చావులకు వేదికైన చారిత్రిక చార్మినారు
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
తేది:12-06-2009 
 
చారిత్రిక చార్మినారు
చంపడానికో వేదిక
చావడానికో వేదిక
అయినా ఫరవాలేదన్నట్లు
మరో రీతిలో జనాభా
నియంత్రణ కు మరో మార్గం
దొరికిన్దన్నట్లు
భాగ్య నగర పాలక వర్గ 
 పాలనా రీతులకో  మరో దర్పణం.
 
హత్యలు
హతులూ
హంతకులూ
అనునిత్యం వార్తా శీర్షికలై 
విరాజిల్లుతున్నా నిరంతరం  
 
కానీ  ఏదీ ఎక్కడ
ఆ అనుభవాల పాఠాలు  
ఆకళింపు చేసుకొన్న
 దాఖలాలేవీ  
ఆ నికృష్ట చర్యలకు
 ఆచరణలో
అడ్డుకట్టలేవీ
 
పటిష్ట యోజన
సిద్ధం చేద్దామని
యోచనలే చేయని
సంకల్ప రాహిత్య
ప్రభుత్వాలు ఓ ప్రక్క 
నిర్లక్ష్య  పాలనా యంత్రాంగాలు 
మరో   ప్రక్క
 
హత్య అయినా ఆత్మ హత్య అయినా
నిత్యక్రుత్య జనజీవన సంవిధాన
సహజ సిద్ధ ప్రక్రియ
అన్నట్లు 
నాగరీక జన సందోహాలు.
ఏమీ జరగనట్లు
చీమో దోమో కుట్టినట్లు
ఎ  ఆందోళనా  లేకుండా 
ఎ ఆందోళన లూ  చేయకుండా 
 మళ్ళీ
చార్మినారు ఎక్కుతూనే వున్నారు.
 
రక్షక భట వర్గాలు
నిత్య కృత్య బక్ష ణా   క్రుత్యంలో 
తాదాత్మ్యం లో   తలమునకలై
పాపం
వారూ చేయగలిగిందేముందని
చస్తున్నా చూస్తూ
చంపుతున్నా చూస్తూ
మరో ఘటనకొరకు ఎదురు చూస్తూ
వివిధ మీడియా ప్రతినిధులు.
చంపిన వాడు దొరికినా
చంప బడిన వాళ్ళు చచ్చినా 
జరిగేదేమీలేదుఒరిగేదసలె లేదు. . 
సంఘటనలు ఆగేదీ లేదు. 
వివిధ మీడియాలకు  మరో   వారం 
వార్తలు దొరకటం తప్ప.