జ్ఞాపకాల దొంతరలు–

 శ్రీ సంజీవదేవ్ -పేజి ౩

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు తేది :03–04–2009

సంజీవ్ దేవ్ గారిని గురించి మాట్లాడేటప్పుడు నేను మరచి పోగూడని వ్యక్తీ ..నా బాల్య మిత్రుడు ,సహాధ్యాయి,సాహితీ పిపాసి. తెనాలి లో నా క్లాసు మేటు ,రూం మేటు,అయిన వెనిగళ్ళ వెంకట రత్నం . అనుకోని విధంగా హైదరాబాద్ లో ఎన్నో సంవత్సరాల తరువాత1973 లో తిరిగి కలవడం జరిగింది.అతనికి 1964 లో సంజీవదేవ్ గారితో తుమ్మపూడిలో అతనికి పరిచయం చేసింది నేనే ,. ఆ తరువాత నేనేమో పొట్ట పట్టుకొని దేశం మీద పడ్డాను. అయినా సంజీవ దేవ్ గారితో లేఖలద్వారా టచ్ లోనే వుండేవాడిని. కానీ వెంకట రత్నం మాత్రం సంజీవదేవ్ గారితోసాన్నిహిత్యం పెంచుకొని వుద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చినా వారి కార్యక్రమాలు హైదరాబాద్ లో నిర్వహించే ప్రక్రియలో ప్రముఖ పాత్ర పోషించే వాడు..వెంకట రత్నం అనేక సామాజికామ్సాలపైన తన దంటూ ఓ ప్రత్యెక శైలిలో వ్యాసాలూ కధలూ వ్రాస్తూ సాంస్కృతిక రంగానికి చాలా చేరువలో వుండేవాడు. అంతటితో ఆగక వివిధ రంగాలలో వుద్దండ పండితులు, సాహితీ ప్రఖందులు అయిన ప్రముఖులతో ఎన్నెన్నో సాహితీ సమావేశాలు ప్రతి నెలా ,నెల నెల సమావేశం పేరిట ఏర్పాటు చేస్తూ నన్నూ ఆ సమావేశాలకు సభ్యునిగా మార్చాడు. ప్రముఖ చిత్రకారులను, పత్రికాధీపతులను న్యాయ కోవిదులను, సాహితీవేత్తలను సామాజిక చింతనులను ,ఆయా రంగాలలో ఔస్తాహికులను ఒకే వేదికపై సమావేసపరచి వివిధ అంశాలపై చర్చలు కొనసాగించేలా చూసేవాడు. (ఈ విషయాలు మరో పుటలో జ్ఞాపకాల దొంతరలో చూడ్డ్రు గాని). ఒక రోజు చిక్కడపల్లిలో నేను అద్దెకుంటున్న యింటి అడ్రెస్ కు కార్డువ్రాసాడు. కళా భవన్ లో సంజీవ్ దేవ్ గారి చిత్ర ప్రదర్సన ,కవితా పఠనం ,తప్పక రావాలి అని..1973 వ సంవస్తరం ,ఎవరి యింట్లోనూ ఫోనులు ఉండేవి కాదు హైదరాబాద్ మొత్తం మీద రెండు వేల ఫోనులున్దేవేమో , బస్సుల్లో వెళ్లి అయినా సమాచారం అందించాలి ,లేకుంటే కార్డు ముక్క పోస్టులో అయినా వేయాలి. ) వెళ్లాను. చాలా సంవస్తరాల తరువాత వారిని చూడటం … చాల వుద్విగ్నత కు లోనయ్యాను.వారి చిత్రాల ప్రదర్సన కళా భవన్ మినీ హాల్లో జరిగింది .ఆయన కవితలు కూడా చదివి విని పించారు. ఆ తరువాత నా విషయాలు అడిగి తెలుసుకున్నారు. చిత్రలేఖనం లో అంతగా అభివృద్ధిని సాధించ లేక పోయానని నేను చెప్పినప్పుడు, జీవితంలో జీవించడం నేర్చుకుంటే చాలు ,దాన్ని కళాత్మకంగా మలచుకుంటే చాలు .కళాకారుడి గా మారక పోయినా, అందులో నైపుణ్యం పొందలేక పోయినా ఫరవాలేదు. మీరు జీవితాన్ని నైపుణ్యంగా నడుపుకున్తున్నారనే భావిస్తాను అని చెప్పారు. సమావేశానంతరం లాల్ బహద్దూర్ స్టేడియం లోని ఆయన బసకు వెళ్లి కాసేపు పిచ్చా పాటి మాట్లాడుకొని ,ఆయనను విశ్రాంతి తీసుకోమని మేము వెళ్ళిపోయాము . అదే ఆయనను చివరి సారి చూసింది కలిసిందీనూ. ఇందుకు వెంకట రత్నానికి నేనెంతో రునపడివుంటాను. ఆ తరువాత సంజీవదేవ్ గారిని చూసే అవకాసం కాని ,లేఖల ద్వారా సంప్రదించే అవకాసం మాత్రం రాలేదు. ఆయన నాకు వ్రాసిన, పంపిన కొన్ని చిత్రాలు, కవితలు భద్రంగా అనలేను కాని , నావద్ద వున్నాయి. ఆయన మరణ వార్తకూడా నాదాకా రాలేదు.,౦౯-౦౯-౯౯ వ తేదీ నాడు ప్రెస్ క్లుబ్ ఆడిటోరియం లో సంసరణ సభకు రావలిసిందిగా రత్నం నుంచి కార్డు వచ్చే వరకు. (సంసరణ సభా విశేషాలు మరో వ్యాసంలో త్వరలో )

ప్రకటనలు