నిత్యం నా చుట్టూ  -8

           ( ఓ  చిన్ని జూ)
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు 
        తేది :26-05-2009
 
తడి మట్టిని తొలుస్తూ వాన పాము
     మురుగులోన  మండూకం 
       చండాలంలో పందులు 
          వీధుల్లో  శునకాల  
             స్థైర్య విహారం
       ఎన్నెన్నో సహజీవులు
          యింకా యింకా
    ఏమని వ్రాయను యిప్పుడు?
              హతోస్మి !
    గొంగడి పురుగును మరచితినే