పాపం!!! రంగారెడ్డి జిల్లా  మరియూ ప్రజలూ
(రాజేంద్రనగారుకు పోవాల్నంటనే )
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
తేది:16- 06 -2009.
 
 
ఆ రోజున ఏదైనా  రాజకీయ ప్రయోజనాన్నే ఆశించి చేసాడో, లేక ఎ మహత్తర ప్రజా ప్రయోజనాన్ని వూహించాడో   కాని , భాగ్యనగరానికి  ఓ రక్షణ వలయంగా  ఓ జిల్లానే సృష్టించాడో మహా రాజనీతిగ్నుడైన ఆ  ముఖ్యమంత్రి గారు. డా. మర్రి చెన్నా రెడ్డి   గారు ,అధికార బలం వున్నదన్న దన్నుతో సృష్టించిన ఆ జిల్లా , తమ మామగారైన వెంకట రంగారెడ్డి గారి పేరు పై ఆయన జ్ఞాపకార్ధం   సృష్టించిన జిల్లా. అదే రంగారెడ్డి జిల్లా.నైసర్గికంగా విచిత్రమైన రూపుతో ,హైదరాబాద్ జిల్లాలోని అంచుల్లో చుట్టూ వున్న కొన్ని గ్రామాలూ హైదరాబాద్ జిల్లా చుట్టూరా వున్న  వున్న జిల్లాలు ,కరీం నగర్,  నల్గొండ ,మెదక్, మహబూబ్ నగరు ల నుండి కొన్ని గ్రామాలు  విడ దీసి  రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేసారు. రంగారెడ్డి వంటి మహనీయుని పేరుతొ జిల్లా ఏర్పాటు చేయాలంటే ఈ విచిత్ర రూపుతో రూపొందించాల్సిన అవసరంలేదు. చక్కటి లంబకోనాలతో చతురస్రాకారంలో,ఆయన అనుకున్న జిల్లాను సృష్టించుకోగల సమర్ధుడు. . కానీ మరి అచ్చం యిలాగే జిల్లా ఏర్పడాలని ఎందుకనుకున్నాడో ఏమో ,అదో అంతుబట్టని విషయం.    
 
జిల్లాలో జిల్లా కేంద్రం లేదు. జిల్లా అధికారి కార్యాలయమూ లేదు. ఒక వేళ వున్నా పాలనా సౌలభ్యం వుండదు.
జిల్లా కేంద్రం వేరే జిల్లాలో, రక్షణ వ్యవస్థ కూడా పాపం వేరే జిల్లానే భరిస్తోంది .యిలా అన్ని పాలనా విభాగాలూ పాపం వేరే జిల్లాలోనే. మరి జిల్లాలో  ఒక ప్రాంతంలో పెడితే మరో ప్రాంత జిల్లా వాసులకు అందనంత దూరం. పరిపాలనా సౌలభ్యం మ్రుగ్యమౌతుంది. ఎవరూ ఆ జిల్లాని ఏర్పాటు చేయమని ఆశించింది లేదు ,వుద్యమాలు చేసిందీ లేదు, తనకు  అధికారం వుంది కాబట్టి ,తనను అధిష్టానం ఆదరిస్తోంది కాబట్టి ,తా బట్టిన కుందేలు చందంగా ,చేసిన అనాలోచిత చర్యలా అనిపిస్తుంది సామాన్యునికి . అసామాన్యుల ఆలోచనలేలా వున్నాయో మరి.
 
ఓ బండ రాయి చుట్టూ చుట్టుకొన్న కొండచిలువ రీతి, ఓ చట్రంలా, ఓ బండి చక్రంలా ,తన తోక తానె  మింగుతున్న కొండ చిలువలా ,తలా తోకా వున్నా కనపడకుండా
…..,గుండె ను ఎక్కడో పెట్టి ఊపిరి తిత్తులు కాలేయం కిడ్నీలు మెదడూ వేరు వేరు ప్రాంతాల్లో వుంచి , ఆ జిల్లాకు ఆ జిల్లాలో తన స్వంత అధికార గణం , అధికార ప్రాంగణ మంటూ లేక ……యిన్ని దశాబ్దాలూ నిశ్సబ్దంగా తన వునికిని ,  కాపాడుకొంటూ వచ్చిన జిల్లాకు,ఓ రూపును ఆస్తిత్వాన్ని యిద్దామని ఏ ప్రభుత్వమూ ప్రయత్నించా లేదు. తవ్వితే తలకేత్తుకోవలసి వస్తుందని  ,జిల్లా పాలనా సౌలభ్యం కొఱకు జిల్లా రూపు రేఖలను సరిదిద్దుదామని ఎటువంటి ప్రయత్నమూ చేయలేదంటే ,  ఆ రాజనీతిగ్నుని రచనా సంవిధానం …. ఎలా విశ్లేషించాలి …ఏమని చెప్పాలి.
 
” మరి మర్రి వారి అట్లా చేస్తే ,యిప్పటి C .M  సారూ చెల్లెమ్మ కళ్ళల్ల సంతోషం కనులార సూడాల్ననుకున్న డో ,లేక సేల్లెమ్మే ఆసపడిందో  ఏమో గాని …..,పత్రికల్ల వార్తలొచ్చినయ్,సేల్లెమ్మ జిల్లా కేంద్రం   రాజేంద్రనగరుకు ఎగరేసుకేల్లుద్దని …..మిగిలిన ప్రాంతపోల్లకు    ఎంత కట్టమోచ్చే ..” 
 
. ఏదో ఇప్పటిదాకా తన శరీరం లోనుంచి    విడివడిన తునకాయే    కష్టమైనా ఆప్యాయంగా సాకింది హైదరాబాద్ జిల్లా.  రంగా రెడ్డి జిల్లాలో ఏ మూలున్నా హైదరాబాదు లో  జిల్లా పరిపాలనా శాఖలు అన్నీ   అందుబాటులో వుండేవి. 
మరిప్పుడో ఓ ప్రాంతంలో జిల్లా కేంద్రం వుంటే మరో ప్రాంతానికి బహుదూరం  మరి.రాజకీయ దురంధరులేందరో లెక్కకు మించి వున్నారు .నా ఆలోచనలేపాటని ? పాడనా తెలుగు పాటా  ….
 
అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ,పరిపాలనా సౌలభ్యం కొఱకు ,ప్రజల సౌకర్యం కొఱకు ,గ్రేటర్ హైదరాబాద్ పరిధుల కావల మిగిలిన రంగారెడ్డి జిల్లా భాగాలను నాలుగు వృత్త చాపాలుగా కత్తిరించి  ఆయా ప్రాంతాలకు వెలుపల వున్నజిల్లాలు నల్గొండ ,మెదక్, మహబూబ్ నగరు,, కరీం నగర్  జిల్లాల్లో విలీనం చేయటమొక్కటే ప్రత్యామ్న్యాయ పరిష్కార మార్గం.  న్యాయంగా ఆయా జిల్లాల  శరీరాల నుంచి  కత్తిరించిన భాగాలను తిరిగి అతికించడం న్యాయం కూడా.
 
అలా కాదని జిల్లా ప్రస్తుత రూపాన్ని అలాగే వుంచి జిల్లా కేంద్రాన్ని ఇతర ప్రధాన పరిపాలనా కేంద్ర కార్యాలయాలను ఎక్కడ ఎర్పరచినా,ప్రజలకు ,అధికారులకు మితిమీరిన అసౌకర్యం కలిగి విభజనకు వుద్యమాలు తప్పని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం వుంది.