చిట్టీ !
 
 ఇక్కడ  మేమంతా క్షేమం.వూరు కాని వూరులో, ప్రాంతం కాని ప్రాంతంలో ,మాకందరికీ దూరంగానీవెన్ని   బాధలు పడుతున్నావో గాని నిన్ను పంపి మేం బాగానే వున్నాం .
 
నాన్నా ,ఆరోగ్యం బాగుందా ?నీ భోజన వసతి ఎట్లా వుంది?నీ చదువు విషయంలో నీ శ్రద్ధ ఎట్లా వుంది ?సబ్జెక్టులు అన్నీ అర్ధమౌతున్నాయా ?  నీ క్లాసు లో నీ తోటి విద్యార్ధులందరూ నీతో సన్నిహితంగా వుంటున్నారా ?
వాళ్ళందరితో నీవు సహకారంతో మేసలుకుంటున్నావా  ? సబ్జెక్టుల్లో తెలియని విష యాల గురిచి ఏమి చేస్తున్నావు? నీ ఆరోగ్యం గురించి ,నీ చదువు గురించి మరీ మరీ నీకు చెప్పనక్కర లేదనుకుంటున్నాను .
నీవు చాల భాద్యతతో నె వున్నావని ,ఆలోచిస్తావని  నాకు తెలుసు .తమ భాద్యత తనకు తెలిసిన వారికి ఆ విషయంలో వేరే వేరెవ్వరూ చెప్పనవసరం లేదు.
 
కాని కన్నా మరీ మరీ గుర్తుంచుకోఎవలసిన విషయం ఏమంటే ,మనం యింటి నుండి అమ్మకు నాన్నకు చెల్లెకి, తమ్ముడికి ,బంధువులకు దూరంగా వెళ్ళింది ఎందుకు ?అందులో మన కర్తవ్యమ్ ఏమిటి ?ఏమి చేయాలి అని
ఆలోచిస్తే ,వెళ్ళింది మనం అనుకున్న కోర్స్ ,నిర్ణీత వ్యవధిలో చదివి పూర్తీ చేసుకోవాలనే భాద్యతతో మన తెలివి తేటలను ,పట్టుదలను ,శ్రద్ధగా వినియోగించి ఓ ప్రజ్ఞ గల పౌరునిగా ఇక్కడకు తిరిగి రావడానికి , తద్వారా దేశ పునర్నిర్మాణంలో నీ వంతుగా వుదతా భక్తిగా కృషి చేయడానికి ,
అలాంటప్పుడు నీ మానసిక కేంద్రీకరణ మొత్తం ఆ కార్యక్రమం మీదే కేంద్రీక రించుతూ పోవలసిన అవసరం  ఎంతయినా వున్నది అన్న విషయం మనం సతతం గుర్తుంచుకోవాలి. ఈ కృషిలో ఎంత కష్టాన్నయినా వోర్చుకోవలసిన అవసరం ఎంతయినా వుంది.
 
అట్లాగని శరీరానికి ఆహారం యివ్వకుండానో,మనసుకు శరీరానికి విశ్రాంతి నివ్వకుండానూ మాత్రం కాదని ఖచ్చితంగా నీవు గుర్తుంచుకోవాలి .
 
ఇక్కడ మనం కొన్ని సూత్రాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలిసింది వుంది  .
 
  ప్రపంచంలో అన్నింటికన్నా అతి దారుణమైన విషయాలు కొన్ని వున్నాయి . …. (self pity)తమ మీద తామూ జాలి పడటం ,(
(ఆత్మా న్యూనత) తమను తాము తక్కువగా వూహించుకొంటూ బాధపడటం …(self ignorance)ఆత్మనిర్క్ష్యం  .తనను తాను శ్రద్ధ తీసుకోపోవడం . 
 
.ఓహ్ చిట్టీ నీకు తెలుగు రాదన్న విషయం మరచి తెలుగులో వ్రాసుకొంటూ పోతున్నాను . నేను ఇంగ్లీషు నేర్చుకోని దానికన్నా నీకు తెలుగు నేర్పించే అవకాశం రాక పోయిందే నని యిప్పుడు తీరిగ్గా విచారించడం   లేదు కానీ ….యిప్పుడు ఈ వుత్తరం నీకు పోస్ట్ చేసినా నీవు చదవలేవు. వ్యక్తిగత లేఖలను వేరే వాళ్ళతో ఎలా చదివించు కుంటావు. అందుకని వారానికో వుత్తరం నీకు నేను వ్రాస్తూనే వుంటాను. కాని ఈ పోస్ట్ చేయని వుత్తరాలు నాదగ్గరే వుంటాయి నీవు వచ్చినప్పుడు నేనే నీకు చదివి విని పిస్తాను.మధ్యలో నేను ఫోను చేసినా నీవు చేసినా వినిపిస్తాను.  తదుపరి లేఖ వరకు శలవు . వుభయ కుశ లోపరి .
ఒక్క క్షణం ….
మీ చెల్లెలు తమ్ముడు నీ గురించి కలవరిస్తున్నారు.
పోస్ట్ చేయని వుత్తరం -1
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది : 16-05-2009
(ఈ  లేఖలు ఏ ఒక్కరి కొరకో వుద్దేసించినవి  కావు.  ఎవరయినా ఇంగ్లిషు లోకి తర్జుమా చేస్తే ఏ కొద్దిమందికి వుపయోగ పడినా నా ఈ చిరుయత్నం దన్యత్వం  సిద్దీకరించుకొంటుంది. )
 

చిరంజీవిని ఆశీర్వదిస్తూ,

అమ్మా నాన్న…
పోస్ట్ చేయని వుత్తరం -1
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది : 16-05-2009
(ఈ  లేఖలు ఏ ఒక్కరి కొరకో వుద్దేసించినవి  కావు.  ఎవరయినా ఇంగ్లిషు లోకి తర్జుమా చేస్తే ఏ కొద్దిమందికి వుపయోగ పడినా నా ఈ చిరు   ప్రయత్నం దన్యత్వం  సిద్దీకరించుకొంటుంది. )
ప్రకటనలు