తొలి సంతకం

ఎదిగినకొద్దీ ఒదగమనే….ఆయన ప్రసంగాన్ని స్వాగతిద్దాం

రచన :నూతక్కి తేది :20 -05-2009 .

రాజశేఖర రెడ్డి గారి రాజకీయ పరిణితి ఆయన ప్రసంగంలో ప్రస్ఫుటంగా కనపడింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్నివుద్దేశించి ,ప్రతిపక్షాలనుద్దేసించి … 20-05-2009 వ తేదీన జరిగిన 22వ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రసంగాతంలో , కాంగ్రేసు శ్రేణులను వుద్దేశించి మాట్లాడుతూ … రెండవ దఫా కాంగ్రేసు పార్టీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన అహంకారంగా వ్యవహరించకుండా ప్రజల అవసరాలను గమనిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ ,అవసరమైతే అధికారుల దృష్టికీ ప్రభుత్వ దృష్టికీ తీసికి వెళ్లి , ఒకవేళ ప్రభుత్వాదికారుల్లో అవినీతి ,అలసత్వం ఎక్కడ గమనించినా ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని. అవినీతిని రూపు మాపేందుకు కృషిచేయాలని , ఎదిగినకొద్దీ ఒదగమని చెప్పడం ద్వారా ఎదిగిన రాజకీయ నాయకుడిగా …..ఒదిగి వుంటాడనే భావిద్దాం. ఆయన సందేశాన్ని స్వాగతిద్దాం. సహకరిద్దాం . ప్రతిపక్షాలను వుద్దేసిస్తూ అధికారం కొఱకు జరిగిన పోరాటం యిక్కడతో ఆపి వైషమ్యాలు వదలి ప్రజల సంక్షేమానికి కలసి పనిచేయడానికి రావలిసిందిగా ఆహ్వానించడం ఆయన విధానంలో వచ్చిన రాజకీయ పరిణతి .ఆయన ఎన్నికల ప్రణాళికలో యిచ్చిన వాగ్దానం మేరకు రెండు రూపాయలకే యిచ్చే బియ్యాన్ని 20 కేజి ల నుండి 30 కే జి లకు పెంచే జి.ఓ మీద రైతులకు 9 గం .ల పాటు వుచిత విద్యుత్తు యిచ్చే జి.ఓ మీద తోలిసంతకం చేసి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను అని చెప్పేందుకు ప్రయత్నిచాడు.. ముఖ్యమంత్రి పదవీ స్వీకరణ వుత్సవంలో ఆయన కాంగ్రెస్ శ్రేను లను ఉద్దేశిస్తూ నూ , ప్రధాన, మరియు ఇతర ప్రతిపక్షాలనుద్దేసిస్తూ , పలికిన పలుకులు ప్రతి పౌరుడూ ప్రతి రాజకీయవేత్త స్వాగతించ తగ్గవి. ఇంతటి పరిణితి ఆయనలో కనపడటం భావి రాజకీయ పరిణామాలకు శుభ సూచికంగా భావించ వచ్చు.

ప్రకటనలు