ఆరునేల్లకో ఎన్నిక నాకొద్దు
         ( ప్రజల తీర్పు.)
  రచన:నుతక్కి రాఘవేంద్ర రావు
     తేది: 17-05-2009
 
      హైదరాబాదులో 
        బాంబులు 
 ముంబాయిలో దాడులు      
 అహమ్మదాబాదు అల్లర్లు 
   నింగిలోన  సరకులు
      కరెంటుకోతలు
  రైతుల ఆకలి చావులు
     పుచ్చిన విత్తులు
         పురుగులు
     చావని మందులు
త్రాగేందుకు నీళ్ళి వ్వకున్నా 
     ప్రజల భూములు
 సెజ్ లుగా దండుకున్నా
 కోట్ల కోట్ల ప్రజల సొమ్ము
        కుశలంగా
       దోచుకున్నా
       దాచుకున్నా  
   నీకే  వేస్తా నా వోటు.  
       ఎందుకంటే
 కుక్కలు చింపిన విస్తరి    
   ప్రభుత్వాలు నాకొద్దు
   పది దినాలకో సారి 
    వచ్చే  ఎన్నికలు
  విసిగిపోయి చస్తున్నా
 నివ్వెంతన్న దిను గాని
  నాగ్గింత కూడెట్టు సాలు.
  అయిదు సమ్మచ్చరాలు
         పాలించు.
    అనుక్షణం పోరుండే 
     పొత్తులు మాకొద్దు.

ముందు ముందు ఎన్నికల్లో  

    ఒకే జెండా ఒకే గుర్తు
    రాష్రంలో దేశంలో
    గెలిచినా ఓడినా
  వున్న సీట్లు అన్నిటికీ
  నిలబడే సత్తా నీకుంటే
    నిలబడు లేకుంటే
  సన్యాసం    పుచ్చుకో     
   అనారోగ్య  పొత్తులతో  
  అనారోగ్యం  తెచ్చుకోకు 
 
     గెలిచినా ఓడినా
  అన్ని సీట్లకూ ఒకే గుర్తు
 ఒకే జండా ఎగరేస్తూ సాగిపో
   నీవెంటే మేముంటాం   
ప్రకటనలు