జూలై 2009
Monthly Archive
జూలై 28, 2009
Posted by Gijigaadu under
చర్చా వేదిక
వ్యాఖ్యానించండి
తెలుగు బ్లాగ్మిత్రులకు చర్చకు ఆహ్వానం.
చర్చనీయాంశం : ప్రజల సొత్తు తో ప్రభుత్వాలు చేపట్టే నిర్మాణాలకు శంఖుస్తాపనల పేరుతోనూ,తదుపరి ప్రారభోత్సవాల పేరుతోనూ ప్రజలకు అంకితం చేసే విషయంలో తాత్సారం చేయడం , మంత్రులూ,అధికారులూ ప్రముఖులూ అందుబాటులో లేరానో, ముహూర్తాలు లేవనో, విలంబన జరగటం ఎంతవరకు సమంజసం ?నివారణకు అవకాశాలు లేవా?దయచేసి చర్చించండి
జూలై 25, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
ఖండిత వనం – 4
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
Dt. 26-07-2009
అత్యధిక వోల్టుల విద్యుత్ లైన్లు
నా ప్రహరీ గోడల ప్రక్కన …
.ప్రవహిస్తూ
నా చెట్ల కొమ్మలు, కొబ్బరి చెట్లను
అడ్డమని ఆటంకమని
ఆయా సంస్త లు నరికేస్తుంటే
నివారించ లేక నిస్స హాయంగా
నేను పెంచుకున్న
చెట్ల మొదళ్ళు కాదు కాదు
నా ఆశలు, ఆకాంక్షలు !!!
ఆక్రోశం ఆపలేక
వుక్రోషం ఓపలేక
కూకటి వ్రేళ్ళతో నేనే పెరికేసా
చెట్లు పెంచితే అవార్డులు
ప్రభుత్వాలు !ప్రకటనలు !
చెట్లు పెంచితే నరి కేస్తూ
వారిని నరికే వారెవరూ లేక
ప్రణాలికలంటూ లేని
పర్యావరణ ద్రుఖ్పధంలేని
ఆ ప్రభుత్వ శాఖ లు
జూలై 25, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
ఖండిత వనం – ౩
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
26-07-2009
నా గృహ వన ప్రాంగణాన
అను నిత్యం వన భోజనాలు ,
నిత్య వసంతం
పాదు త్రవ్వి నా చెమట
బొట్టు బొట్టు గా పోసి
అద్భుతంగా పెంచుకున్నా…
అరవై అడుగుల లోతునుండి
బావి పై తాగాడిపై నిలబడి
వంగి చేంతాడు కడవలతో
నీళ్ళు తోడి పోసి పెంచి
పోషించిన నా వనంలో
అను నిత్యం సందడిగా
తిరుగాడే నా వుడతలు
రామ చిలుకలు, పిచ్చుకలు ,
పావురాళ్ళు కోయిలలు,
జెముడు కాకులు , కాకులు ,
మాల గాకులు వూసర వెల్లులు,
తొండలు పసిరిక పాములు
అపుడపుడు త్రాచులు ,
జేర్రిపోతులు నెమళ్ళు ,
వానరాల విహారాలు …
అవన్నీ యిప్పుడు
వాటి గూళ్ళు కూలిపోయి
వాటి నీడ కరువైతే
నన్నేమని తిట్టాయో
ఏమని శపించాయో
దరి దాపుల్లో లేని
ఏ వృక్ష సముదాయాలకు
చేరాయో ….
జూలై 25, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
ఖండిత వనం – 2
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
26-07-2009
వాళ్ళెవరోవచ్చి నా పెరటి చెట్లను నరికేస్తుంటే
పలు పలు అంతస్తుల
భవన సముదాయాల
విద్యత్ అవసరాలు తీర్చే మిషతో
నా పచ్చని పెరటి చెట్లన్ని నరికేస్తుంటే
రోదిస్తూ నా ఖండిత వన ప్రాంగణం …
నేను చెట్లు నాటిన నాడు
కొవ్వొత్తులతో, ఆయిలు దీపాలు
కిరసనాయిలు లాంతర్ల
గుడ్డివెలుగుల్లో
నగర కాలుష్యపు వాయువులు
ఆకసాన ప్రతిఫలించే కాంతుల్లో
దోమల ముసురుల్లో
రోజులు నెలలు వత్సరాలు …..
అయినా ఆనందంగా …….
యిప్పుడు నా చుట్టూ
ఆ రోజుల్లో ఆలోచనకైనా
అందని భవన సముదాయాలు .
కనుచూపు మేర కనిపించని విద్యుత్ స్థంభాలు,వాహకాలు
ఈ రోజున నా వనాన్ని చిద్రం చేస్తూ ….
నా మనసును విచ్చిన్నం చేస్తూ….
…
జూలై 25, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
ఖండిత వనం – 1
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
26-07-2009
ముఫై అయిదేళ్లుగా గా
ము ద్దుగా నా చేతులతో
నా పెరట్లో నే పెంచిన పచ్చని వనం
అశోక ,వేప , కరివేప, కొబ్బరి
మామిడి ,సీతాఫల, రామాఫల ,
రాక్షస వుసిరి, అడవి వుసిరి బొప్పాయి ,
సపోటా ,దానిమ్మ జామ చెట్లు ,ఫలవృక్షాలు
అన్నిటినీ తృటిలో నిర్దాక్షణ్యంగా…..
నేనే చిదిమేసా
ఆత్మ క్షోభతో క్షోభిస్తూ
జరిగినదానికి పరితపిస్తూ
ఎందుకు చేసానీపని
ఆత్మ నిందలో నేనిప్పుడు …
జూలై 21, 2009
Posted by Gijigaadu under
expressions
3 వ్యాఖ్యలు
జీవశ్చవం .
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది:21-07-2009
కళా తపస్వి యాతడు
కళే ఆకారంగా
కళే ఆహారంగా
కళ్ళేక్కడో లోలోతుల
కళ వెల వెల పోతూ
జీవం మాత్రం లేశం
కళేబరం నయం
కన్నీళ్ళతో దాహం తీర్చుక
కళ కోసమే ఆతడు
కల్లోలిత మానవాళి లో
కాన రాని మానవతకై
కనులార్పక తపియించే
మానవతా కళా తపస్వి
కట్టెను నడిపేందుకు
కళ నమ్ముకు బ్రతుక వలెనా ?
తను నమ్మిన జీవం
భావం భాగ్యం
కానీ …
కువ కువ లాడుతూ పిల్లలు
నక నక లాడుతూ పొట్టలు
జీవం చచ్చిన కన్నులు
నిట్టూర్పుల సెగల పొగలు
ఆకలి బాధలకోర్వని
జీర్ణించిన శరీరాలు ….
అమ్మకొరకు నాన్న కొఱకు
కట్టుకున్న భార్య కొఱకు
బిడ్డల ప్రాణాల కొఱకు
అమ్మకుండా తప్పలేదు
అంతిమంగ ఆ కళనే
జూలై 20, 2009
Posted by Gijigaadu under
1
వ్యాఖ్యానించండి
పిల్లల తల్లి
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది:20-07-2009
క్కో క్కో క్కో ..క్కో క్కో క్క్కో …
భీతితో ఆకసం వంక
బిత్తర చూపులు చూస్తూ
ఈకలు నిక్కబొడిచి
రెక్కలు బుట్టలా చేసి
గుండ్రంగా తిరుగుతూ కోడి పెట్ట ,
అదనుకోసం ఎదురుచూసి
వేగంగా వేట కొఱకు
నింగి నుంచి దూసుకోస్తూ డేగ ,
తల్లి కోడి సంకేతం
అందుకున్న పిల్లలన్ని
రయ్యిన దూసుకొచ్చి
తల్లి రెక్కల క్రింద భద్రంగా ….
ఆఆఅహ్! భలే చాన్సు పోయిందే !!
సిటి లో కూడా తెలివిమీరి పోతున్నాయ్ …
గొణుక్కుంటూ కాంపౌండు వాలుకు
తట్టుకోబోయి తప్పించుకు ఎగిరిపోతూ డేగ,
వేచి చూసి ఎదురు చూసి
అవకాశం పోతెపోనిమ్మని
నక్కి నక్కి పెరుగు తాగి
మీసం తుడుచుకుంటూ
ఏమీ ఎరగనట్లు దాలి గుంట వేడిలో
తన్మయతన గండు పిల్లి.
చాన్సు కోసం చూసి చూసి
వేసారిన మాలకాకి
దొంగ దొంగ చూపులతో
దోర జామ కాయ కొరికి క్రింద పడవేస్తూ ….
తల్లి కోడి కప్పిన
రెక్కల రక్షణ కవచం నుంచి
తొంగి తొంగి పైకి చూస్తూ
బిత్తరి చూపులతో
ముద్దు ముద్దుగా పిల్లలు
జూలై 18, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
వికృత భావ నృత్య హేల
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :18-07-2009
చెరువులు కొండలు
గుట్టలు పుట్టలు
పంట కాలువలు
పొలం బావులూ
రైళ్ళు ,కారులు
లోయలు కయ్యలు
నదీనదాలు
పర్వత శిఖరం
దూలానికి వేసిన తాడూ
వంటిట్లో వాడే గ్యాసూ
ఔషధశాలల
విషౌషదాలూ
బ్లేడు ముక్కలూ
వడ్లగింజలూ
తలగడ దిండ్లూ ….
యాసిడు బుడ్లూ
కత్తులూ తుపాకి గుళ్ళూ
హత్యలకైనా
ఆత్మ హత్యలకైనా
కావాలా ?
అఖ్ఖరలేదు!!!
దుర్మార్గం నిండిన
మనసులు
క్రూరత్వం పండిన
తలపులు
సమాజాన
ఏ కొనలో వున్నా
విషాదాల వికృత నాట్యం
విశృంఖల వికటాట్ట హాసం
జూలై 17, 2009
Posted by Gijigaadu under
expressions
2 వ్యాఖ్యలు
వుచిత సలహా
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :18-07-2009
అడగందే సలహాలివ్వకు
అక్కయినా చెల్లయినా
అన్నయినా తమ్ముడయిన
అమ్మయినా నాన్నయినా
తెలియని సలహాలివ్వకు
తెలివంతా నీ సొంతమని
అడిగిందే తడవనుకొని
ఆత్రంగా ఎగేసుకుంటూ
వూరుకెంత మంచిదయినా
ప్రజలకెంత పనికొచ్చిన
వుచితంగా సలహాలివ్వకు
వూరువాడ యీసడించు
జూలై 15, 2009
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
బాంధవ్యాలు
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది :15-07-2009
లౌకిక జీవన విధి విధాన
సంవిధాన చలనంలో
సంఘర్షణా
ప్రకంపనల తాడనా
పీడనల నేపధ్యం లో
వివేచనా లోచనా మధన
సంశోధనలు, వేదనలు ,
భావోద్భవ మమతా
ప్రవాహ తరంగిణులు
మస్తిష్కాల నుండి
బయల్వేడల జూస్తున్నాయ్ !!!
తోటి మస్తిష్కాన్ని చేర జూస్తున్నాయ్
కాని !!!
అహంకారపు పొరలు పాషా ణాల్లా
అడ్డుకొంటున్నాయ్…..
తునిగి తుత్తునియలై పోతూ
ఆవిరవుతూ
అనురాగభరిత వీక్షణా లేపనలు
మది మది ఒంటరిదై
పలకరింపు కరువై
వూరడింపు మరుగై
అడుగంటిపోతూ
ఆప్యాయితా ఆలింగన మధురిమలు.
చిద్రమౌతూ మానవ బాంధవ్యాలు .
తర్వాత పేజీ »