జ్ఞాపకాల దొంతరలు
సంజీవ దేవ్ -4
 (సంస్మరణ సభ )
రచన :నూతక్కి రాఘవేంద్ర  రావు 
తేది :03-05-2009  
 
సంజీవ దేవ్  ఫోటోతో సంజీవదేవ్ సంస్మరణ పత్రం  విడుదలయ్యింది .అందులో ఈ క్రింద యిచ్చిన వివరాలతో పాటు శ్రీ సంజీవదేవ్ గారి జీవన వివరణ వున్నాయి.
హైదరాబాద్ ,ప్రెస్ క్లబ్ ఆడిటోరియం ,బషీర్ భాగ్ లో 09-09-99సాయంత్రం 05-30 గం.లకు , యువకళావాహిని అధ్యక్షులు శ్రీ వై.కే. నాగేశ్వర రావు ,మరియు,రసరేఖ కన్వీనర్ శ్రీ వెనిగళ్ళ వెంకట రత్నం గారి నిర్వహణలో ,డాక్టర్ సి .నారాయణ రెడ్డి గారి నేతృత్వంలో, శ్రీ పోత్తూర్రి వెంకటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో అందరూ వక్తలే ,అందరూ శ్రోతలే.
సర్వశ్రీ
ఆవుల సాంబశివరావు గారు,  
డాక్టర్ ఎన్.గోపి 
డాక్టర్ ఎ.బి.కే .ప్రసాద్ 
డాక్టర్ చేకూరి రామా రావు 
డాక్టర్ వెలిచాల కొండల రావు 
శ్రీ కొండపల్లి శేషగిరి రావు
శ్రీ దండమూడి మహీధర్ 
శ్రీమతి సి.వేదవతి 
డాక్టర్ రాధాకృష్ణ శర్మ
శ్రీ రావేల సోమయ్య 
శ్రీ శ్రీ రమణ   
ఇంకా ఎన్దరో మిత్రులు,అభిమానులూ,  సంజీవదేవ్ ను స్మరిచుకోనేందుకు సమావేసమౌతున్నాం .అనుబంధం వున్నవారంతా వక్తలే .అందరూ రండి. జ్ఞాపకాలను కల బోసుకుందాం, ఆత్మీయ మిత్రున్ని గుర్తు చేసుకుందాం  .ఇదీ ఆ పత్రం లోని వివరాలు.
ఆ సమావేశానికి నేను వెళ్ల లేక పోయాను. ఆ సమావేశం సంస్కారపూరితంగా ,భావోద్వేగంగా    జరిగింది అని తెలిసి సంతోషించాను. నేను వెళ్ళలేకపోయినందుకు చాలా విచారించాను. అనుకున్నది చేయలేనప్పుడు తరువాత తీరిగ్గా కూర్చుని విచారిస్తే  మాత్రం  వుపయోగం ఏముంటుంది. విచారమే తప్ప.   (దేనితొ సంజీవదేవ్ గారి జ్ఞాపకాల పుట లు ప్రక్కన పెట్టి , మరో జ్ఞాపకాల పుటలకు .)
ప్రకటనలు