నిత్యం నా చుట్టూ -6 
  (ఓ  చిన్ని జూ)
 
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు 
   తేది :26-05-2009
 
కోడి పిల్లలల్ని ఎగదన్నుకు
        పోదామని
   ఆకసాన నిఘావేసి
ఎగురుతూ తిరుగాడుతూ 
       గరుడ పక్షి 
ఎక్కడో ఏదో ఆవో దూడో 
    చచ్చి పడుందని
     ఆచూకీనందిస్తూ 
   ఆకసాన రాబందులు
  గున గున గంతులతో 
     కుందేలు జంట 
    గుర్రున చూస్తూ
       కుక్కపిల్ల 
   అంతా గమనిస్తూ 
 అటకమీద పిల్లి కూన