నిత్యం నా చుట్టూ-4
     ( ఓ  చిన్ని జూ)
 
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు 
   తేది :26-05-2009
 
       చిట్టి చిట్టి చేతులతో
  వేప పండు తింటూ వుడుత
    కలుగులోని ఎలుక  పిల్ల
   దాని వెంటే   త్రాచుపాము 
    రాత్రయితే కీచురాళ్ళు 
     రాళ్ళ క్రింద  తేళ్ళూ
     అక్కడే పెరిగే  జెర్రులు 
    రజకులు పెంచుకొంటూ
 తోలుకు వచ్చే గాడిదలూ 
      కంచర గాడిదలూ