బే ఏరియా లో భద్రంగా

                                               బట్ట కట్టి బ్రతుకుతున్న తెలుగు భాష  -1 వ భాగం                                                                
                                                                   రచన :నూతక్కి రాఘవేంద్ర రావు 
                                                                          తేది :17-05-2009
 
 అమెరికా  లోని క్యాలిఫోర్నియా రాష్ట్రం లో  శాన్ఫ్రాన్సిస్కో  నగరం తో కలిపి అనేక నగరాల సమాహారం బే ఏరియా. అందులో భాగమే ప్రపంచ ఎలెక్ట్రోనిక్ రంగాన్ని సాఫ్ట్ వేర్ రంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని పాలించిన సిలికాన్ వ్యాలీ .లో  ఎంతో మంది తెలుగువారున్నారు. అక్కడకు వుద్యోగ రీత్యా ,లేక వున్నత చదువులకొరకు  తెలుగు దేశం నుండి వెళ్లి అక్కడున్న అవకాశాలనుసద్వినియోగ పరుచుకుంటూ తమ కున్న కొద్ది పాటి సమయాన్ని మాత్రు భాషపై వున్న ప్రేమ అభిమానాలతో  తెలుగు అభివృధికి ,తెలుగులో  అనేక సాంస్కృతిక , సాహిత్య కార్యక్రమాలకు  ,దైవ కార్యాలకూ వెచ్చిస్తూ  ,అక్కడే పుట్టి పెరుగుతున్న తెలుగు/అమెరికా బుడతల్లో తెలుగుపై ఆసక్తి పెంపొందించేందుకు కృషి చేస్తూ ,ఆయా కార్యక్రమాలకి నిరంతరం ప్రణాలికా రచన, నిర్వహణ  వంటి కార్యక్రమాల్లో  దిగ్విజయంగా నిరంతరం కృషి చేస్తున్నారు,  ఎందరో మహానుభావులు. 
 
వారిలో ఒకరు అంతర్జాల తెలుగు  సాహితీ పక్ష పత్రిక కౌముది ని  అత్యున్నత సాహితీ ప్రమాణాలతో అద్వితీయంగా నిర్వహిస్తూ ప్రచురిస్తున్న శ్రీ కిరణ్ ప్రభ గారు.   కౌముది  ని    ప్రారంభించి దిగ్విజయంగా కొనసాగిస్తున్న ఆయనకు ఆయన  సతీమణి  శ్రీమతి …… అద్వితీయంగా   చేయూత నిస్తున్నారు. ఆ పత్రికలో కొన్ని శీర్షికలు ఆమె మనో జనితాలు.
.
వారిద్దరే ఆ పత్రిక ను వేరెవ్వరి సహకారం లేకుండానె ,సాహితీ వస్తు సమీకరణ,నుంచి వారే నిర్ణయించుకున్నా సాహిత్య ప్రమాణాలకు అనుగున్నంగా వున్న వాటిని ఎంచుకొని ఏరి కూర్చి అద్భుతమైన కౌముది ని     క్రమం తప్పక విడుదల చేస్తారని , ఎవరికీ తెలియదు . ఆ యత్నంలో వారు పొందుతున్న ఆత్మానందం ముందు వారు పడుతున్న
శ్రమ ,కఠోర దీక్ష  వెల వెల  పోతాయని వారిని చూస్తె తెలుస్తూంది. 
స్వతహాగా సాఫ్ట్వేర్ వుద్యోగి అయిన ఆయన వుద్యోగ భాద్యతలు నిర్వహిస్తూనే ఈ మహత్తర భాద్యతను తలకెత్తుకొని  నిర్వహిస్తున్నకౌముది  పత్రికను తెలుగు సాహితీ రంగంలో వున్న అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న అతి కొద్ది పత్రికల స్తాయి  కన్న  వున్నతంగా తీర్చి దిద్దాలని , సాహితీ వ్యవసాయంలో వుత్తమ ఫలితాలను సాధించాలని , తమకు తెలియకుండానే… ,జన్మస్తలిలోనే వూపిరందక కొట్టుమిట్టాడుతున్న తెలుగు   బ్రతికి బట్టకట్టేందుకు  తమ వంతుగా  ఏదో చేయాలని కృషి చేస్తున్న ఆ  నిరంతర  కృషీవలుల  ఆకాంక్ష సఫలీకృతం కావాలని మనమందరం ఆశిద్దాం. .