స్వయంకృతాపరాధం

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు

తేది: 10-06-2009.
 
 
సృష్టి కర్తే సృష్టించాడో
కోట్లాది కోట్ల వత్సరాల  
నిరంతర పయనంలో 
సూర్యుని కోపాన్ని 
తట్టుకొనే నెపంతో 
ధాత్రి 
తనకు తానె నిర్మించుకొందో ! 
ఆ రక్షిత రక్షణ వలయం
తూట్లు తూట్లు పడుతోంది !!!
 
అతి  నీలిలోహిత
కిరణ పుంజం 
ఆ తూట్ల గుండా
ధరిత్రి పై దాపురిస్తే !!!
వికృత మానవ రూపాల్
దుష్కృత జీవశ్చవాల్
వినాశనం
అతి వికృత
జీవావరణ విధ్వంసం !!!
జీవ హనన సంవిధాన
 రచనా విధాత  
ఎవరు ఎవరు ఎవరు !!!
ఇంకెవరూ   మానవుడే —-