నిత్యం నా చుట్టూ    -2
        ( ఓ  చిన్ని జూ)
 
   రచన:నూతక్కి రాఘవేంద్ర రావు 
         తేది :26-05-2009
 
    కిచ కిచ లాడుతూ పిచుకలు
      కువ కువ లాడే గువ్వలు.
        చిత్ర  విచిత్ర వర్ణాలతో 
       వనమంతా విహరిస్తూ   
        సీతాకోక చిలుకలు
         దోర జామ పండు
     రుచి చూస్తూ రాచిలుకలు 
   చిలుకల కదలికలు చూస్తూ 
    తన్మయతన గోరువంక