నీగ్గిట్టేరెకేనా

                       (నీవమ్ముడు పోతివని ) 
                రచన: నూతక్కి రాఘవేంద్ర రావు
                       తేది :11-05-2009
 
          కూరలమ్మి కూడా నిన్ను క్రూరంగా అమ్మేస్తాది  
      పనిమనుషులు కూడా నిన్ను లాభానికి అమ్ముతరు  
       కేబులోడు నిన్నమ్ముతాడు కూరలోడూ అమ్మెస్తదు  
           పేపరేసేతోడు కూడా పక్కాగా అమ్మేస్తాడు
          పాలుపోసేతోడేమోచెప్పి మరీ అమ్ముతడు  
          చెత్త కొంచకేల్లెతోడు  హీనంగా అమ్మేస్తాడు ,
          కేబులోడు నీల్లోడు అందరు నిన్నమ్మెతోల్లె
         దొంగోల్లకు  అమ్ముతారు గుత్తగానే పోలీసులు 
          దొంగోల్లు దొంగోల్లకు గుట్టుగానే రాసిసిస్తారు
        నేవనుకున్తవు  బాబూ  పైసలతో సరివీసులు
   కొనుక్కుంట వున్నాని నీ విచ్చే పైసలకా సరివీసులని
      నీకేన్నడు ఎరికైతది  నీవమ్ముడు పోయే సరుకని  
      గిప్పుడైన ఎరకబట్టు జరా కనులు తెరిసి నడుసుకో
 
ప్రకటనలు