చిట్కాయణం ..(1)

                                                                ‘ వెక్కిళ్ళు’
                                             ( వుపశమనానికో  చిట్కా )  
                                                  విషయ సమర్పణ :నూతక్కి రాఘవేంద్ర రావు  
                                                          తేది : 22 -06 -2009
      
ఈ రోజు తెల్ల వారు ఝామున  నాకు నాలుగ్గంటలకు నిదట్లోనే వెక్కిళ్ళు మొదలయ్యాయి .వెక్కిళ్ళు వస్తుంటే మాత్రం చాల ఇబ్బంది కలుగుతుంటుంది. లేచి కూరుచున్నాను .చిన్నప్పటినుంచి మామూలుగా చేసే  అమ్మమ్మ చిట్కా .. ఓ గ్లాసుడు మంచినీళ్ళు త్రాగాను. తగ్గలా.డీప్ బ్రీథ్ థెరపీ ట్రై చేసాను. లాభం లేక పోయింది. లేచి ధ్యాస మళ్ళించి అటూ యిటూ తిరగటం మొదలెట్టాను. ఏమీ లాభం లేక పోయింది. సడన్ గా ఓ చిట్కా గుర్తుకొచ్చింది . లోగడ ఓ సారి వెక్కిళ్ళు వచ్చి నప్పుడు ఏమీ పాలుపోక ఓ స్పూనుడు పంచ దార అంగట్లో వేసుకొని నాలుక పైకి నొక్కి పట్టి నిదానగా రసాన్ని గొంతులోకి పీలుస్తుంటే !!! ఆశ్చర్యం !!!!!వెక్కిళ్ళు మాయం.
ఇప్పుడూ అదే ప్రక్రియ ఎందుకు చేయ గూడదనుకొని , లేచి వంటింట్లోకి వెళ్లి ,  ఓ స్పూను పంచదార  ,తీసుకొని నాలుక తెరచి  లో నాలుక పైన పోసుకొని ,నాలుక లోనికి తీసుకొని ,పంచదార అంగిలికి నొక్కి పట్టి ,నిదానంగా రసాన్ని పీలుస్తూ పొతే  వెక్కిళ్ళు ఆగిపోయాయి.    ఇంతకు ముందు కూడా ఈ చిట్కా వల్ల  వెక్కిళ్ళ బాధ నుండి
వుపశమనం   పొంది వుండటం వల్ల ,దీన్ని నలుగురితో పంచుకొనే వుద్దేశ్యంతో యిలా మీ ముందుకు. 
 
చిట్కా :ఓ స్పూను పంచదార (కొంచెం మందమైన పలుకుంటే మంచిది .మెత్తటిదయినా ఫరవాలేదు. )తీసుకొని అంగిట్లో వేసుకోవాలి నాలుకను అంగిలి పై భాగానికి నొక్కి వుంచి నిదానంగా స్రావాన్ని లోనికి పీల్చుకోవాలి. అంతే వెక్కిళ్ళు ఆగి పోతాయి.
 
ఇందులో వున్న శాస్త్రీయత  ప్రక్రియ ఏమిటన్నది మాత్రం నాకు తెలియదు. అదీ కాక అందరికీ ఇది వుపయోగ పడుతుందా లేదా అన్నది కూడా నాకు తెలియదు.నేనే కాక  ఈ చిట్కా వుపయోగించుకొని  నాకు తెలిసిన చాలా మంది లాభ పడ్డారు అన్న విషయం మాత్రం వాస్తవం. అలాగని అందరికీ వుపయోగపడుతుందో లేదో నాకు తెలియదు. .
 
ఆ తరువాత అంతర్జాలంలో వెతికాను. Hiccups అని టైపు చేసి సెర్చ్ చేస్తే   వెక్కిళ్ళ జాతకం, నివారణా మార్గాలు ఓ  రెండు వందల దాకా వున్నాయి. అందులో నా స్వంతంగా నేర్చుకున్న చిట్కా కూడా వుందండోయ్ .( అంటే అది  ఎవరి స్వంతమూ   కాదన్న మాట. గుండు సూది గుచ్చి గాలి తీసినట్లయ్యింది నా పరిస్తితి. )
 
వెక్కిళ్ళు ,వాటి ఆగమన కారణాలు (సర్వ సాధారణమైనవి),నివారణోపాయాలు (మరి కొన్ని)
వివరంగా తెలియ చేసేందుకు మరో సారి మీ ముందుకు వస్తాను. 
 
జాగ్రత్తలు: కానీ ఈ ప్రక్రియలో చిన్న జాగ్రత్త పాటించాలి. అదేంటంటే పంచదార గొంతులో వేసుకొనేటప్పుడు  వెక్కిళ్ళు రాకుండా నూ ,పోరమారకుండానూ (పులమారటం)   జాగ్రత్త పడాలి . లేకపోతె పంచదార పలుకు వూపిరితిట్టుల్లోకి పోయి తిప్పలు పెట్టె ప్రమాదం వుంటుంది. 
మరో చిట్కాతో మరో సారి.