నేను
( అతి సామాన్యుణ్ణి )
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
తేది:01-06-2009
నేను కవిని కాను
నా మదిలో మెదిలే
భావాలను
మీ పై కుప్పించి
వూహలలో వూయల
లూ పేందుకు
నేను గాయకుడినీ కాదు
గాన లహరిలో మిమ్ముల
ఓల లాడించేందుకు
కానీ
నాలో కలిగిన భావోద్వేగం
సమరసమయ భావావేశం
కమిలి కుమిలి
కనలి కనలి
నా హృది చేసిన
ఆక్రందనం
అంతరంగంలో
నిక్షిప్తం చేసి
చిరునగవుతో
నిరంతరం
అనంత యానంలో
జీవన పయనంలో
జూన్ 1, 2009 at 9:14 ఉద.
neanuu antea!
జూన్ 1, 2009 at 10:01 ఉద.
Aswanisri ji,thanks.with cordial blessings….Nutakki