కదనానికి కదం త్రొక్కు
రచన:నూతక్కి రాఘ వేంద్ర రావు
తేది :10-05-2009
 
కదలు  కదలు  కదలరా 
కదన భూమి కరుగారా 
భరత దేశ నవయవ్వన  
వీర ధీర పౌరుడా
బద్ధకమ్ము వీడరా                  -కదలు-
 
స్వాతంత్ర్యం సమకూర్చిన
సౌకర్యాలేన్నెన్నో
సామాన్యుని కందించగా 
సాహసమ్ము చేయరా                -కదలు-
వర్తమాన భారతిలో
అడుగడుగునా యుద్ధమెర
నల్ల ధనం నల్ల బజార్
నరహంతక మూకలు నిండిన
రాజకీయ నది వీధులు
రక్తంతో నిడు తుంటే               -కదలు-
నిస్సత్తువతో నిస్పృహతో
న్ర్లిప్తతతో నిర్వీర్యుడవై  
 చూస్తూ కూర్చోకురా             -కదలు-
పర పాలన నుండి మనల
తమ
ప్రాణాలే ఫణం పెట్టి
స్వేశ్చా వాయువు పీల్చే
హక్కులు మనకిచ్చినట్టి  
మహామహుల కోర్కె దీర్చ
పౌరుల హక్కుల సాధనకై
కదనానికి కదం త్రొక్కు        -కదలు-
 
ప్రకటనలు