మైఖేల్ జాక్సన్ మనకిక లేడట !!!

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు

 తేది :26-06-2009

ఉవ్వెత్తు న ఆకాశానికెగసి

 అదే స్థితిన శతాబ్దాలు ….

తటిల్లున కడలి కూలి

మహోగ్ర తరంగం …..

పాపం శోక సంద్రాన

విశ్వ యువత

గుండె గుండెన గుడి కట్టుకు

 కొలువుండిన మైఖేలిక లేడట

మన జాక్సను తరలి రాని తీరాలకు

 ఎటో వెడలి పోయాడట

నిశ్చ్చేష్టులై

దిఘ్భ్రాన్తులై

యువత

ఆ సంగీత నృత్య రీతులకు

 సృష్టికర్త తానై , విధి విధాత తానై

 యువతకు స్ఫూర్తిదాత తానే అయి…..

ఆ నృత్యం తీరు వేరు

సంగీతపు హోరు వేరు

 వేగం వేగం వేగం వేగం

 కాంతి పయన వేగం

 కరాళ కర విన్యాసం

 పద తాడన పీడనం

మృదు పల్లవ గానం

 మేఘ ఘర్జనం

 వురుములు మెరుపులు

వర్షపు ఝల్లులు

 అవన్నీ అప్పటికీ,

 ఇప్పటికీ ,ఇంకెప్పటికీ

ఆయనకే చెల్లు.