మహాకవి శ్రీ శ్రీ విరచిత “ భిక్షువర్షీయసి …..”ఆగష్టు ,౦౩ ,1934 వ సంవత్సరంలోనె ఆయన వీక్షించగలిగిన సామాజిక దృక్కోణం,  మౌన రోదనతో ఆయన  ఎద కనలి కమిలి  మూలిగినా , …..
సమాజపు దృక్కోణంలో…  మాత్రం అదో పెద్ద ఆలోచించవలసిన,ఆలోచనకొరకు తమ సమయాన్నివెచ్చించ  వలసినంత  ప్రాముఖ్యత లేని దృశ్యం .   అట్లాంటి దృశ్యాలను అనేక లక్షలమంది ప్రతిదినం చూస్తూనే వున్నా, ఈసడిస్తూ చీత్కరిస్తూనే వున్నా , ….
 
ఆ దృశ్యం నుంచి మానవీయ కోణాన్ని ఆవిష్కరిచగలగడం ,సామాజిక నిర్లక్ష్యపు కోణాలను స్ప్రుసించ గలగడం , క్రుళ్ళి కృశించి నసిస్తున్న  మానవత్వ విలువల దుర్వాసనలు సమాజంలో బ్రతుకులీడుస్తున్న మానవ జీవార్నవం మూర్కొనేలా చేయగలగడం, ఆ కంపు ఏమాత్రం లేని ఇంపైన సమాజాన్ని  ఆవిష్కరించుకొనే  దిశలో పయనించమని  చెప్పకనే తెలియజెప్పి ,నికృష్ట మానవాధమా నీవు బ్రతకడమే కాదురా,  తోటి అన్నార్తుని కానరా, వినరా, ఆద రించారా ,కలోగంజో నీకున్న దాంట్లోనే యింతైనా  పంచుకోరా అని  సమ సమాజ జీవన మార్గాన్ని చూపుతూ నిన్ను చివాట్లు పెడుతూనే ,   జీవార్నవాన మానవ జీవితాన అంతరాలను  వెలికి తీసి సమాజాన్ని కలం పోటుతో నివ్వెరపరచి ఆలోచింప చేయ గలగడం ,ఎవరు మాత్రం చేయ గలరు ఒక్క శ్రీ శ్రీ తప్ప ?   అందుకే ఆయన ఏకైక  ఆధునిక మహా కవి .ఆయన విరచించిన  భిక్షువర్షీయసి మనం మననం చేసుకుందాం .( మహాప్రస్థాన ప్రచురణ కర్తలు… విశాలాంధ్ర పబ్లిషర్స్ వారికి క్షమార్ధనతో )
 
 
మహాకవి శ్రీ శ్రీ విరచిత
     భిక్షువర్షీయసి
      (  మీ కోసం )
దారి ప్రక్క,చెట్టు క్రింద
ఆరిన కుంపటి విధాన
 కూర్చున్నది ముసిల్దొకతె
మూలుగుతూ ,ముసురుతున్న 
ఈగలతో వేగలేక .
 
ముగ్గుబుట్ట  వంటి తలా ,
ముడతలు తేరిన దేహం , 
కాంతి లేని గాజు కళ్ళు, 
తనకన్నా శవం నయం . 
 
పడిపోయెను జబ్బు చేసి ,
అడుక్కొనే శక్తి లేదు ;
రానున్నది చలికాలం ;
దిక్కులేని దీనురాలు .
 
ఏళ్ళు ముదిరి, కీళ్ళు కదలి,
బతుకంటే కోర్కె సడలి –
పక్కనున్న బండరాయి
పగిదిగనే పడివున్నది .
 
“ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవ్వరి” దని  
వెర్రిగాలి  ప్రశ్నిస్తూ
వెళిపోయింది !
 
ఎముక ముక్క కొరుక్కుంటు
ఏమీ అనలేదు కుక్క 
ఒక ఈగను పడవేసుకు 
తొందరగా తొలగె తొండ.
 
క్రమ్మె    చిమ్మ చీకట్లూ, 
దుమ్మురేగేనంతలోన ,
“ఇది నా పాపం కా” దనె
ఎగిరి వచ్చి ఎంగిలాకు .