నా బ్లాగ్ రచనా జీవితం
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
     తేది:03-07-2009
 
ఎప్పటి నుండో దానికోసం
ఎదురు చూస్తూ  నేను ….
అను నిత్యం ఇదో
 నిత్య  ప్రహసనం    
సహనం  నశిస్తూన్నా వహిస్తూ
(వహించక చస్తామా )
అయినా సహానానికైనా
హద్దుండాలి కదా
 
అమ్మయ్య!ఇప్పటికైనా..
.అది … అదే కరెంటు
వచ్చింది
వచ్చింది కదా
 అని ఆత్రంగా
 
ల్యాపు టాపుచేత బట్టి  
ఏదో ( కీ బోర్డ్ మీద) పొడిచేద్దామని …
 
ఆలోచనలకో ఆకారం యిచ్చి
పుడుం గాడిలా నా
బ్లాగులో ప్రచురిద్దామని
 
తీరా …చూద్దునుకదా
ఇంటర్నెట్ అంతరాయం 
ఓ  సందేశం 
అంతరాయాలే   నిరంతరమై  
నిరంతరం అంతరాలతో
నా బ్లాగ్ జీవన వ్యవహారం   
కరెంటు వుంటే నెట్టుండదు
నెట్టుంటే కరెంటుండదు
రెండూ వుంటే స్పీడుండదు.
అన్నీ వుంటే బ్లాగేందుకు కడకు
నాకడ సమయముండదు ..
 
అంతరాయాలే   నిరంతరమై 
అవరోధాలే అనంతమై  
నిరాశావహ మై……
నా బ్లాగ్ రచనా  జీవనం.