వికృత భావ నృత్య హేల
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :18-07-2009
చెరువులు కొండలు
గుట్టలు పుట్టలు
పంట కాలువలు
పొలం బావులూ
రైళ్ళు ,కారులు
లోయలు కయ్యలు
నదీనదాలు
పర్వత శిఖరం
దూలానికి వేసిన తాడూ
వంటిట్లో వాడే గ్యాసూ
ఔషధశాలల
విషౌషదాలూ
బ్లేడు ముక్కలూ
వడ్లగింజలూ
తలగడ దిండ్లూ ….
యాసిడు బుడ్లూ
కత్తులూ తుపాకి గుళ్ళూ
హత్యలకైనా
ఆత్మ హత్యలకైనా
కావాలా ?
అఖ్ఖరలేదు!!!
దుర్మార్గం నిండిన
మనసులు
క్రూరత్వం పండిన
తలపులు
సమాజాన
ఏ కొనలో వున్నా
విషాదాల వికృత నాట్యం
విశృంఖల వికటాట్ట హాసం
స్పందించండి