బాంధవ్యాలు

   రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
           తేది :15-07-2009
 
      లౌకిక జీవన  విధి విధాన
       సంవిధాన చలనంలో
             సంఘర్షణా    
        ప్రకంపనల  తాడనా  
       పీడనల  నేపధ్యం లో
 
    వివేచనా లోచనా మధన
     సంశోధనలు, వేదనలు ,   
      భావోద్భవ మమతా
     ప్రవాహ  తరంగిణులు
 
        మస్తిష్కాల  నుండి
  బయల్వేడల జూస్తున్నాయ్ !!!
తోటి మస్తిష్కాన్ని చేర జూస్తున్నాయ్
               కాని !!!
  అహంకారపు పొరలు పాషా ణాల్లా 
       అడ్డుకొంటున్నాయ్…..
    తునిగి తుత్తునియలై పోతూ
       మానవ బంధనాలు 
           ఆవిరవుతూ
   అనురాగభరిత వీక్షణా లేపనలు 
       మది మది ఒంటరిదై 
       పలకరింపు కరువై  
       వూరడింపు  మరుగై 
          అడుగంటిపోతూ
ఆప్యాయితా ఆలింగన మధురిమలు. 
చిద్రమౌతూ   మానవ బాంధవ్యాలు   .