బే ఏరియా తెలుగు లిటరరీ అసోసియేషన్ ( BAATLO ) ఆవిర్భావం 
(బే ఏరియాలో భద్రంగా  బట్ట  కట్టి  బ్రతుకుతున్న తెలుగు భాష -2 వ భాగం )
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
తేది 17-05-2009 
 
 17-12- 2008 న నేను , తెలుగులో  వ్రాసే  సౌకర్యం  అందిస్తున్న     బ్లాగు ప్రొవైడర్ల  గురించి తెలుసుకో వాలనే సంకల్పంతో నా మనవడి సహాయంతో వెదికి వెదికి తెలుగులో డైరెక్ట్ గా వ్రాయటానికి సదుపాయం వున్న బ్లాగ్ స్పాట్ .కాం లో బ్లాగు  రిజిస్టరు చేసి ఆ   బ్లాగులో  నా అభిప్రాయాలు వ్యక్తీకరించడం Dt .25-12-2008 నుండి ప్రారంభించి ఈ రోజు Dt. 17-05-2009 కు మొత్తం …వాసిగా ఎన్నేన్నున్నాయో తెలియదుకాని రాసిగా ఒక వంద కు  పైగా  చేరాయి.
బ్లాగు లలో  మన అభిప్రాయాలు, మనకు కలిగిన భావాలు ,స్వేశ్చ్చ గా వ్యక్త పరచు కోవడానికి ఒక మంచి సదుపాయం . ఓ మంచి వేదిక .అందులో తెలుగులో వ్రాసే అవకాశం వున్నప్పుడు  అదో అద్భుత అవకాశం.  వుపయోగించుకోవడం ,సద్వినియోగ పరుచుకోవడం వివేక మౌతుంది. అలా నా www.kaakateeya.blogspot.com లో  బ్లాగుల ద్వారా  ప్రారంభించిన   నా అభిప్రాయవ్యక్తీ కరణా   ప్రక్రియ  లో మా అల్లుడిగారి సాంకేతిక సహకారం తో  కొన్ని పోస్టులకు ఆడియో  ,వీడియో  కూడా  పొందుపరచటం  జరిగింది .
 
దీప్తి ధార  శ్రీ సి . బి .రావు గారి ప్రోత్సాహంతో  ఫోటో లు కూడా జత పరచటం చేసాను. దీనంతటికి సాంకేతిక సహకారం మా అల్లుడి గారిదే. ఆయన నా వ్యాఖ్యానం వెనుక మంద్రమైన అత్యద్భుతమైన మ్యూజిక్   కంపోజ్ చేసి ఇచ్చారు.  ఆ తరువాత కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల  బ్లాగ్ స్పాట్లో  వేగంగా  వ్రాసేందుకు ఇబ్బంది కలగటంతో , పోస్ట్లు  వ్రాయడం ఇబ్బందిగా పరిణమించింది ఆ  తరుణంలో  లేఖిని వారి సదుపాయాన్ని వుపయోగించడం అలవరుచు కొని , తరువాత వర్డుప్రెస్సు వారి సౌజన్యం  తో నా బ్లాగు www.nutakki.wordpress.com  నమోదు చేసుకొని  అందులో నా భావాలను వ్యక్తీకరించడం ప్రారంభించాను.  లేఖిని వారందంచిన తెలుగు పరికరం ఓ మహాద్భుత ఆవిష్కరణ. బ్లాగ్ స్పాట్ వారి ది మరో గొప్ప సదుపాయం. ఎక్కడో వ్రాసి అక్కడ కట్ చేసి బ్లాగులో పేస్ట్ చేయవలసిన అవసరం లేదు. కాకుంటే అక్కడ పెద్ద పెద్ద వ్యాసాలూ వ్రాసేటప్పుడు చాలా స్లో  అయిపోతుంది. లేఖినిలో డ్రాఫ్టు సేవ్ చేసుకొని తిరిగి తెచ్చుకొనే అవకాశం  లేదు. ఆ అవకాశం లేఖిని వారు అందిస్తే మాత్రం ,అది ఓ గొప్ప సదుపాయం అవుతుంది . ప్రస్తుతం జిమెయిల్ వారి కంపోజింగ్ సౌకర్యాన్ని వినియోగించుకొని తెలుగులో వ్రాయ కలుగుతున్నాను. అదీ కాక డ్రాఫ్టులు సేవ్ అవుతాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో …
 
 యు యస్ ఎ లో, బే ఏరియా లో శ్రీ  కిరణ్ ప్రభ(కౌముది ఫేం )  గారి ఆతిధ్యంలో జరిగిన బ్లాగర్ల సమావేశానికి  నేనూ వెళ్ళడం ,శ్రీ సి.బి.రావు గారు, శ్రీ వేమూరి వెంకటేశ్వర రావు గారు ,యితర ప్రముఖులు  రావడం వారితో సంభాషిచడం జరిగింది. ఆ సమావేశంలో అనేకమంది యువకులు , వుద్యోగ  రీత్యా  బె ఏరియాలో   వున్న—  వారి వుత్సాహం ,సాహిత్యం యడల, తెలుగు యడల వారికున్న రెగ్యులర్ టచ్ చూసి అబ్బుర పడ్డాను.వారు నిరంతరం  నిర్వహిస్తూ వస్తున్నతెలుగు కార్యక్రమాల గురించి తెలుసుకొని ,ఆయా ప్రాంతాల్లో తెలుగు భాషా భి వ్రుదికై చేస్తున్న కృషి చూసి అచ్చెరువన్దాను.     కొందరు తెలుగు  రచయిత్రులు  కూడా అక్కడ కలిసారు .ఆ సందర్భంగానే జాను తెనుగు సొగసులు వారు బె ఎరియా బ్లాగర్ల సమావేశం తమ  చేత  మరలా పోస్టు రాయిన్చిందని వ్రాయడం మీకందరికీ తెలిసిన విషయమే. 
 ఆ తరువాత బే ఏరియా లో వున్న కొందరు సాహితీ వేత్తలు, సి.బి రావు గారి వంటి వారి ప్రోత్సాహంతో ఓ సాహితీ సమావేశం  ఏర్పాటు చేయాలని సంకల్పించినప్పుడు మా అమ్మాయి గారింట్లో మా అల్లుడి గారి ఆతిధ్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసాము .. అందరం కలిసి ఎనిమిదిమందిమి  ఆ సమావేశానికి హాజరయ్యాము . కొందరు చివరి నిముషంలో  తెలియ చేసారు,కొన్ని అవాంతరాల వల్ల రాలేక పోతున్నామని .అక్కడ   వున్న గొప్ప
విషయమేమంటే  నిర్మోహమాటంగా  రాగాలుగుతామో లేదో మెయిల్ ద్వారానో ఫోను ద్వారానో తెలియ చెప్పుతారు. శ్రీ వేమూరి వెంకటేశ్వర రావు గారు ,శ్రీ కిరణ్ ప్రభ గారు.. ముందే  నిర్ణయింపబడిన కార్యక్రమాల వల్ల సమావేశానికి రాలేక పోతున్నందుకు తమ అశక్తత తెలియ జేస్తూ సమావేశం విజయవంతం కావాలని ఆకాంక్ష తెలియజేసారు.  అప్పుడు  అక్కడ వుద్భవించింది   BAATLO…….Bay area Telugu Litarary Aassociation. తాత్కాలిక ,కార్య నిర్వాహక బృందమూ ఏర్పడింది . శ్రీ సి.బి. రావు గారు అక్కడి అవుత్సాహికులకు ఆ భాద్యతలను  అప్పగించి ,  విధి విధానాలకు  , ..చేపట్టే కార్యక్రమాలకు రూపకల్పన నివ్వవలసిందిగా తెలియజెప్పారు.   , అవి ఇంకా  నిర్మాణ  దశలో  వున్నాయి .
 
ఇప్పటి  వరకు  బె ఏరియా లో 1) సిలికానాంధ్ర 2)బాటా లాటి అనేక సంస్థలు  అనేక తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలూ ,తెలుగు సాహితీ కార్యక్రమాలూ నిర్వహిస్తూ
మాబడి కార్యక్రమం ద్వారా చిన్నారులకు తెలుగు నేర్పుతున్నారు.. దేశం కాని దేశంలో  తెలుగు భాషాభిమిమానం తో వారు చేస్తున్న కృషి బహుదా ప్రశంసనీయం .   
 
రచయితలకు కవులకు  వేదికగా ఓ ప్రత్యెక సంస్థను ఏర్పాటు చేయాలనే సదుద్దేశ్యంతో ఆవిర్భవించిన BAATLO తన కార్యక్రమాలతో తన పయనం ప్రారంభిస్తుందని ఆశిస్తూ  ఆశీర్వదిస్తున్నా.