్లో మేము వుద్యోగం చేసే సంస్త  కార్మికుల , జీత భత్యాలు చాల తక్కువ వుండేవి. ప్రభుత్వ వుద్యోగం వచ్చే సరకి ,ఒక్క సారిగా కుటుంబ భాద్యతలు మీద పడేవి. చేల్లిళ్ళ పెళ్ళిళ్ళు వగైరా.  అప్పులు చేస్తుండేవారు. అలా భవిస్య  త్తును నమ్ముకుంటూ దానినే అమ్ముకొనేవారు. అప్పులు చేస్తే భవిష్యత్తులోనేగా   తీర్చాలి. ఆ విధంగా భవిష్యత్తు అమ్ముకొనే దిశలో, అప్పుల వ్యాపారం చేసే వాళ్ళు వచ్చి అప్పిచ్చే వారు. వాళ్ళు ఒంద రూపాయలు అప్పు తీసుకుంటే పది రూపాయలు నెల వడ్డీ తగ్గించి తొంభై రూపాయలు ఇచ్చే వారు నోటు మాత్రం వంద రూపాయలకు తీసు కునే వాళ్ళు .నెల నేలా పది రూపాయలు వడ్డీ మాత్రం కడుతూ, అసలు మాత్రం పది రూపాయలు కట్టాలి .అలా పది నెలలు చెల్లించాలి. ఏ నెలయినా నెల కిస్తు కట్ట లేక పోయినా, వడ్డీ కట్టలేకపోయినా ఆ యిరవై రూపాయలకు మరో ఇరవై రూపాయలు పెనాలిటి కట్టాలి. వీడి కొచ్చ్చే జీతంలో అప్పుల కిస్తులే కడతాడా, వడ్డీ ఏ కడతాడా ,ఇంట్లోనే యిస్తాడా. ?ఈ వూబి నుంచి బయట పడటానికి  మరి కొన్ని అప్పులు చేసే వాళ్ళు. అప్పుల వాళ్ళు కంపనీ గేటు దగ్గరకు వచ్చి కూర్చునే వాళ్ళు. వాళ్ళను తప్పిన్చుకొనేందుకు వీళ్ళు వుద్యోగానికి వచ్చే వారు కాదు.
ఈ అప్పుల వ్యూహం లో చిక్కు కున్న వా రు లోపల సహోద్యోగుల వద్ద కూడా అప్పులు చేసే వారు.
 
ఆ సమ యములో  కార్మికుల సమస్యలపై  నేతృత్వ భాద్యతలలో పాలుపంచుకొంటున్న  నాకు అనిపించింది. వీళ్ళ కొఱకు ఏదయినా చేసి వారందరినీ ఆ అప్పుల వూబి నుంచి బయట పడెయ్యాలని.ఆ  సంకల్పంతో , సోదర కార్మికులతో సంప్రదించి ఒక పరపతి సంఘం స్తాపించే దిశగా ఒప్పించి, అప్పటికే నేను సేకరించిన సమాచారం ,సంఘ స్థాపనకై చేపట్ట వలసిన చర్యలు  వివరించి ,వారికి  ఒక విజ్ఞప్తి చేసాను. సంఘం స్తాపనకయ్యే కర్చు, రిజిస్ట్రేషన్ కు ,కావలిసిన కనీస సభ్యులు చెల్లించ వలసిన కనీస రుసుము కూడా నేనే చెల్లిస్తానని చెబుతూ , ఈ అప్పుల ఊబిలో చిక్కుకున్న వారి విషయాలు చెప్పి వారిని ఈ వూబినుంచి   వెంటనే బయట పడేసేందుకు అందరూ వారి వారి శక్తిని బట్టి   కొంత మొత్తాలు సోసై టీ లో జమ చేస్తే అప్పులిచ్చిన వారిని  పిలిపించి అప్పులు తీసు కున్న వారితో ముందే మాట్లాడి వాళ్ళ అప్పులన్నీ చెల్లించి ,వారికి  సొసైటీ ద్వారా మొదటి లోనులు  ఇప్పించే ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన మొత్తంతో మేము యిచ్చిన మొత్తాలు వెనక్కు తీసుకునే విధంగా ను, సొసైటీకి నెల నేలా వడ్డీతో కూడిన కిస్తులు కట్టే ఏర్పాటు చేద్దామని ఒప్పించ గల్గాను.
 
వారందరి దగ్గరా డబ్బు తీసుకోవడం, అప్పుల బాధితుల్ని ,అప్పుల వాళ్ళనుండి బయట పడేయడం , వాళ్ళు డ్యూటీ లకు సరిగ్గా రావడం ప్రారంభిచడం, చక చకా జరిగి పోయింది. సహకార భావన ఒకరికొకరు సహకరించుకోవడమే  కదా.ఈ లోగా  కంపనీ యాజమాన్యాన్ని కలసి ,సొసయిటీ   , కార్యక్రమాలు    వివరించి సహకరించ వలసిందిగా కోరి , సభ్యుల  జీతాలనుండి    నెల వారీ బకాయిలు మినహాయించి సొసైటీకి చెల్లించేలా అంగీకరింప చేసి,ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సొసైటీ  నిబంధనలు (బై లాస్)తయారు చేసి ,   సొసైటీ  నమోదు చేయించి ,కార్మికుల ముందు  జెనరల్ బాడీ లో   పెడితే, గొప్ప స్పందన వచ్చి సభ్యుల సంఖ్య చాలా పెరిగి పోయింది. ఆ తరువాత
సొసైటీ ని సరైన బాటలో పెట్టె దాక అడహాక్ కమిటీలో వుండి, ఎన్నికలు ప్రకటించి  ఎన్నికలు నిర్వహించి కొత్త డైరెక్టర్ల కమిటీ కి అధికారాలు, భాద్యతలు ….అప్పగించినప్పుడు , వారికి నేను  జాగ్రత్తలు చెబుతుంటే, మా వుద్యోగ సంస్త MD గారు   అన్నారూ  ,వేదిక ముందున్న మా తోటి సహోదరులతో ….ఈయన చూడండి స్వంత కూతురిని పెళ్లి చేసి అల్లుడికి అప్పగింతలు చేస్తున్న ట్లుంది కదూ. యిది ఆయన మానస పుత్రిక.కాపాడవలసిన భాద్యత మీరన్దరిదీ. అదే ఆయనకు మీరిచ్చే గౌరవం అన్నప్పుడు, జీవితంలో  యింత  కంటే నాకింకేమి  కావాలి  . జీవితంలో యిట్లాంటి పలు కార్యక్రమాలు చేపట్టి సఫలీక్రుతుడనయ్యినా మరో కొన్ని సొసైటీలు స్థాపించి నిర్వహించి నా,ఈ సంస్త నా జీవితానికోఒక గొప్ప అనుభవం.
 ఆ సంస్త పేరు బయట పెట్టాలంటే వారి అనుమతి పొంద వలసి వుంటుంది  , కనుక ఇప్పడు అది సాధ్య పడదు. అందుకే ఈ పరపతి సంఘం పేరు చెప్పలేదు. అన్యదా భావించ వలదు.
ఇప్పుడు  ఆ సంస్త కోట్ల  ట ర్నోవర్తో , 5౦౦౦ ల కు పయిగా సభ్యులకు వుపయోగాపడుతూ,
మధ్య మధ్య వేరు పురుగులు  చేరి ఇబ్బందులకు  గురయినా కూడా ,తట్టుకొని ఆరోగ్యాన్ని పుంజుకొని ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ లో మొదటి కొద్ది వాటిలో ఒకటిగా పేరు తెచ్చుకొని దిగ్విజయంగా సాగుతున్నందుకు ,నిర్వాహకుల నిజాయితీ కి సంకల్పానికి ,అంకిత భావానికి నా హృదయ పూర్వక జేజేలు. నాకు కావలిసింది అంతకంటే ఏమున్నది.
(సహకార వుద్యమం పై  ఆ కాలంలో వ్రాసి ప్రచురితమయిన నా వ్యాసం    ‘జీవితకాలం  తృప్తిగా జీవిద్దాం’.  తో  త్వరలో మీ ముందుకు.) రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.తేది:25-౦౪-2009
 
 

 

అంతు బట్టని విద్యుత్ అవసరాలు

(సాంప్రదాయేతర గత్యంతర ప్రత్యామ్న్యాయాలు.)

రచన : నూతక్కి రాఘ వేంద్ర రావు. తేది :24-04-2009

(హ్రుదయం బ్లాగరు వ్రాసిన అణువు వెలుగు వెనుక చీకట్లు…దానిపై శ్రీ మార్తాండ గారి స్పందన చూసి ప్రేరితుడనై… )

ఇంట్లోకి ఎలుక చేరిందని యింటికి నిప్పెట్టుకోము.కరెంటు ముట్టు  కొంటీ  షాకు కొడుతుందని తెలుసు,ఆ కరెంటే   ప్రాణానికి అజాగ్రత్తగా వుంటే  హాని  అని తెలిసి కూడా ఇళ్ళల్లో కరెంటు పెట్టు కుంటున్నాము.వాడుకొంటున్నాము. యీ రోజు అది లేకుండా రోజు గడవని  స్థితి. ప్రపంచీకరణ పుణ్యమ్మా అని ఆకర్షణీయమైన విద్యుథ్ పరికరాలు.ఇంట్లో ,దీపం ,ఫాను,ఇస్త్రీ పెట్టె,ఫ్రిజ్ ,గ్రైన్డర్లు  ,   బట్టల వుతికే మిషన్లు, సెల్ చార్జర్లు ,టి వి లు,ఎ.సి లు  యింకా ఎన్నో .  తింటానికి తిండి వున్నా లేకున్నా. మనిషి యీ రోజున విద్యుత్తుకు దాని ద్వారా సంక్రమించే సౌకర్యాలకు బానిస గా మారాడు.విద్యుత్తు లేని అధునాతన ప్రపంచం యీ రోజు వూహించలేము. విద్యుత్ ను కనిపెట్టిన తరువాత బాటరీ విద్యుత్తును వాడే వారు. అంటే బాటరీనీ కనిపెట్టారు.సాంప్రదాయ రీతుల్లో విద్యుత్ వుత్పత్తి,జల విద్యుత్తు కన్న ముందు, ఆయిలింజన్లను వాడే వారు. జల శక్తి వినియోగించి విద్యుదుత్పాదన ప్రారంభించిన తరువాత ప్రపంచ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఆధిక విద్యుత్తు అందుబాటులో కొచ్చి తద్వారా వచ్చిన పారిస్రామిక విప్లం తో వుత్పాదక రంగం పరుగులు నేర్చింది. యీ విప్లవం సాంకెతిక రంగాన్ని ప్రభావితం చేసి వివిధ రంగాల్లో విప్లవాత్మక ప్రయోగాలు జరిగి ప్రయాణ రంగంలో విప్లవాత్మక మార్పులకు పూల బాట వేసింది. విద్యుత్ రంగ పురోగమన ప్రభావం వ్యవసాయ రీతులనే మార్చి వేసి అధిక ఆహారోత్పాదనకు తన వంతు తోడ్పాటును అందించింది.

 ప్రాణాంతకమైన విద్యుత్తు

,అంటుకుంటే ప్రాణం తీసే విద్యుత్తు,

 అదిలేకుంటే  ప్రాణాలే వుండవనిపించే విద్యుత్తు,

అదిలేకుంటే తిండి, గుడ్డ ,గాలి ,నీరు

 దేనిని మన దరి చేరనీయని విద్యుత్తు,

అది వుత్పత్తి కావాలంటే ….వున్న మార్గాలు 

 1)రసాయన రీతుల్లో (బ్యాటరీలు) అవి చాలా చిన్న తరహా వుత్పత్తికి మాత్రమే దోహద పడతాయి .

యిక మిగతా ప్రక్రియలేవయినా జెనరేటర్ల ద్వారా విద్యుత్తు ను వుత్పత్తి చేయడమే. కాని జెనరేటరును తిప్పేందుకు ఒక యంత్రం కావాలి.ఆ యంత్రాన్ని తిప్పేందుకు శక్తి కావాలి. యిక్కడ మనం  విమర్శలయినా చేయ బోయే ముందు యీ శాస్త్ర సాంకేతికి పరిగ్నాన్ని ప్రాధమికంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా వుంది.

 1)ఆయిలు: యీ జెనరేటర్లను త్రిప్పేందుకో యంత్రం కావాలన్నానుకదా.. దీనికి తొలుతలో  ఆయిల్ యింజన్లు వాడే వారు.దాని వుత్పత్తికి విపరీత మయిన కర్చు అయ్యేది. అదీ కాక విపరీతమయిన కాలుష్యం. ప్రస్తుత ప్రపంచంలో ఆయిలు వాడి విద్యుత్తు వుత్పత్తి చేయాలి అంటే   యిక రవాణా సాధనాలకు నూనె దొరకదు.

2) బొగ్గు :భూమిలో లభించే యీ పదార్ధం యిప్పటి వరకు నాగరిక మానవ ప్రపంచానికి పారిశ్రామిక విప్లవానికి యితోధికంగా తోడ్పడింది కాని యింక దాని లభ్యత క్రమేణా తగ్గి పోతోంది.మునుముందు మనకు అందని నల్ల బంగారమే. దీన్ని ప్రస్తుతం ధర్మల్ విద్యుత్తు వుత్పత్తి ప్రక్రియలో వినియోగిస్తున్నారు.దీని నిర్మాణానికి అయ్యే వ్యయం, తరువాత నిర్వహణకు అయ్యే వ్యయం చాలా ఎక్కువ.చాలా స్తల సేకరణ కావాలి. నిర్వాసితులకు పరిహారం రూపేణా ఇబ్బడి ముబ్బడిగా ధనం వెచ్చించాలి. విపరీతంగా నీరు అందుబాటులో వుండాలి.అందుకొరకు నదీ ప్రవాహాల చెంత నిర్మించి ,ఆ నదుల పై డాములు కాట్టాలి.యీ వుత్పత్తిలో విపరీతమైన పర్యావరణ కాలుష్యం కలుగుతుంది.

3)  జల విద్యుత్తు : యీ ప్రక్రియ వుభయ తారకం . అటు విద్యుత్తు లభిస్తుంది,వ్యవసాయానికి నీరు అందుతుంది. నదులకు ఆనకట్తలు కట్టి ఎత్తయిన ప్రదేసాన్నుంది నాళికలద్వారా అత్యంత వేగంతో నీటిని తర్బైనులకు పంపి వాటిని వేగంగా తిప్పడం వల్ల జెనరేటార్  వేగంగా తిరిగి ,మనకు విద్యుత్తు లభిస్తుంది. యిక్కడ యీ ప్రక్రియలో

1)  ఖర్చు ఒకేసారి పెదు తున్నాము.

2) దీర్ఘ కాల ప్రయోజనం.

3) నిర్వహణ ఖర్చు తక్కువ.విద్యుదుత్పత్తి తరువాత ఆ నీటిని వ్యవసాయానికి మళ్ళించ వచ్చు .

 4) కాలుష్యం తక్కువ. యిక యీ ప్రోజెక్టుల నిర్మాణంలో మిగతా నీటి ప్రోజెక్టులకు ఎదురయ్యే సమస్యలే వీటికిన్నూ. జలాశయాల లో ఎన్నో గ్రామాలు ముంపునకు గురై ప్రజలను తరలించ వలసి వస్తుంది .వారికి వుపాధికల్పించాలి , నష్ట పరిహార్మ్ యివ్వాలి. ,యిత్యాది సమస్యలను ,సాంఘికంగాను, ఆర్ధికంగానూ ప్రభుత్వాలు ఎదుర్కో వల్సి రావచ్చు.అది యే నీటి ప్రోజెక్తుకయినా తప్పదు.వర్షాభావ పరిస్తుతులలో వుత్పత్తి పూర్తిగా పడి పోతుంది.

అటువంటి పరిస్తితులలో వీటిపై ఆధార పడలేము.మనం విద్య్త్తు లేకుండా వుండలేము. అందుకే ప్రభుత్వాల ప్రొత్సాహంతో శాస్త్రగ్నులు పరిశోధనా ఫలమే అణు  శాస్త్ర విజ్ఞానం .  భూ గర్భంలో వుండి, భూమి పైనజీవిస్తున్న జీవావర్ణానికి అనేక అనారొగ్య పరిస్తితులు కల్పించే కొన్ని పదార్ధాలను  వెలికి తీసి వాటిని అనేక రకాల మార్పులకు గురి చేసి ఇంధన కడ్డీలుగా మార్చి రియాక్టర్లలో అణు విద్యుత్ వుత్పత్తికి వాడుతారు. దీని ద్వారా కొన్ని వేల టన్నుల బొగ్గుకాల్చితే కలిగే ప్రయోజనం కొన్ని కిలోల అణు ఇంధన కడ్డీల ద్వారా పొందవచ్చు.యిందు వల్ల బొగ్గు రవాణకయ్యే అత్యధిక ఖర్చులు తగ్గుతాయి.బొగ్గు లేదని బాధ పడనవసరం లేదు. దీనికి అయ్యే ఖర్చు ఎక్కువే కాని దీర్ఘ కాలిక ప్రయోజనాలుండటం ,ఎక్కువ విద్యుత్తు లభించం వంటి పలు ప్రయోజనాలు వుండటం వల్ల యీ ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షిత మయ్యింది. యీ విధానానికై అణు యింధన లభ్యత చాలా ముఖ్యం.ఆ సమస్య పరిష్కరింప బడితే మిగతా వుత్పన్నమయ్యే సమస్యలు పరిష్కరించడానికి మనం కనిపెట్తే శాస్త్ర విఙానమే కాపాడుతుంది. యీ ప్రక్రియలో అక్కడి  ప్రజలకు పర్యావరణానికి హాని కారకమౌతున్న పదార్ధాలను వెలికి తీయడం వల్ల ఆయా ప్రాంతాలలో క్రమేపీ పర్యావరణానికి జీవావరణానికి హాని తగ్గుతుంది.

యిక పోతే మనం అసలు చర్చించడానికే సిద్ధ్ధ పడని మరికొన్ని ప్రత్యామ్నాయ విద్యుదుత్పాదక ప్రక్రియల గురించి మనం చర్చించుకో వలసిన అవసరం ఎంతయినా వుంది. మన భావి తరాలకు మనం అందరం కలసి క్రుషి చేస్తే కాలుష్య రహిత ప్రపంచాన్ని అందించ గలం.

1)అందులో అతి ముఖ్యమయినది (సోలార్ ఎనర్జీ) అనంతమయినది కాలుష్య రహిత మయినదీ ,సూర్య రస్మి యొక్క శక్తిని సద్వినియోగ పరచుకోవడం .విద్యుత్ రవాణా కొరకు వ్యవస్థ అవసరం లేదు.

2)సముద్ర అలల నుంచి (టైడల్ ఎనర్జీ ).దీనిని వినియోగదారుల ఆవరణలో ఏర్పాటు  చేయలెము. సముద్ర తీర జలాలవద్దనే యేర్పాటు చేయాలి. విద్యుథ్ రవాణా అవసరం కొంతలో కొంత తగ్గుతుంది.

3)విండ్ ఎనర్జీ :  గాలి వేగాన్ని వినియోగించుకొని ,గాలి మరల ద్వారా,విద్యుత్తును వుత్పత్తి చేసు కోవడం . దీనికీ విద్యుత్ రవాణా అవసరముంటుంది. కాబట్టి సూర్య కాంతి నుండి విద్యుదుత్పత్తి చేసుకోవాలనే దీక్షతో ముందుకు వెళితే ,

దానికి కావలిసిన సాంకేతిక పరిగ్నానాన్ని యుధ్ధ ప్రాతిపదికన ప్రపంచ వ్యాప్తంగా అభివ్రుధ్ధి పరచు కొంటె ,భూ ప్రపంచం  స్వర్గధామ మౌతుంది. నూనె కొరకు, యుధ్ధాలు వుండవు . ప్రపంచ మంతా శాంతి  విస్తరిస్తుంది. యీ ప్రక్రియలో విద్యుత్తును నిలువ వుంచేందుకు మరల రసాయినిక విద్యుదుత్పాదనా ప్రక్రియను కూడా వినియోగించుకోవలసి వస్తుంది .ఈ ప్రక్రియలో చాలా కొద్ది స్తలమే సరి పోతుంది ఎవరి అవసరాల కణుగుణంగా వారే వారి ఆవరణలలో యీ వుత్పాదక కేంద్రాలు స్తాపించుకో వచ్చు.సూర్య రశ్మి వున్నప్పుడు ఎక్కువ వుత్పత్తి చేసుకుని దాచుకొంటే  ,సూర్య రశ్మి లేనప్పుడు వినియోగించు కో వచ్చు. సర్వే జనా సుఖినో భవంతు:

 • About రావు utakki Raghavendra Rao
 •    వూతం
  రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
  తేది :22-04-2009
   
   
  ఆక్రన్దిత మానవాళి  కన్నుల్లో రక్త భాష్పం
  చారికలు ….
  తుడిచేందుకు కావాలోయ్
  ధృఢ పూరిత  సంకల్పం. 
  అనునయించు నైపుణ్యం   
  ఆదరించు  దయా గుణం 
  అంతకు మించిన అపురూప పరికరం 
  ఆయుధం
  సరళ  లలిత సమ్మిళిత   
  దివ్య భావ సంజనిత  

  ప్రేరణం ఆ  మాత్రు భాషకు 
  వందనం    
  కవిత్వం -నియమ నిబంధనలు  ( వుండాలా? ఒక సందేహం ).
  రచన:నుతక్కి రాఘవేంద్ర రావు.  తేది: 22-04-2009
   
  ఒక ప్రత్యెక సందర్భంలో ఒక సాహితీవేత్త సభనుద్దేశించి ఒక సందేహాన్ని వదిలారు.అదేమంటే  ఒక కవితా ప్రక్రియ ను వుటంకిస్తూ దానిని  కవిత్వంగా పరిగణించ గలమా అని .  . 
   
  అప్పుడు ఆ విషయమై  మాట్లాడేందుకు సిద్ధపడి లేనందు వల్ల, అవకాశం వినియోగించుకో లేదు. ఆ తరువాత నా భావానికి అక్షర రూపమిచ్చి  ..ఈ విధంగా మీ ముందుకు .
  ఆర్యా!
                        
  ఏ మానవ భాషలోనయినా  అక్షర సమాహారం పదమయితే, పదాల  సమాహారం వాక్యాలు.వాక్యాలు వ్యాఖ్యలుగా మారి ,వచనంగా, మారుతుంది.
  సందర్భానుసారంగా వాటికి  ,ఆహార్యాన్ని ఒనగూడిస్థే అది పద బంధితమై..మామూలు వచనమో… దానికి రిధం జొడిస్థే  అది  కవితో,పద కవితో,  వచన కవితో,ఛందో  బధమైతే  పద్యమొ,రాగబధమై, రాగయుక్త మైతే  గానమో యిలా పలు విధాల భాష ను వినియోగించ  వచ్చు.
   
  భాష వ్యక్త పరిచేందుకే అయినప్పుడు … పదచిత్రాలు మన కళ్ళకు  ఆ సన్నివేసాన్ని చూపిస్తున్నాయి  .అవి చదివినప్పుడు   అసంకల్పితంగా మనం భాషాపరంగా ఎంతటి  సామాన్యుల మైనా,ఆ  సన్నివేశంలొ మమైకమై పోతున్నాము.  
  కాని ఒకా భావ యుక్త కవితలో,లేక కఠిన పదభరిత సమాసయుక్త 
  వచనమో,  సామాన్యుని ఆ స్థితికి చేర్చదు.ద్రుశ్యాన్ని  చూపి అన్వయించుకోమన్నా ,అన్వయించుకొని అనుభవించమన్నా,రవి  గానని చొ.. కవిగాంచు …నన్నటుల  కవి తాను చూసింది, తాను చెప్పాలనుకొన్నది,తన ధ్రుక్కొణంలో నుంచి   తన కున్న భాషా సామర్ధ్యంతొ జన బాహుల్యంలో యే వర్గానికి చెప్పాలనుకొన్నాడో  ఆ యా సామాజిక వర్గాలకు అర్ధమయ్యే రీతిలో చెబుతాడు.

  కాలానుగుణంగా ఆదరణానుసారం కవిత్వాలు అనేక రూపు రేఖలు దిద్దుకుంటూ,కొంగ్రొత్త సౌందర్యాలద్దుకొంటున్న  యీ తరుణంలో మీ యీ ప్రశ్న :
   
  కేవలం పద చిత్రాలు కవిత్వం అవుతుందా? అని కదా..

  ..నాదొక  ప్రశ్న …..అసలు కవిత్వానికి నిర్వచనం యేమైనా వుందా? వుంటే  నియమ నిబంధనలు, కొల బద్దలు యేవయినా వున్నాయా?వున్నాయి పో ,వాటికి క్రొంగొత్త పోకడలు   శ్రుష్టించకనే    కవితా వ్యవసాయం సాగుతోందా? కవిత్వం అభివృద్ధి చెన్దుతొన్దా?

  యేది యేమైనా పద చిత్రాలు, అవే కాక నూతన రీతులు ఏవయినా  కవిత్వంలొ మనమందరం స్వాగతించ దగ్గ  సముచిత ప్రక్రియలు , వాటిని మనమందరం స్వాగతిద్దాం.సరళభాషాపద  ,సాహిత్యాన్ని ఆహ్వానిద్దాం,నూతనత్వాన్ని, నవీన పొకడలను స్వీకరిద్దాం.మాత్రు  భాషను పటిష్టం చేస్తూ ప్రస్తుతమున్న చాందస భావ శ్రుంఖలాలను త్రుంచేద్దాం.ఏన్నెన్నొ తరాలుగా భాషను చాందస భావాల నుండి  రక్షించు కొంటూ సుసంపన్నం చేసుకొంటూ వస్తున్నాము.మరల మరల ఛాందసం   తొంగి చూస్తూనే వుంది.
  నన్ను క్షమించాలి     ….ఎవరినీ  వుద్దేసించి కాదు నాయీ వ్యక్తీకరణ. ఈ సందర్భంగా మనందరం ఒక యుగళ గీతం పాడుదాం.

  యుగళగీతం
  ————–
  మన కవి సమ్మేళనా
   యుగళ గీతం
  సరళ భాషా పద
  యుక్త భవ్య  సమ్మిళితం
  సుసంపన్న భావ భూషితం
  స్వభాషాభిమాన పూరితం
  కవి పండిత  మేధో  కొవిదం

  కావాలని ఆసిస్తూ  ఆకాంక్షిస్తూ

  తెలుగు భాషా శ్రేయోభిలాషులు ,  మన యీ సభ  లొని వారందరికి అభినందనలు క్రుతగ్నతలు .ఈ సందర్భంగా నాదో   చిన్న విన్నపం.   గుంపు పదానికి ప్రత్యామ్న్యాయ పదాన్ని వెదకమని విన్నవిస్తూ   ……..మీ  అందరి వాడు ….నూతక్కి రాఘవేంద్ర రావు.

                                  మాత్రు భాషా ప్రాముఖ్యం
                             రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
                                    Date:22-04-2009
   
   
  జాతి జీవన చరితకు ,సంస్క్రుతి,సాంప్రదాయాలు… రెండు నిట్టాళ్ళ లాటివి ,…సాంఘిక కట్టు  బాట్లు–సామాజిక భద్రత, సు పరిపాలన ,  నీతి  నియమాలు-న్యాయ  వ్యవస్థ , నాలుగు మూల స్తభాలుగా ,సగర్వంగా   నిలబడి  పటిష్ఠ   జాతి నిర్మాణం  లో  తమ వంతు పాత్రను సగర్వంగా తెలియ చెబుతుంటాయి .
   
    జీవితంలొ జీవించడానికై  కూడు,గూడు,గుడ్డ,నీరు,నిప్పు,తిండి,తిప్పలు (తిప్పలు అంటే  పని,నిత్య జీవనానికి కావలిసిన  , నిత్యావసర వస్తువులు సమకూర్చుకోవడానికి చేయవలసిన పని )   చాలా ముఖ్యమైనవి,  భాష,ఆహారపు అలవాట్లు ,జల వనరులు , పనిముట్లు, వాడే  విధానం ,ఆహార సంపాదన,ప్రయాణ సాధనాలు,రక్షణ  ,రక్షణ  పరికరాలు,వినియొగించే విధానాలు  ,దుస్తులు,గ్రుహ నిర్మాణ పద్ధతులు,పక్రుతి శక్తులపై  నమ్మకాలు పూజలు దైవ భక్తి,వీటన్నింటిని  ఆచరించేందుకు,  అనుసరించేందుకు  , హారం లా గుచ్చి వుంచ  గల సూత్రం ,ఒక్క భాష మాత్రమే.
   
   ఒకరి కొకరు అభిప్రాయాలను వ్యక్త పరచుకొనేందుకు  సంకేతాలు ,సంకేతాలనుండి  చేతి  సఙ్గ్నలు,శబ్ద సంకేతాలు,ఆ శబ్ద సంకేతాలనుండి   అక్షరాలు,ఆయా ప్రాంతీయ భాషా  పదాలు,సంభాషణ,అక్కడితోఆగకుండా, లిపి  ,వ్రాత,  రచన, సాహిత్యం,….విద్య , విఙ్ఞానం,ప్రపంచ వీక్షణం ,విశ్వ  భావనం,  ఆ విధంగా ,ఒక జాతి సంస్క్రుతి, సంప్రదాయాలపై భాష  మహత్తర ప్రభావం చూపిస్తుంది ప్రముఖ పాత్ర   పోషిస్థుంది.లిపి ,దారు శాసనాలు,శిలా  శాసనాలు ,తద్వారా,శిల్ప  కళా ,దారు శిల్ప  కళ,చిత్రాల ద్వారా, వ్యక్తీకరణ, తద్వారా  చిత్ర కళ , గుహా నిర్మాణాలు,కుడ్య   చిత్ర కళా  నిర్మాణాలు ,శిల్ప  కళా  వైభవాలు.ఇవి అన్ని మనం యీ రోజున ఇంత వివరంగా తెలుసుకో గలుగుతున్నామంటే  ఆ రోజున అప్పతి పాలకులు అప్పతి జనజీవన విధానాన్ని ,పాలనా విధానాలను,కలా వైభవాన్ని,కవులు రచయితలు రచించిన గ్రంధాల ద్వారా,సిల్ప కళ ద్వారా, ఛిత్ర కళ ద్వారా, భావి తరాలకు అందించే  ప్రక్రియలొ అప్పటి  భాషా పరిగ్నానాన్ని,, వివిధ కళా ప్రక్రియల్లొ వారి సామర్ధ్యాన్ని,   వివిధ కళా రూపాలను  భావి తరాలకు అందంచి,ఆ సంపూర్ణ  వ్యక్తీకరణలొ భాష ప్రాముఖ్యాన్ని చెప్పకనే తెలియజెప్పారు.
  ,
  కాని అప్పటి ఆ భాష ,రాజ ప్రసాదాలకో ,కవి పండిత గోష్టులకో,గ్రంధాలకో పరిమితమై, ఏ కొందరికో పరిమితం చేసే ప్రక్రియ కొనసాగి , సామాన్య,పామర జనుల స్థాయికి అందక పో వడం వల్ల  గ్రాంధిక భాషా సువాసనలు  పామరులకు  చేరక భాష వుశ్చారణ ఆయా ప్రాంత జనుల శబ్దోశ్చారణ  ననుసరించి  ప్రాంతీయంగా , భాష  స్తిరీకరించబడి ఆయా భాషల్లో మాండలికాలు వుత్పన్న మయ్యాయి. 
   
  భాష అన్నది తరతరాలు బ్రతికి వుండాలంటే అది వాడుకలో వుంటూ ,అన్ని వ్యవహారాలలోనూ వ్యవహరించబడాలి.దానికి పాలకులు  కృత నిశ్చయంతో. కృషి చేయాలి.అందుకే భాష సరళంగా ,వినియోగిచేందుకు అనుకూలంగా వుండాలి .వినటానికి వీనుల విందుగా వున్నా కొన్ని సందర్భాలలో తక్క సమాసయుక్త పదజాలం,చందోబధ రీతులు,గ్రాన్దిక భాషా వైచిత్రి , జనసామాన్యానికి దైనిక జీవన ప్రక్రియలో అంత అనుకూలంగా వుండవు.
   
  సరళ భాషా రీతుల్లోనే  ఆయా భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా వుద్యమాలు  జరిగాయి.అనేక విప్లవాలకు సరళ భాషా రీతులే కారణమయ్యాయి. కాని కఠిన పద మిళిత భావ సమాసాల వల్ల  విప్లవాలు రాలేదు.సరళ భాషా గీతాలతోనే ,వుపన్యాసలతోనే ఆయా జాతి ప్రజలను జాగ్రుతపరచ గలిగారు ,ఆయా జాతీయోద్యమ కారులు.
  కఠిన సమాసయుక్త భాషా చమక్కులు, ఛందో  బద్ధ ప్రయోగాలు  ఏవీ విప్లవోద్యమాలకు గాని,జాతీయోద్యమాలకు గాని వుపయోగ బడలేదు.
  పద్యం , నిజానికి  తెలుగు పద్య మాద్యమం మహోత్కృష్ట భాషా చమత్కృతి. ప్రపంచంలో మరే భాషకూ ఇంతటి గొప్ప భాషా ప్రక్రియ  
  లేదని సగర్వంగా చెప్పుకోవచ్చు .కాని దానిని సరయిన రీతిలో గౌరవించు కొనేందుకు సందర్భాలను మనం సృష్టించు కోవాలి గాని 
  సరళ భాషా రీతులను జానపదుల భాషా సంస్కృతిని ,ఆయా  మాండలికాలను మనము గౌరవిస్తూ,ప్రతి నిత్యము పరిపాలనలో వినియోగిస్తూ ,పాఠశాలలో వుపయోగిస్తూ,అభివ్రుది పరుస్తూ పోతేనే మాత్రు భాష బ్రతుకుతుంది.     
   
  భాష తరతరాలు బ్రతికి వుండాలంటే ,భాషను సరళతరం చేయండి.మాత్రు భాషను విద్యారంగంలో నిర్బంధంగా ప్రయోగించండి.ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ భాషను అన్ని విధాలా వుపయోగించండి.అన్ని వార్తా మాధ్యమాలలో సరళమైన భాషనే వినియోగించండి.ఆయా మాండలికాలకు అత్యంత గౌరవాన్ని అందించండి.జానపద రీతులను సగౌరవంగా స్వాగతించండి.
  విదేశి భాష ధారాళంగా మాట్లాడితేనే ,వాడు గొప్ప వాడు, వాడే వుద్యోగాలకు అర్హుడు అన్న భావాన్ని ముందు ప్రభుత్వ విదానాలనుండి అధికారుల మస్తిష్కాల నుంచి కడిగి వేయండి.
  ప్రభుత్వ విధానాలు,కార్యక్రమాలు మాత్రు భాషలోనే నిర్వహించండి.మాత్రు భాష ధారాళంగా  మాట్లాడటం వ్రాయడం  అయ్యెయస్ అధికారులకయినా సరే  ఒక గొప్ప అర్హతగా నిర్ణయించండి.అదేవిధంగా ప్రయివేటు రంగం కూడా పాటించేలా నిర్బంధాన్ని విధించండి.అప్పుడే ప్రయివేటు రంగం కూడా అటువైపు దృష్టి సారిస్తుంది. మాతృభాష చదువుకున్నవారికి ఆయా రంగాల్లో వుద్యోగాలు దొరుకుతున్నప్పుడు ,విదేశీ భాషల్లోనే నిష్ణాతులవ్వాలని ఎవ్వరూ కోరుకోరు.
  అట్లాగని విదేశి భాషలు నేర్చుకొనే వారికి ఆ సదుపాయం వవ్నరులు కల్పించడం ప్రభుత్వ విధి.
  ఆశిద్దాం ప్రజల ఆలోచనలలో ,ప్రభుత్వ విధానాలలో మార్పు వస్తుందని ఆశిద్దాం. వివిధ ప్రసార మాధ్యమాలు ఈ విప్లవానికి తమ వంతూ చేయూత నందిన్చగాల్దని భావిద్దాం. ఎందుకంటే మనిషి ఆశా జీవి అందుకే అన్ని రంగాల్లో ఇంత ప్రగతి.అది మాత్రు భాష పై ఎందుకు కాగూడదు
  నిరంతరం :వచన కవిత

   కట్టుబాటు దాటితె !

  బంధనాలు తెంచుకుంటె!

  మెడలొ పలుపు తాడు

  అమ్మొ ఆ నగ్నత్వం

  ఎవరైనా చూస్తె చలిస్తె !

  అందుకేగ తగిలించాం

   ద్వై లొహపు కవచాలు

   గమనాగమన సంకేతాలు

  పారిపొతుందని భయం !

  తగిలించాం కాళ్ళకు గజ్జెలు

   వినబడవా కదలికలు

   భయపడబోకోయ్

  తగిలించెయ్ కాళ్ళకున్న

   కడియాలకు సంకెళ్ళను

   తెలివి మీరి పొతేనొ !

  గాటికి కట్టెసెయ్

  ప్రపంచాన్ని చూడనీకు

  అది ఆ రొజున …

  పసువైనా పడతి అయినా

   ఇక్కడ అక్కడ కాదు

  భూమి పైన కొన కొన లొ

  అహారపు అవసరాన

   కామవంఛ సాంత్వనలొ

   కొపం తాపం తట్టుకొనె

  పరికరం

  అహంకార ధన యఙ్నపు

   ధాతువుగా దహింప బడుతు

   దారుణంగ ధారుణిలో

  అధునాతన విఙ్నానపు

   అవనికకు ఈవైపున ఆవైపున

  రచన : నూతక్కి రాఘవెంద్ర రావు. తెది:26-02-2009

  « గత పేజీతర్వాత పేజీ »