మే 2009
Monthly Archive
మే 31, 2009
Posted by Gijigaadu under
expressions
2 వ్యాఖ్యలు
నేను
( అతి సామాన్యుణ్ణి )
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
తేది:01-06-2009
నేను కవిని కాను
నా మదిలో మెదిలే
భావాలను
మీ పై కుప్పించి
వూహలలో వూయల
లూ పేందుకు
నేను గాయకుడినీ కాదు
గాన లహరిలో మిమ్ముల
ఓల లాడించేందుకు
కానీ
నాలో కలిగిన భావోద్వేగం
సమరసమయ భావావేశం
కమిలి కుమిలి
కనలి కనలి
నా హృది చేసిన
ఆక్రందనం
అంతరంగంలో
నిక్షిప్తం చేసి
చిరునగవుతో
నిరంతరం
అనంత యానంలో
జీవన పయనంలో
మే 27, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
నిత్యం నా చుట్టూ -8
( ఓ చిన్ని జూ)
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :26-05-2009
తడి మట్టిని తొలుస్తూ వాన పాము
మురుగులోన మండూకం
చండాలంలో పందులు
వీధుల్లో శునకాల
స్థైర్య విహారం
ఎన్నెన్నో సహజీవులు
యింకా యింకా
ఏమని వ్రాయను యిప్పుడు?
హతోస్మి !
గొంగడి పురుగును మరచితినే
మే 27, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
నిత్యం నా చుట్టూ -7
(ఓ చిన్ని జూ)
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :26-05-2009
నక్కి నక్కి దాక్కుంటూ బల్లి
మిన్నాగును వెతుక్కొంటూ ముంగిస
సరీసృపాల వారసులా తొండలు
మెలికల పాములు .
నాన్న స్వారీ చేసే అరేబియా
నలుపు తెలుపు రంగుల గుర్రం
రాళ్ళ క్రింద తేళ్ళూ జెర్రులు
మే 27, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
నిత్యం నా చుట్టూ -6
(ఓ చిన్ని జూ)
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :26-05-2009
కోడి పిల్లలల్ని ఎగదన్నుకు
పోదామని
ఆకసాన నిఘావేసి
ఎగురుతూ తిరుగాడుతూ
గరుడ పక్షి
ఎక్కడో ఏదో ఆవో దూడో
చచ్చి పడుందని
ఆచూకీనందిస్తూ
ఆకసాన రాబందులు
గున గున గంతులతో
కుందేలు జంట
గుర్రున చూస్తూ
కుక్కపిల్ల
అంతా గమనిస్తూ
అటకమీద పిల్లి కూన
మే 27, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
నిత్యం నా చుట్టూ -5
( ఓ చిన్ని జూ)
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :26-05-2009
కలుగులు త్రవ్వుతూ
పందికొక్కు
చెంగు చెంగున
గెంతులేస్తూ లేగ దూడ ,
గేదలు దున్నలు
ఆవులు ,ఎడ్లు ,కోడెలు
గిత్తలు ,పెయ్యలు
కొబ్బరి చెట్ల పైన
కొంగల సయ్యాటలు
కొక్కోరోమని కోడిపుంజు
పిల్లలతో గంపక్రింద
కోడిపెట్ట
మే 26, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
నిత్యం నా చుట్టూ-4
( ఓ చిన్ని జూ)
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :26-05-2009
చిట్టి చిట్టి చేతులతో
వేప పండు తింటూ వుడుత
కలుగులోని ఎలుక పిల్ల
దాని వెంటే త్రాచుపాము
రాత్రయితే కీచురాళ్ళు
రాళ్ళ క్రింద తేళ్ళూ
అక్కడే పెరిగే జెర్రులు
రజకులు పెంచుకొంటూ
తోలుకు వచ్చే గాడిదలూ
కంచర గాడిదలూ
మే 26, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
నిత్యం నా చుట్టూ -3
( ఓ చిన్ని జూ)
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :26-05-2009
వింత వింత శబ్దాలతో
ఇంటిపైన గూటిలోని పావురాళ్ళు
కావు కావు మంటూ కాకులు
రంగుల రెక్కలతో తోకలతో
సంజీవనినందితెచ్చు
జేవుడు కాకులు
భావిలోని తాబేలు, చేప పిల్ల
అందులోనే నీటికొయ్య
చెట్టుపైన పక్షిగూటి
గుడ్ల దొంగ పసిరిక పాము ,
మే 26, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
నిత్యం నా చుట్టూ -2
( ఓ చిన్ని జూ)
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :26-05-2009
కిచ కిచ లాడుతూ పిచుకలు
కువ కువ లాడే గువ్వలు.
చిత్ర విచిత్ర వర్ణాలతో
వనమంతా విహరిస్తూ
సీతాకోక చిలుకలు
దోర జామ పండు
రుచి చూస్తూ రాచిలుకలు
చిలుకల కదలికలు చూస్తూ
తన్మయతన గోరువంక
మే 26, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
నిత్యం నా చుట్టూ -1
( ఓ చిన్ని జూ)
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :26-05-2009
నిత్యం నా చుట్టూ సంచరిస్తూ
ఎన్నో ఎన్నెన్నో సహజీవులు
నల్ల చీమ ఎర్రచీమ రెక్క చీమ
చినుకు చీమ గండుచీమ
కరెంటు చీమ చలిచీమలు
చదపురుగులు
చెరువు నీళ్ళ వెంటవచ్చు జలగలు
మిడతలు బొద్దింకలు దోమలు
మే 23, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
నేనెలా చెప్పుకోను
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది : 23-05-2009
నేనెలా చెప్పుకోను
ఈ కవితను నేనే రచియించానని
ఈ భావం ఈ భాష ఈ పదాలు
అక్షరాలు వ్రాసే క్రమ విధాన భంగిమలూ
కనిపెట్టింది నేను కాదె
అక్షరం నేను కనిపెట్టింది కాదె
నేను పుట్టినప్పటికే వుందికదా
ఆ అక్షరాలు గుది గుచ్చిన పదాలు
పదబంధ మాలికలా వాక్యాలూ
నేను సృష్టించినవి కావే
నేను పుట్టేసరికే జనుల పెదవుల
నాట్యం చేస్తున్నావే కదా
భావాలు మనోజనిత వుత్ప్రేరితాలు
అన్నీ అప్పటికే బహిరంగ
వ్యక్తీకరణ లే
మరి నాకుగా నేను ఈ భాషలో
భావంలో భాష్యంలో
సృజియిన్చిన్దేముందని
వారూ వీరూ వేడి వేడిగా వాడుకొని
వాడి వాడి వదిలేసిన
వడి తగ్గిన
పదాలు యిటూ అటూ
కూరుస్తూ ఏదో గిలికి
పలుమారులు మారుస్తూ
భావాలను పలికిస్తున్నానని
మది లోలోతుల కులికి
నా మదిలో తిరుగాడే
వ్యధలను వెలిగ్రక్కాననుకొని
నా భుజం నేనే తట్టుకొని
సహభాష్ అనుకొని ….
అయినా ….
నేనెలా చెప్పుకోను …….
తర్వాత పేజీ »